Anupama Parameswaran (Image Source: X)
ఎంటర్‌టైన్మెంట్

Anupama Parameswaran: అనుపమపై అసభ్యకర పోస్ట్‌లు పెట్టిన వ్యక్తిని పట్టేశారట!

Anupama Parameswaran: నటి అనుపమ పరమేశ్వరన్ (Anupama Parameswaran) ఆన్‌లైన్ వేధింపులకు (Online Harassment) గురయ్యారు. కొద్ది రోజులుగా తనపై, తన కుటుంబ సభ్యులపై, స్నేహితులపై అత్యంత అసభ్యకరమైన, అబద్ధపు కంటెంట్‌ను ప్రచారం చేస్తున్న నకిలీ ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలపై ఆమె తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సంఘటనపై ఆమె కేరళ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేయగా, పోలీసులు వెంటనే స్పందించి వేధింపులకు పాల్పడిన వ్యక్తిని గుర్తించినట్లు ఆమె తెలిపారు. అనుపమ పరమేశ్వరన్ తన అధికారిక ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఈ వేధింపుల గురించి వివరంగా పోస్ట్ చేశారు. ఆమె పోస్ట్ ప్రకారం..

Also Read- Shiva Re Release: జెన్-జి‌ని మెప్పించే కంటెంట్‌లో ‘శివ’లో ఏముంది? ఎందుకు ఈ సినిమా చూడాలి?

టార్గెటెడ్ వేధింపులు, మార్ఫింగ్ చిత్రాలు

కొద్ది రోజుల క్రితం ఒక ఇన్‌స్టాగ్రామ్ ప్రొఫైల్ తనపై, తన కుటుంబంపై, స్నేహితులు, సహనటులపై అసభ్యకరమైన, తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేయడం ఆమె దృష్టికి వచ్చింది. ఈ పోస్టుల్లో మార్ఫింగ్ చేసిన చిత్రాలు, పూర్తిగా నిరాధారమైన ఆరోపణలు ఉన్నాయని, ఈ టార్గెటెడ్ వేధింపులు తనను తీవ్రంగా కలచివేశాయని అనుపమ పేర్కొన్నారు. దీనిపై మరింతగా విచారణ జరపగా.., అదే వ్యక్తి ఉద్దేశపూర్వకంగా పలు నకిలీ సోషల్ మీడియా ఖాతాలను (Social Media Accounts) సృష్టించి, తనకు సంబంధించిన ప్రతి పోస్ట్‌పై విద్వేషపూరిత, హానికరమైన కంటెంట్‌ను పోస్ట్ చేస్తూ, కామెంట్లు పెడుతున్నట్లు తెలిసిందని అనుపమ చెప్పుకొచ్చింది.

Also Read- Jana Nayagan: ‘జన నాయగన్’ కచేరి లిరికల్ వచ్చేసింది.. ‘భగవంత్ కేసరి’ సాంగ్ దించేశారుగా!

సైబర్ క్రైమ్ స్పందన- నిందితుడి గుర్తింపు

ఈ ఆన్‌లైన్ వేధింపుల విషయం తెలియగానే, అనుపమ ఏ మాత్రం ఆలస్యం చేయకుండా కేరళలోని సైబర్ క్రైమ్ (Cyber Crime) పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసుల స్పందన చాలా వేగంగా, సమర్థవంతంగా ఉందని అనుపమ తన పోస్ట్‌లో ప్రశంసించారు. సైబర్ క్రైమ్ పోలీసుల సహాయంతో, ఈ అసభ్యకర పోస్ట్‌ల వెనుక ఉన్న వ్యక్తిని విజయవంతంగా గుర్తించినట్లు ఆమె తెలిపారు. ఈ వేధింపులకు పాల్పడిన వ్యక్తిపై చట్టపరమైన చర్యలు ఏ విధంగా ఉండబోతున్నాయనే విషయంపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది. ఈ చర్య ముఖ్యంగా ఆన్‌లైన్‌లో తప్పుడు సమాచారం, వేధింపులకు పాల్పడే వారికి గట్టి హెచ్చరికగా నిలుస్తుంది. సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో ప్రముఖులు ఇలాంటి వేధింపులను ఎదుర్కోవడం సర్వసాధారణంగా మారిన తరుణంలో, అనుపమ ధైర్యంగా స్పందించడం పట్ల ఆమె అభిమానులు, ప్రేక్షకులు అండగా నిలుస్తున్నారు. కొందరు సెలబ్రిటీలు కూడా ఆమెకు సపోర్ట్ ఈ చేస్తూ ఈ పోస్ట్‌కు కామెంట్స్ చేశారు. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అనుపమ పరమేశ్వరన్ సినిమాల విషయానికి వస్తే.. ఇటీవల ఆమె ‘కిష్కింధపురి’ సినిమాతో మంచి హిట్ అందుకున్నారు. హీరోలతో సినిమాలు చేస్తూనే.. సోలోగానూ ఆమె కొన్ని సినిమాలు చేసేందుకు ప్రయత్నాలు చేస్తూ, మంచి గుర్తింపును సొంతం చేసుకుంటున్నారు.

">

స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

Just In

01

Anupama Parameswaran: అనుపమపై అసభ్యకర పోస్ట్‌లు పెట్టిన వ్యక్తిని పట్టేశారట!

Sreeleela: శ్రీలీల సపోర్ట్‌‌తో.. ప్రియదర్శి, ఆనందిల ‘పెళ్లి షురూ’

Janhvi Kapoor: మళ్లీ అందాలేనా? ఈసారైనా పెర్ఫార్మెన్స్‌తో మెప్పిస్తుందా?

Shiva Re Release: జెన్-జి‌ని మెప్పించే కంటెంట్‌ ‘శివ’లో ఏముంది? ఎందుకు ఈ సినిమా చూడాలి?

Andhra King Taluka: ‘ఫస్ట్ డే ఫస్ట్ షో’ సాంగ్ అప్డేట్ వచ్చేసింది.. ఎప్పుడంటే?