Vishwambhara: తరచుగా టాలీవుడ్ లో జరిగే సినిమా విశేషాలను ఏదో ఒక సందర్భంలో మెగాస్టార్ చిరంజీవి లీక్ చేస్తూ ఉంటారు. దానికి తెలుగు సినిమా ప్రేక్షకులు అందరూ ‘చిరు’ లీక్స్‌గా పేరు పెట్టుకున్నారు. అయితే ఈ సారి చిరు సినిమానే స్టోరీనే లీక్ చేశారు ఆ సినిమా దర్శకుడు. మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) హీరోగా, ‘బింబిసార’ సినిమాతో మంచి హిట్ అందుకున్న వశిష్ఠ దర్శకుడిగా తెరకెక్కుతున్న సోషియో ఫాంటసీ ఫిల్మ్ ‘విశ్వంభర’(Vishwambhara). ఇప్పటికే ఈ సినిమా కథ గురించి అనేక రూమర్లు వచ్చాయి. ఈ సారి ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న దర్శకుడు ఈ సినిమా స్టోరీ లైనే చెప్పేశారు. ఈ వీడియో చూసిన చిరు అభిమానులు దర్శకుడిపై మండి పడుతున్నారు. ఇలా స్టోరీలైన్ చెప్పేస్తే సినిమా చూడటానికి ఆసక్తి ఏమ్ ఉంటుందని వారు అంటున్నారు. అయితే దర్శకుడు చెప్పింది అంతా సినిమా ప్రమోషన్ లో భాగమే అంటూ సినిమా క్రిటిక్స్ చెబుతున్నారు.
Read also- Masood Azhar: పీవోకేలో మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాది మసూద్ అజార్.. పసిగట్టిన ఇంటలిజెన్స్
అసలు దర్శకుడు చెప్పిన స్టోరీ ఏంటంటే.. మనకు మొత్తం 14 లోకాలు ఉన్నాయని, ఇప్పటివరకూ ఈ 14 లోకాలనూ ఎవరికి తోచిన విధంగా వారు చూపించారని అన్నారు. యమలోకం, స్వర్గ, పాతాళలోకం.. ఇలా అన్నిటినీ చూశాం. కానీ వాటిని మించిన లోకం ఒకటి ఉంటుంది. దానిని చూపించడానికి ప్రయత్నిస్తున్నా అన్నారు. విశ్వంభరలో 14 లోకాలన్నింటినీ దాటి పైకి వెళ్లి బ్రహ్మదేవుడు ఉండే సత్యలోకాన్ని ఇందులో చూపించానన్నారు. ఈ 14 లోకాలకు అదే బేస్‌అని, హీరో డైరెక్ట్‌గా ఆ లోకానికి ఎలా వెళ్తాడు? హీరోయిన్‌ను ఎలా తిరిగి తెచ్చుకుంటాడు? అనేదే ఈ సినిమా కథ అని దర్శకుడు చెప్పేశారు. అయితే ఈ సినిమాలో దాదాపు 70 శాతానికి పైగా వీఎఫ్ఎక్స్ ఉంటుందన్నారు. చిరుతో ఒక సాంగ్ తప్పితే దాదాపు షూటింగ్ మొత్తం పూర్తయిందని అన్నారు.
Read also- Kota And Babu Mohan: నాకు కూడా కోటన్న లాంటి చావే రావాలని దేవుడ్ని కోరుకుంటా.. బాబు మోహన్
ఈ సినిమాలో గ్రాఫిక్స్ అంచనాలు మించి ఉంటాయని ఇప్పటికే దర్శకుడు పలు సందర్భాలలో తెలిపారు. దీనిని ప్రపంచంలోనే టాప్ వీఎఫ్ఎక్స్ చేసే కంపెనీ దీనికోసం పనిచేస్తుందని చెప్పుకొచ్చారు. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలు చూస్తుంటే అంచనాలను మించి ఉన్నాయి. పాన్ ఇండియా స్థాయిలో రూపొందుతున్న ఈ సినిమాలో చిరంజీవి సరసన త్రిష, ఆషికా నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో చిరు పాటను ఆయనే రిమేక్ చేస్తున్నారని టాక్ వినబడుతోంది. ‘ఖైదీ’ సినిమాలో రగులుతోంది మొగలిపొద పాటను సీరియల్ నటి మౌనీరాయ్‌తో తీయనున్నారని సమాచారం.
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు.