Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవిపై జరుగుతున్న ట్రోలింగ్‌పై ‘బేబి’ నిర్మాత స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. రీసెంట్‌గా ‘బ్రహ్మా ఆనందం’ మూవీ ప్రీ రిలీజ్ వేడుకలో మనవరాళ్ల ఫొటోను ఉద్దేశించి మాట్లాడుతూ.. ఇంటినిండా ఆడపిల్లలతో ఇళ్లంతా ఆడపిల్లల హాస్టల్‌లా ఉందని, వారి మధ్యలో తనొక వార్డెన్‌లా ఉన్నానంటూ చిరంజీవి చమత్కరించారు. ఆ చమత్కారపు మాటలే ఇప్పుడు చిరంజీవిని వివాదంలోకి నెట్టాయి. చిరంజీవి వంటి వ్యక్తి, అందునా పద్మ విభూషణ్ బిరుదాంకితుడైనటువంటి వ్యక్తి అలా ఎలా మాట్లాడతారు? మగవారికేనా వారసత్వం, ఆడపిల్లలకు ఉండదా? అంటూ చిరంజీవిపై కొందరు కావాలని సోషల్ మీడియాలో పోస్ట్‌ల యుద్ధం చేస్తున్నారు. ఈ యుద్ధంపై ‘బేబి’ చిత్ర నిర్మాత ఎస్‌కెఎన్ ఫైర్ అవుతూ.. ట్రోలింగ్ చేసే వారంతా శునకానందం పొందుతున్నారంటూ సంచలన ట్వీట్ చేశారు.
Also Read- Samantha: ఎట్టకేలకు విడాకులకు కారణం చెప్పిన సమంత!
చిరంజీవి ఇంట్లో 5గురు మనవరాళ్లు ఉన్నారు. ఇంట్లో అంతా ఆడపిల్లలే. వారందరినీ చూస్తే హాస్టల్‌లా ఉంటుందని సరదాగా జోక్ చేశారు. వారి మధ్యలో ఒక మనవడు ఉంటే బాగుంటుందని అన్నారు. అందులో తప్పుపట్టాల్సిన అవసరం లేనే లేదు అంటూ ఉన్న పోస్ట్‌కి రియాక్ట్ అవుతూ.. ‘‘అవును నిజం.పెళ్లిళ్లు చేసి అత్తారింటికి సాగనంపిన చెల్లెళ్లకి సైతం తన స్వార్జిత ఆస్తులు పంచిన వ్యక్తిత్వం మెగాస్టార్‌ది. ఆయన నిండైన ఫ్యామిలీ మ్యాన్.. ఎవరినీ ఏమి అనని మనిషి కదా! ఊరికే అవాకులు చెవాకులు పేలటం అనవసరంగా రాద్ధాంతం చేయటం తద్వారా ఒకరోజు శునకానందం పొందటం కొందరికి అలవాటు’’ అంటూ ఎస్.కె.ఎన్ తన పోస్ట్‌లో పేర్కొన్నారు.
True. పెళ్లిళ్లు చేసి అత్తారింటికి సాగనంపిన చెల్లెళ్లకి సైతం తన స్వార్జిత ఆస్తులు పంచిన వ్యక్తిత్వ్యం ఆయనది ….నిండైన ఫామిలీ మాన్ ఎవరిని ఏమి అనని మనిషి కదా ఊరికే అవాకులు చెవాకులు పేలటం అనవసరంగా రాద్ధాంతం చేయటం తద్వారా ఒకరోజు శునకానందం పొందటం కొందరికి అలవాటు https://t.co/grMBkAIFIK
— SKN (Sreenivasa Kumar) (@SKNonline) February 13, 2025
నిజమే కదా.. ఇంట్లో అందరూ ఆడపిల్లలు ఉంటే, ఒక పిల్లాడు ఉంటే బాగుంటుందని ఎవరైనా అనుకుంటారు. ఆ విషయం సరదాగా ఒక పబ్లిక్ ఫంక్షన్‌లో చిరు చెప్పారు. అసలు ఇంట్లో ఉన్న మగాళ్లకంటే, ఇంట్లోని ఆడవాళ్లే ఎక్కువగా ఒక బాబు ఉంటే బాగుంటుందని కోరుకుంటూ ఉంటారు. చిరు ఇంట్లో కూడా అంతా అదే కోరుకుంటున్నారనేది చిరు మాటలని బట్టి అర్థమవుతుంది. అందులో ఆడవారిని కించపరచడం కానీ, తక్కువ చేయడం కానీ ఎక్కడా లేదు. ఐదుగురు మనవరాళ్ల మధ్య ఒక మనవడు ఉండాలని కోరుకోవడం ముమ్మాటికి తప్పు కాదు. ఈ విషయాన్ని టార్గెట్ చేస్తూ చిరంజీవిపై ట్రోల్ చేస్తున్నారంటే.. నిజంగా ఆ నిర్మాత చెప్పినట్లుగా ట్రోలర్స్‌ది శునకానందమే.
ఇవి కూడా చదవండి: