Bigg Boss Telugu 9: బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 (Bigg Boss Telugu Season 9) రెండో వీకెండ్‌కు చేరుకుంది. కింగ్ నాగార్జున (King Nagarjuna) హౌస్‌మేట్స్‌తో సంభాషించే రోజు వచ్చేసింది. డే 13 (Bigg Boss Day 13 Promo), శనివారం జరిగే ఎపిసోడ్‌కు సంబంధించి మేకర్స్ తాజాగా ఓ ప్రోమోని వదిలారు. ఈ ప్రోమోని చూస్తుంటే.. ఈ వారం రీతూ చేసిన రచ్చపై ఆమెకు కింగ్ నాగార్జున తలంటేసినట్లుగా అర్థమవుతోంది. కెప్టెన్సీ టాస్క్‌లో సంచాలక్‌గా ఉన్న ఆమె చేసిన కుట్రని బయటపెట్టిన నాగార్జున, ఈ వారం కెప్టెన్ అయిన డీమాన్ పవన్‌ను కెప్టెన్సీ నుంచి తొలగించినట్లుగా ఈ ప్రోమో క్లారిటీ ఇచ్చేస్తుంది. అసలు ఈ ప్రోమోలో ఉన్న విషయం ఏమిటంటే..
Also Read- Hema: ‘మా’ ప్రెసిడెంట్ సిస్టర్‌కే ఈ గతి పడితే.. మంచు లక్ష్మికి సపోర్ట్‌గా హేమ సంచలన వీడియో!
కింగ్ నాగ్ ఆసక్తికర ప్రశ్నలు
‘వీళ్ళలో ఇవాళ ఎవరికి రంగు పడుద్దో చూద్దాం’ అని కింగ్ నాగ్ ఎపిసోడ్‌ని స్టార్ చేశారు. కెప్టెన్సీ టాస్క్‌లో డీమాన్ పవన్ కెప్టెన్ కావడానికి అర్హుడేనా? అతను గెలిచిన తీరు కరెక్టేనా? అని నాగార్జున ప్రశ్నించగా, ‘ఎవరైనా సరే స్టాప్ అని చెప్పినప్పుడు వెంటనే ఆపకపోతే మాత్రం గేమ్ నుంచి ఎలిమినేట్ చేసేస్తానని ఆల్రెడీ చెప్పింది రీతు’ అని కళ్యాణ్ నాగార్జునకు చెప్పారు. వెంటనే ఈ వీడియోలు చూడు అని ఆ టాస్క్‌లో ఏం జరిగిందో నాగ్ చూపించారు. డీమాన్ పవన్ పేరును పుష్ చేసింది.. అని నాకు అనగానే రీతూ లేచి నేనే సార్ అని చెప్పింది.
కావాలని మ్యానిఫెస్ట్ చేస్తున్నావు
‘స్టాప్ అన్న తర్వాత కూడా భరణిని నువ్వే ఎలిమినేట్ చేశావు’, ‘తనూజ, సంజన వీళ్ళందరూ చెప్తున్నా కూడా.. నువ్వు వాళ్ళు చెప్పింది అసలు కన్సిడర్ కూడా చేయలేదు’, ‘నువ్వు మొదటి నుంచి పవన్ కెప్టెన్ కావాలని మ్యానిఫెస్ట్ చేస్తున్నావు’.. అని వరుస ప్రశ్నలతో రీతూ చౌదరికి నాగార్జున తలంటేశారు. ‘హౌస్‌లో ఎంతమంది ఈ ప్రాసెస్ కరెక్ట్ కాదు అని అనుకుంటున్నారు’ అని నాగార్జున అడగగానే రీతూ కాకుండా మిగతా అందరూ చేతులు ఎత్తారు. వెంటనే నాగార్జున డీమాన్ పవన్‌ని ఉద్దేశించి ‘Your Captaincy is Revoked’ అని సంచలన ప్రకటన చేశారు. అంతే అందరూ ఆశ్చర్యపోయారు. అంతేకాదు, వెంటనే చేతి నుంచి కెప్టెన్సీ బ్యాండ్‌ని కూడా తొలగిస్తున్నట్లుగా ఈ ప్రోమోలో చూపించారు. మొత్తంగా అయితే ఈ ప్రోమోతో ఎపిసోడ్‌పై మంచి ఇంట్రెస్ట్‌ని క్రియేట్ చేశారు. ఈ వారం బిగ్ బాస్ చూసిన వాళ్లంతా అనుకున్న మాటలు నాగ్ నోట వెంట రావడంతో.. హ్యాపీగా ఫీలవుతున్నారు. మరి ఈ ప్రోమోతోనే ఆసక్తి రేకెత్తించిన నాగ్.. శని, ఆది వారాలు ఎలాంటి ఎంటర్‌టైన్‌మెంట్ చేయనున్నారో, ఎవరిని ఎలిమినేట్ చేయబోతున్నారో తెలియాల్సి ఉంది.
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు