Bigg Boss Telugu: బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 ఆసక్తికరంగా సాగుతోంది. సోమవారం నామినేషన్స్ ఎపిసోడ్.. వీక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. ముఖ్యంగా భరణి వర్సెస్ తనూజ, భరణి వర్సెస్ దివ్య, తనూజ వర్సెస్ దివ్య మధ్య జరిగిన వాదోపవాదనలు నిన్నటి ఎపిసోడ్ ను రక్తి కట్టించాయి. ఇదిలా ఉంటే మంగళవారానికి సంబంధించిన ఎపిసోడ్ ప్రోమోను తాజాగా బిగ్ బాస్ టీమ్ విడుదల చేసింది. ఈ వారం కెప్టెన్సీ టాస్క్ ను వినూత్నంగా బిగ్ బాస్ ప్లాన్ చేసినట్లు ప్రోమోను బట్టి తెలుస్తోంది.
ప్రోమోలో ఏముందంటే?
బిగ్ బాస్ టీమ్ హౌస్ లో ఒక ల్యాండ్ లైన్ ఫోన్ ను ఏర్పాటు చేసింది. ప్రోమో ప్రారంభంలో ఆ ఫోన్ ఒక్కసారిగా మోగుతుంది. దీంతో తనూజ పరిగెత్తుకెళ్లి ఆ ఫోన్ ను లిఫ్ట్ చేస్తుంది. ఫోన్ కాల్ ఏంటో తెలుసుకునేందుకు ఇంటి సభ్యులు ఆమె చుట్టూ చేరి ఆసక్తిరంగా వినేందుకు యత్నిస్తారు. అప్పుడు తనూజతో బిగ్ బాస్ మాట్లాడుతూ ‘మీ చుట్టూ ఉన్నవారందరూ మన మాటలు వింటున్నారు. వారిని దూరంగా వెళ్లమని చెప్పండి’ అని అంటాడు. అప్పుడు తనూజ వారిని దూరంగా పంపేస్తుంది. ఇక తనూజతో బిగ్ బాస్ మాట్లాడుతూ ‘ఇప్పటి నుంచి కంటెండర్స్ షిప్ టాస్క్ మెుదలైంది. ఈ విషయాన్ని అందరికీ చెప్పండి’ అని అంటాడు.
గేమ్ షురూ చేసిన తనూజ
బిగ్ బాస్ ఫోన్ పెట్టగానే.. ఇంటి సభ్యులు తనూజ వద్దకు వచ్చి ఏం చెప్పారని ప్రశ్నిస్తారు. అప్పుడు తనూజ మాట్లాడుతూ.. ‘కెప్టెన్సీ కంటెండర్ గురించి బిగ్ బాస్ ఇక ఏది ఉన్నా ఫోన్ లోనే మాట్లాడతారంట’ అని సమాధానం ఇస్తుంది. అయితే తనూజ మాటలను ఇంటి సభ్యులు ఎవరు నమ్మకపోవడాన్ని ప్రోమోలో గమనించవచ్చు. ‘నీకు సీక్రెట్ టాస్క్ ఇచ్చారు. దాన్ని కవర్ చేయడం అస్సలు రావట్లేదు’ అని తనూజతో రీతూ అంటుంది. నెక్ట్స్ వచ్చే కాల్ ను ఎత్తినవారు కంటెండర్ అని ఏమి లేదుగా? అని దివ్య అనగా.. ఎవరు ఫోన్ ఎత్తుతారో అది వారి ఇష్టం అని తనూజ సమాధానం ఇస్తుంది.
Also Read: Coimbatore Crime: ప్రియుడితో షికారుకొచ్చిన విద్యార్థిని.. ఎత్తుకెళ్లి అత్యాచారం చేసిన మృగాళ్లు.. పోలీసులు ఏం చేశారంటే?
రీతూతో మాట్లాడిన బిగ్ బాస్
అయితే మరోమారు ఫోన్ మోగడాన్ని ప్రోమోలో గమనించవచ్చు. ఈ సారి ఫోన్ ను సంజనా లిఫ్ట్ చేస్తుంది. అప్పుడు బిగ్ బాస్ ఫోన్ ను రీతూకి ఇవ్వమని చెప్తాడు. రీతూతో మాట్లాడుతూ ‘తనూజ చెప్పిన దాని గురించి మీరేం అనుకుంటున్నారు?’ అని ప్రశ్నిస్తారు. అప్పుడు రీతు బదిలిస్తూ ‘నేను నమ్మడం లేదు బిగ్ బాస్’ అని అంటుంది. అప్పుడు బిగ్ బాస్ ‘గుడ్ జాబ్’ అని రీతూని అంటాడు. ‘ఎందుకంటే ఈ టాస్క్ లో నమ్మకమే అతి ముఖ్యం. ఒక్క విషయం కన్ఫార్మ్ చేస్తున్న టాస్క్ ఇప్పటికే మెుదలైంది’ అని బిగ్ బాస్ స్పష్టం చేయడంతో ప్రోమో ముగిసింది.
