Bigg Boss Buzzz: తెలుగు రియాలిటీ షో చరిత్రలో సరికొత్త అధ్యాయం లిఖిస్తూ ‘బిగ్ బాస్ తెలుగు సీజన్ 9’ (Bigg Boss Telugu Season 9) విజేతగా నిలిచాడు కళ్యాణ్ పడాల (Kalyan Padala). హౌస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత శివాజీ (Sivaji) హోస్ట్‌గా వ్యవహరించిన ‘బిగ్ బాస్ బజ్’ (Bigg Boss Buzzz) ఎగ్జిట్ ఇంటర్వ్యూలో పాల్గొన్న కళ్యాణ్, తన 105 రోజుల జర్నీకి సంబంధించి అనేక విషయాలను పంచుకున్నారు. ఈ ఇంటర్వ్యూకి సంబంధించిన ప్రోమోని ప్రస్తుతం బిగ్ బాస్ టీమ్ విడుదల చేసింది. ఈ ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ అవుతూ.. కళ్యాణ్ ఫ్యాన్స్‌ని బాగా ఆకట్టుకుంటోంది. ఈ ప్రోమోని గమనిస్తే.. ఒక సాధారణ యువకుడిగా హౌస్‌లోకి అడుగుపెట్టిన కళ్యాణ్, తన ఆటతీరుతో నిజంగానే ‘సోల్జర్’గా తన సత్తా చాటాడు. తన గ్రామంలో కూడా ఎవరికీ తెలియని ఒక సామాన్యుడిని ఈరోజు తెలుగు రాష్ట్రాల్లో అందరికీ తెలిసేలా చేసిన బిగ్ బాస్ వేదికకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఈ విజయం కేవలం తనది మాత్రమే కాదని, తనను నమ్మిన ప్రేక్షకులందరిదని ఆయన పేర్కొన్నారు.
Also Read- Thanuja: ముగింపు కాదు.. కొత్త అధ్యాయానికి ఆరంభం.. తనూజ ఎమోషనల్ పోస్ట్ వైరల్!
తననే తాను చెక్కుకున్న శిల్పి
కళ్యాణ్ తన ఆటలో చూపించిన దూకుడుకు, మనోధైర్యానికి కారణం దివ్య అని శివాజీ చెప్పిన మాటలను కళ్యాణ్ అంగీకరించాడు. దివ్య మాటలు తనలో స్ఫూర్తిని రగిల్చాయని చెబుతూ.. ఆమెకు థ్యాంక్స్ చెప్పాడు. అలాగే, హౌస్‌లో తనూజతో ఉన్న స్నేహం, నామినేషన్ల సమయంలో పడిన ఇబ్బందులు, ఇతర కంటెస్టెంట్లతో తనకున్న అనుబంధం కూడా ఆయన వివరించారు. ‘తననే తాను చెక్కుకున్న శిల్పి వీడు’ అని కళ్యాణ్ గురించి ఒక్క మాటలో శివాజీ చెప్పేశారు. అంతేకాదు, కాసేపు ఆట కూడా పట్టించారు. ‘హౌస్‌లో ఏంటి అంతా మీ చుట్టాలే కనబడతారు నీకు. అత్తమ్మ, గాళ్ ఫ్రెండ్, ఎక్స్‌లు’ అనగానే కళ్యాణ్ సిగ్గుపడిపోయాడు. ‘తనూజ కోసం ఏంటి నామినేషన్‌లోకి వెళ్లడానికి కూడా రెడీ అయ్యావ్’ అని అనగానే కళ్యాణ్ ఫేస్ మారిపోయింది. ‘మీ ఫ్రెండ్ ఓ రూ. 15 లక్షలు తీసుకెళ్లిపోయాడుగా.. ఏం ఫీలింగ్ లేదుగా.. ఇద్దరూ కలిసి బాగానే పంచుకున్నారు అయితే’ అని శివాజీ అనగానే.. ‘డిమాన్ కూడా మిడిల్ క్లాస్ ఫ్యామిలీనే.. అలాంటి ఫీలింగ్ అస్సలు లేదని, చాలా హ్యాపీ’ అని కళ్యాణ్ సమాధానమిచ్చాడు.
Also Read- Demon Pavan: డిమోన్ పవన్ రైట్ డెసిషన్.. సూట్‌కేస్ తీసుకోకుండా ఉంటేనా?
స్టార్ హీరో కంటే ‘గొప్ప నటుడు’ అనిపించుకోవడమే లక్ష్యం
కళ్యాణ్ తన భవిష్యత్ ప్రణాళికల గురించి మాట్లాడుతూ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ‘తనకు కేవలం స్టార్, హీరో అనిపించుకోవడం కంటే, ఒక ‘గొప్ప నటుడు’ (Great Actor) అనిపించుకోవడమే ఇష్టం’ అని తన ఆకాంక్షను తెలియజేశాడు. విభిన్నమైన పాత్రలు చేస్తూ ప్రేక్షకుల మనసు గెలవడమే తన తదుపరి లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు. ఇంత వరకు తీసుకువచ్చిన ఆడియెన్స్, అభిమానులందరికీ ఎప్పటికీ రుణపడి ఉంటానని పేర్కొన్నాడు. ఇక ఇంటర్వ్యూ చివరిలో శివాజీ, కళ్యాణ్ కలిసి కేక్ కట్ చేసి విజయోత్సవాన్ని జరుపుకున్నారు. ఓ సామాన్యుడు పట్టుదలతో పోరాడితే విజయం వరిస్తుందని కళ్యాణ్ నిరూపించారంటూ శివాజీ ఆయనను అభినందించారు.
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

