Thanuja: తెలుగు స్మాల్ స్ర్కీన్‌పై అత్యంత ఆదరణ పొందిన రియాలిటీ షో ‘బిగ్ బాస్ తెలుగు సీజన్ 9’ (Bigg Boss Telugu Season 9) ఆదివారం రాత్రి అట్టహాసంగా ముగిసింది. ఈ సీజన్‌లో టైటిల్ ఫేవరెట్‌గా బరిలోకి దిగి, చివరి వరకు పోరాడి రన్నరప్‌గా నిలిచింది తనూజ పుట్టస్వామి (Thanuja Puttaswamy). హౌస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత తనూజ తన అభిమానుల కోసం గుండెలు పిండేసేలా ఓ పోస్ట్‌ను షేర్ చేసింది. ఈ పోస్ట్ ప్రస్తుతం వైరల్ అవుతోంది. ఈ పోస్ట్‌లో..
నిజాయితీతో కూడిన ప్రయాణం
‘ఈ ప్రయాణం అంత సులభం కాదు, కానీ ఎప్పుడూ నిజాయితీగానే సాగింది’ అంటూ తనూజ తన మనసులోని మాటలను పంచుకుంది. 105 రోజుల పాటు ఆ నాలుగు గోడల మధ్య తను అనుభవించిన నవ్వులు, కన్నీళ్లు, ఓటములు, ఆ తర్వాత సాధించిన గెలుపులను ఆమె గుర్తు చేసుకుంది. ప్రతి టాస్క్‌ను నిజాయితీగా ఆడటమే కాకుండా, ఎన్ని సవాళ్లు ఎదురైనా తన వ్యక్తిత్వాన్ని కోల్పోకుండా ఉండటమే తన అసలైన విజయమని పేర్కొంది.
Also Read- Shambhala: ‘శంబాల’తో నాన్న కోరిక తీరుతుంది- ఆది సాయి కుమార్
ప్రేక్షకుల ఓటే నా బలం
బిగ్ బాస్ హౌస్‌లో తనూజ మౌనంగా ఉన్న సమయంలో కూడా ఆమెకు మద్దతుగా నిలిచిన అభిమానులకు ఆమె కృతజ్ఞతలు తెలిపింది. ‘మీ ప్రేమ నా మౌనాన్ని బలంగా మార్చింది, మీ ఓట్లు నా వాయిస్‌గా మారాయి, మీ నమ్మకమే నా అతిపెద్ద విజయం’ అంటూ తనూజ భావోద్వేగానికి లోనైంది. టైటిల్ మిస్ అయినప్పటికీ, ప్రేక్షకుల హృదయాలను గెలుచుకోవడం పట్ల ఆమె గర్వంగా ఉందని తెలిపింది.
రూ. 20 లక్షల గోల్డెన్ బ్రీఫ్‌కేస్ ఆఫర్‌ను తిరస్కరించి..
ఈ సీజన్‌లో తనూజ విన్నర్‌గా నిలుస్తుందని, బిగ్ బాస్ తెలుగు చరిత్రలో తొలి మహిళా విజేత అవుతుందని ఆమె అభిమానులు ఆశించారు. ఫైనల్ రేసులో కామనర్ కంటెస్టెంట్ కళ్యాణ్ పడాల (Kalyan Padala) విజేతగా నిలవగా, తనూజ రన్నరప్‌గా నిలిచింది. ఫినాలేలో నాగార్జున (King Nagarjuna) ఇచ్చిన రూ. 20 లక్షల గోల్డెన్ బ్రీఫ్‌కేస్ ఆఫర్‌ను సైతం తిరస్కరించి, ప్రేక్షకుల ఓట్లపై ఉన్న నమ్మకంతో గెలుపు కోసం చివరి వరకు వేచి చూడటం ఆమెలోని ఆత్మవిశ్వాసానికి నిదర్శనం.
Also Read- Anil Ravipudi: ‘AI’ ని ఇలా పద్ధతిగా కూడా వాడుకోవచ్చు.. అనిల్ రావిపూడి పోస్ట్ వైరల్!
ముగింపు కాదు.. సరికొత్త ఆరంభం
‘బిగ్ బాస్ హౌస్ నుంచి ఈరోజు నేను సెలవు తీసుకుంటున్నాను, కానీ మీతో ఏర్పడిన ఈ బంధం ఎప్పటికీ శాశ్వతం. ఇది ముగింపు కాదు, మీ ప్రేమతో మొదలయ్యే సరికొత్త అధ్యాయం’ అంటూ తనూజ తన పోస్ట్‌ను ముగించింది. ‘ముద్ద మందారం’ సీరియల్ నుంచి బిగ్ బాస్ రన్నరప్ వరకు ఆమె సాగించిన ఈ సుదీర్ఘ ప్రయాణం ఎంతో మందికి స్ఫూర్తిదాయకమని చెప్పుకోవచ్చు. ఇప్పుడొచ్చిన గుర్తింపుతో తనూజ ఎలాంటి అవకాశాలను సొంతం చేసుకుంటుందో వేచి చూడాల్సి ఉంది.
Thank you, BiggBoss Season 9.
This journey was never easy, but it was always real.
Inside those walls, I laughed, I cried, I fell, I stood back up, stronger every time.
I played every task with honesty, faced every challenge with courage,
and stayed true to myself no matter how… pic.twitter.com/NK1CNf6GlV— THANUJA PUTTASWAMY (@ThanujaP123) December 22, 2025
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

