anuskha( image :X)
ఎంటర్‌టైన్మెంట్

Ghati Release Glimpse Out:‘ఘాటి’ రిలీజ్ గ్లింప్స్ చూశారా.. జేజమ్మ ఆ నరుకుడేంటి గురూ..

Ghati Release Glimpse Out: అనుష్క శెట్టి హీరోయిన్‌గా నటిస్తున్న ‘ఘాటి’ చిత్రం ఒక యాక్షన్ డ్రామాగా రూపొందుతోంది. ఇది సెప్టెంబర్ 5, 2025న థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానుంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన రిలీజ్ గ్లింప్స్ విడుదల చేశారు నిర్మాతలు. ప్రముఖ దర్శకుడు క్రిష్ జాగర్లమూడి ఈ సినిమాను తెరకెక్కించారు. అనుష్క శెట్టి కెరీర్‌లో ఇది మరో మైలురాయిగా నిలిచే అవకాశం ఉందని అభిమానులు ఆశిస్తున్నారు. ‘ఘాటి’ అంటే లోయ అని అర్థం. ఈ చిత్రం ఆంధ్రా-ఒడిశా సరిహద్దులోని అరకు వ్యాలీ నేపథ్యంలో గంజాయి స్మగ్లింగ్ చుట్టూ తిరిగే కథతో రూపొందింది. కల్పిత కథ అయినప్పటికీ, సమాజంలోని గంజాయి సమస్యను హైలైట్ చేస్తూ సానుకూల సందేశాన్ని అందిస్తుంది. అనుష్క శెట్టి ఈ సినిమాలో శీలావతి అనే బలమైన పాత్రలో కనిపిస్తుంది. ఈ పాత్ర గంజాయి స్మగ్లింగ్‌లో చిక్కుకున్న ఒక కూలీగా, తన సమాజాన్ని కాపాడేందుకు పోరాడుతుంది. ఈ పాత్ర ఆమె కెరీర్‌లో కొత్త రకమైన షేడ్‌ను చూపిస్తుందని ఆమె స్వయంగా పేర్కొన్నారు.

Read also-Kavitha: ఈ ఇద్దరి అవినీతి వల్లే కేసీఆర్‌పై సీబీఐ విచారణ.. కవిత సంచలన కామెంట్స్

అనుష్క శెట్టి ఈ చిత్రంలో శీలావతి అనే పాత్రలో కనిపిస్తుంది. ఇది ఆమె కెరీర్‌లో ఒక కొత్త షేడ్‌ను పరిచయం చేస్తుందని క్రిష్ పేర్కొన్నారు. శీలావతి ఒక కూలీగా గంజాయి స్మగ్లింగ్‌లో చిక్కుకుని, తన సమాజాన్ని కాపాడేందుకు పోరాడే బలమైన మహిళగా చిత్రీకరించబడింది. క్రిష్ ఒక ఇంటర్వ్యూలో, “అనుష్క గతంలో ‘అరుంధతి’, ‘రుద్రమదేవి’, ‘భాగమతి’ వంటి చిత్రాల్లో శక్తివంతమైన పాత్రలు చేసింది. కానీ ‘ఘాటీ’లో శీలావతి పాత్ర ఆమె కెరీర్‌లో ఒక మైలురాయిగా నిలుస్తుంది. ఆమె పెర్ఫార్మన్స్ ప్రేక్షకులను ఆశ్చర్యపరుస్తుందిఅని చెప్పారు. దీనిని బట్టి చూస్తుంటే ఈ సినిమాపై భారీ అంచనాలు పెట్టుకున్నారు అభిమానులు.

Read also-Duddilla Sridhar Babu: తెలంగాణ ఏఐ క్యాపిటల్‌గా మారటానికి జాగర్ గ్లోబల్ సెంటర్ కీలక పాత్ర!

దీనిని బాహుబలి ప్రభాస్ విడుదల చేశారు. అయిదే ఈ గ్లింప్స్ చూస్తుంటే.. అనుష్క యాక్షన్ సన్నివేశాలు అదరగొట్టేసింది. ఫైట్స్ చేస్తుంటే అక్కడ ఉన్నది స్వీటీనా.. లేక బాహుబలినా అనేంతలా ఇందులో స్వీటి కనిపించారు. ఆద్యంతం అనుష్క ఫైట్ చేస్తూనే కనిపిస్తుంది. యాక్షన్ కు తగ్గట్టుగా సంగీతం ఆకట్టుకునేలా ఉంది. గ్లింప్స్ చివరిలోవాళ్లూరుకోరు వీళ్లూరుకోరు అంటే నేనూ ఊరుకోను’ డైలాగ్ అనుష్క అభిమానులను పూనకాలు పుట్టించేలా ఉంది. ఈ సినిమా డైలాగులు చూస్తుంటే ఈ సినిమా హిట్ కొట్టేసిందనే చెప్పాలి. అనుష్కను మళ్లీ తెరపై చూసేందుకు అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఏది ఏమైనా ఈ సినిమాపై ఇప్పటికే అభిమానుల్లో భారీ హైప్ నెలకొంది.

Just In

01

Minister Sridhar Babu: పరిశ్రమల ఏర్పాటుకు ఇక్కడ అన్నీ అనుకూలమే!

CBI Director Praveen Sood: హైదరాబాద్ వచ్చిన సీబీఐ డైరెక్టర్ ప్రవీణ్​ సూద్.. అందుకోసమేనా..?

Jajula Surender: సమీక్షలు కాదు సత్వర చర్యలు చేయండి: జాజుల సురేందర్

KTR: రాబోయే ఆరు నెలల్లో ఉప ఎన్నికలు ఖాయం.. కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు

Expand Dog Squad: రాష్ట్రంలో నేరాలను తగ్గించేందుకు పోలీసులు సంచలన నిర్ణయం..?