Duddilla Sridhar Babu: తెలంగాణను ‘ఏఐ కేపిటల్ ఆఫ్ ది గ్లోబ్’ గా మార్చడమే ప్రజా ప్రభుత్వ సంకల్పమని మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు(Minister Duddilla Sridhar Babu) అన్నారు. పకడ్బందీ కార్యాచరణతో ఆ దిశగా ముందుకు సాగుతున్నామని పేర్కొన్నారు. హైటెక్ సిటీలో అమెరికా ఎంటర్‌ప్రైజ్ ప్రొక్యూర్‌మెంట్, సప్లయర్ కొలాబరేషన్ సంస్థ జాగర్ గ్లోబల్ కేపబిలిటీ సెంటర్ (జీసీసీ)ను బుధవారం మంత్రి ప్రారంభించి మాట్లాడారు. అన్ని రంగాలకు చెందిన ప్రపంచ దిగ్గజ సంస్థలకు హైదరాబాద్(Hyderabad) గమ్యస్థానంగా మారిందని, ఈ జాబితాలో జాగర్ కూడా చేరడంతో తెలంగాణ బ్రాండ్ మరింత విశ్వవ్యాప్తం అవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. కొత్తగా ప్రారంభమైన ఈ జీసీసీ ద్వారా కొత్తగా 180 మందికి ఉపాధి లభిస్తుందన్నారు. రాబోయే రోజుల్లో ఆ సంఖ్య 500కు చేరుతుందని వివరించారు. ‘జాగర్ ఏఐ ప్లాట్ ఫాం, ఏఐ ఆధారిత ప్రొక్యూర్‌మెంట్ పరిష్కారాల అభివృద్ధికి ఈ జీసీసీ ఒక వ్యూహాత్మక కేంద్రంగా పనిచేస్తుందన్నారు.
Also Read: Hair Loss Solution: మీకు బట్టతల ఉందా.. అయితే, నెలకు రూ. 50 వేలు మీ అకౌంట్లో పడినట్లే?
100 జీసీసీలను కొత్తగా
ప్రపంచవ్యాప్తంగా తయారీ, విద్య, ఎఫ్‌ఎంసీజీ, రిటైల్ తదితర రంగాలకు సాఫ్ట్‌వేర్, క్లౌడ్ ఆపరేషన్ సేవలను అందిస్తుందని తెలిపారు. జీసీసీల ఏర్పాటుకు తెలంగాణ అనుకూలం అని, దేశంలోనే ఎక్కడా లేని విధంగా గతేడాదిలో 70 జీసీసీలు హైదరాబాద్(Hyderabad)లో ప్రారంభమయ్యాయన్నారు. ఈ ఏడాది 100 జీసీసీలను కొత్తగా ప్రారంభించాలని లక్ష్యంగా ఎంచుకున్నామన్నారు. ఏఐ రంగంలో తెలంగాణను అగ్రగామిగా నిలిపేందుకు ప్రత్యేకంగా ఏఐ సిటీని అభివృద్ధి చేస్తున్నామని వెల్లడించారు. ప్రపంచానికి ఏఐ నిపుణులను అందించేలా అంతర్జాతీయ ప్రమాణాలతో ఏఐ యూనివర్సిటీ, ఏఐ ఇన్నోవేషన్ హబ్ ను ఏర్పాటు చేయబోతున్నట్లు ప్రకటించారు. కార్యక్రమంలో జాగర్ సీఈఓ ఆండ్రూ రోస్కో, గోపీనాథ్ పాల్గొన్నారు.
Also Read: Chikoti Praveen: కవిత భాగస్వామ్యం లేకుండా అవినీతి జరిగిందా?.. చికోటి ప్రవీణ్ ఘాటు వ్యాఖ్యలు