Kerala YouTuber: ఈ రోజుల్లో చాలామంది మగ వాళ్ళను వేధిస్తున్న అతి పెద్ద సమస్య బట్టతల. దీంతో, కొందరు బయటకు వెళ్లాలన్నా కూడా ఇబ్బంది పడతారు. దీని వలన కొందరు ఆత్మ హత్య చేసుకున్న వాళ్ళని కూడా చూశాము. ఎందుకంటే, ఇది అంత బాధను కలిగిస్తుంది. మారిన జీవన విధానం, ఆహారపు అలవాట్ల కారణంగా చాలామందికి బట్టతల వచ్చేస్తుంది. పెళ్లి చేసుకునే సమయానికి బట్టతల వస్తుంది. దీంతో, కొందరు విగ్గులు, హెయిర్ ట్రాన్స్ ఫ్లాంటేషన్ కోసం వేలకు వేలు రూపాయలు ఖర్చు పెడుతున్నారు.
ఈ యూట్యూబర్ ఆలోచనకు ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే!
అయితే, ఓ వ్యక్తి మాత్రం తనకు బట్టతల వచ్చిందని చాలా సంతోష పడుతున్నాడు. ఎందుకంటే, దానిని క్యాష్ చేసుకొని డబ్బులు విపరీతంగా డబ్బు సంపాదిస్తూ నిలిచాడు. అతడే, కేరళకు చెందిన ట్రావెల్ వ్లాగర్ షఫీక్ హసీం. తనకు బట్టతల వచ్చిందని బాధ పడకుండా ఎందరికో ఆదర్శంగా నిలుస్తున్నాడు. అతను మళ్లీ తల మీ హెయిర్ ను తెప్పించే ప్రయత్నం చేయకుండా.. దానిని ఒక బోర్డ్ గా చేశాడు. తన బట్ట తలను అద్భుతమైన బ్రాండింగ్ తో నెలకు రూ.50 వేలు సంపాదిస్తున్నాడు షఫీక్ హసీం.
ఒక్క ఇడియా జీవితాన్నే మార్చేసింది!
అలప్పుజా జిల్లాకు చెందిన 36 ఏళ్ల షఫీక్ హసీం, కేరళ, సౌదీ అరేబియాలో ప్రోగ్రామ్ నిర్మాతగా, డిజిటల్ కంటెంట్ సృష్టికర్తగా పనిచేసిన అనుభవం ఉంది. తన ‘70mm Vlogs’ యూట్యూబ్ ఛానెల్‌తో ట్రావెల్ వ్లాగర్‌గా పేరు తెచ్చుకున్నాడు. యవ్వనంలోనే అతని తలపై జుట్టు రాలిపోయి బట్టతల వచ్చింది. స్నేహితుల ఎగతాళికి మొదట్లో పెద్దగా పట్టించుకోని షఫీక్, బాడీ షేమింగ్ తీవ్రమవడంతో హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్ చేయించుకోవాలనుకున్నాడు. కానీ, ఆ నిర్ణయం తీసుకునే ముందు అతని మనసులో ఓ సరికొత్త ఆలోచన వచ్చింది. బట్టతల ఒక సహజమైన విషయం, దీనిలో సిగ్గుపడాల్సిన పని లేదు, దీన్ని ఎలా ఒక అవకాశంగా మలచుకోవచ్చని బాగా ఆలోచించాడు.
బట్టతలతో నెలకు రూ.50,000 సంపాదిస్తున్నాడు?
“తెలివైన వారికే బట్టతల వస్తుందని అంటారు, కదా” అని సరదాగా ఆలోచించిన షఫీక్, తన బట్టతలను ఒక వినూత్న బ్రాండింగ్ వేదికగా మార్చాలని భావించాడు. తన యూట్యూబ్ వీడియోల్లో కంపెనీల లోగోలను తాత్కాలిక టాటూల రూపంలో తన బట్టతలపై ప్రదర్శించే ఆలోచనను సోషల్ మీడియాలో పంచుకున్నాడు. ఈ ఆలోచన ఒక్కసారిగా వైరల్ అయింది, మీడియా, కార్పొరేట్ సంస్థల దృష్టిని ఆకర్షించింది. కొచ్చిలోని ‘లా డెన్సిటే’ అనే హెయిర్ అండ్ స్కిన్ క్లినిక్ సంస్థ వెంటనే అతన్ని సంప్రదించి, ఒక ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ఒప్పందం ప్రకారం, షఫీక్ తన బట్టతలపై ఆ కంపెనీ లోగోను తాత్కాలిక టాటూగా వేయించుకుని, మూడు నెలల్లో మూడు వీడియోలను తీస్తాడు. ఈ వినూత్న ప్రకటనల ద్వారా అతను నెలకు రూ.50,000 సంపాదిస్తున్నాడు.