Purusha Movie: అతివలతో యుద్ధాలు చేయాల్సి వస్తే..
purisha( image :X)
ఎంటర్‌టైన్‌మెంట్

Purusha Movie: అతివల కోసం చేసే యుద్ధాలు వారితోనే చేయాల్సి వస్తే.. కాన్సెప్ట్ కొత్తగా ఉందిగా..

Purusha Movie: తెలుగు ప్రేక్షకులు రొటీన్ కు భిన్నంగా వచ్చిన సినిమాలను ఎప్పుడూ ఆదరిస్తూనే ఉంటారు. తాజాగా అలాంటి జోనర్ నుంచే ‘పురుష’ అనే మూవీ వస్తుంది. ఇప్పుడు ఈ సినిమా కు సంబంధించి పోస్టర్ లను విడుదల చేశారు నిర్మాతలు. ఆ పోస్టర్లను చూస్తుంటే చరిత్రలో ఎవరూ చేయని సాహసం చేశారనిపిస్తుంది. ప్రతీ మగాడి యుద్ధం (విజయం) వెనక ఓ ఆడది ఉంటుంది.. స్వేచ్ఛ కోసం భర్త చేసే అలుపెరగని పోరాటం అంటూ ఇలా డిఫరెంట్ క్యాప్షన్స్‌తో రకరకాల పోస్టర్లను రిలీజ్ చేస్తూ అంచనాలు క్రియేట్ చేశారు ‘పురుష’ మూవీ టీం. బత్తుల సరస్వతి సమర్పణలో కళ్యాణ్ ప్రొడక్షన్స్ బ్యానర్ మీద బత్తుల కోటేశ్వరరావు తన తనయుడు పవన్ కళ్యాణ్‌ను హీరోగా పరిచయం చేస్తూ నిర్మిస్తున్న చిత్రం ‘పురుష’. ఈ సినిమాకు వీరు వులవల దర్శకత్వం వహిస్తున్నారు.

Read also-Shambala Movie: ‘శంబాల’ మూవీ ఏ ఒక్కరినీ నిరాశపర్చదు.. ఆది సాయికుమార్

ఈ కామెడీ బేస్డ్ చిత్రంలో పవన్ కళ్యాణ్, సప్తగిరి, కసిరెడ్డి రాజకుమార్ ప్రధాన పాత్రల్లో నటించారు. వెన్నెల కిషోర్, వి.టి.వి.గణేష్, అనంత శ్రీరామ్, రాజీవ్ కనకాల,పమ్మి సాయి, మిర్చి కిరణ్ వంటి కమెడియన్స్ అద్భుతమైన పాత్రల్ని పోషిస్తున్నారు. అవుట్ అండ్ అవుట్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ ఇచ్చే ఈ మూవీలో వైష్ణవి కొక్కుర, విషిక, హాసిని సుధీర్‌లు కథానాయికలుగా నటిస్తున్నారు. గబి రాక్, అనైరా గుప్తా కీలక పాత్రలు పోషించారు. చిత్రీకరణ ముగియడంతో యూనిట్ అంతా కూడా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు ప్రారంభించింది. అందులో భాగంగానే వివిధ రకాల పోస్టర్లను వెరైటీగా డిజైన్ చేసి ప్రేక్షకులకు చేరువ చేశారు. దీంతో ఈ సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి.

Read also-Pithapuramlo: పవన్ కళ్యాణ్ ఇలాకాలో.. షూటింగ్ పూర్తిచేసుకున్న ‘పిఠాపురంలో అలా’

ఎవరూ చేయని విధంగా ఎప్పుడూ డిఫరెంట్ గా ప్రమోట్ చేయాలని మూవీ టీం ఇలా ప్లాన్ చేశారు. అందుకే ‘పురుష:’ టీం డిఫరెంట్ పోస్టర్లు, రకరకాల క్యాప్షన్స్‌తో సినిమా కాన్సెప్ట్‌ను తెలియజేసేలా కంటెంట్‌ను బయటకు వదులుతోంది. ప్రస్తుతం ఈ పోస్టర్లు సినిమా ఎలా ఉండబోతోందనే విషయాన్ని చెప్పకనే చెప్పేస్తున్నాయి. అవుట్ అండ్ అవుట్ కమర్షియల్ కామెడీ ఎంటర్టైనర్‌గా రానున్న ఈ మూవీ రిలీజ్ డేట్‌‌ను త్వరలోనే ప్రకటించనున్నారు. ఈ మూవీకి సినిమాటోగ్రఫర్‌గా సతీష్ ముత్యాల, సంగీత దర్శకుడుగా శ్రవణ్ భరద్వాజ్, ఎడిటర్‌గా కోటి, ఆర్ట్ డైరెక్టర్ గా రవిబాబు దొండపాటి పని చేస్తున్నారు. పవన్ కళ్యాణ్, వైష్ణవి కొక్కుర, విషిక, హాసిని సుధీర్‌లు, శ్రీ సంధ్య, గబి రాక్, అనైరా గుప్తా, వెన్నెల కోషోర్, సప్తగిరి, కసిరెడ్డి రాజకుమార్, పమ్మి సాయి, వి.టి.వి. గణేష్, రాజీవ్ కనకాల, అనంత శ్రీరామ్ తదితరులు ప్రముఖ పాత్రలు పోషిస్తున్నారు. కాస్ట్ బేస్ లో డెప్త్ ఉండటంతో సినిమాను భారీ గానే నిర్మించినట్లు తెలుస్తోంది. ఈ సినిమా కోసం సినిమా ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

Just In

01

Godavari Water Dispute: ఆగని జల కుట్రలు.. కేంద్రంతో ఉన్న సత్సంబంధాలతో మరో భారీ కుట్రకు తెరలేపిన ఏపీ ప్రభుత్వం..?

KCR: నేడు బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్ అధ్యక్షతన మీటింగ్‌!

Gold Rates: తగ్గిన గోల్డ్ రేట్స్.. ఈ రోజు తెలుగు రాష్ట్రాల్లో ధరలు ఎలా ఉన్నాయంటే?

Christmas Celebrations: ఇతర మతాలను కించపరిస్తే చట్టపరంగా శిక్ష తప్పదు: సీఎం రేవంత్ రెడ్డి

HYDRAA: నిజాం నాటి చెరువుకు ప్రాణం పోసిన‌ హైడ్రా!