Anushka Shetty ( Image Source: Twitter)
ఎంటర్‌టైన్మెంట్

Anushka Shetty: ప్రేమ వివాహమే చేసుకుంటా.. ఓపెన్ గా చెప్పేసిన అనుష్క.. షాక్ లో ఆ స్టార్ హీరో?

Anushka Shetty: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుష్క శెట్టి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. బాహుబలి సినిమా తర్వాత ఈ ముద్దుగుమ్మ లైఫ్ మొత్తం ఛేంజ్ అయింది. అయితే, తాజాగా తన వివాహానికి సంబంధించి ఓ ఇంటర్వ్యూలో కీలక వ్యాఖ్యలు చేసింది. ఈ వార్త అనుష్క అభిమానులకు సంతోషాన్ని కలిగించినా, ప్రభాస్ ఫ్యాన్స్‌కు మాత్రం నిరాశను మిగిల్చింది. అసలు అనుష్క ఏం చెప్పిందో ఇక్కడ తెలుసుకుందాం..

Also Read: Aishwarya Rai: ఆరాధ్య కంటే ముందే ఐశ్వర్య రాయ్ కు బాబు పుట్టాడా.. ఆధారాలతో మొదటి బిడ్డ?

ఎందుకంటే, బాహుబలి సినిమా తర్వాత నుంచి ప్రభాస్-అనుష్క పెళ్లి చేసుకుంటారని అభిమానులు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. కానీ, అనుష్క తాజా వ్యాఖ్యలతో వారి కలలపై నీళ్లు చల్లినట్లయింది. ఇటీవలే ఆమె ఓ ఛానెల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఈ బ్యూటీ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ అనుష్క “ఎక్కడికి వెళ్లినా అందరూ నా పెళ్లి గురించే అడుగుతున్నారు. ముఖ్యంగా బాహుబలి సినిమా తర్వాత ఈ ప్రశ్నలు ఎక్కువయ్యాయి. ఇంట్లో వాళ్లు కూడా పెళ్లి గురించి ఒత్తిడి చేశారు. ఈ ఒత్తిడి మధ్య నేను మా పేరెంట్స్‌తో స్పష్టంగా చెప్పాను. కొంచం ఆలస్యం అయినా నేను పెళ్లి చేసుకుంటాను, కానీ ప్రేమించే వ్యక్తిని మాత్రమే పెళ్లి చేసుకుంటాను అని తెలిపింది.

Also Read: Sai Rajesh: ‘బేబి’కి నేషనల్ అవార్డ్స్.. నన్ను ఎవరూ నమ్మని రోజు ఆయన నమ్మాడంటూ డైరెక్టర్ ఎమోషనల్!

అంతే కాకుండా, “అనుష్క తీసుకున్న నిర్ణయానికి తన తల్లిదండ్రుల మద్దతు కూడా ఉందని తెలిపింది. ” సరైన వ్యక్తి నన్ను కలిసినప్పుడు, సరైన సమయం వచ్చినప్పుడు పెళ్లి గురించి గుడ్ న్యూస్ చెబుతాను. కానీ, ఒక విషయంలో క్లారిటీ ఇస్తాను. సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన వ్యక్తిని మాత్రం పెళ్లి చేసుకోను,” అని ఆమె క్లారిటీ ఇచ్చారు. ఈ కామెంట్స్ టాలీవుడ్ లోనే కాకుండా సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారాయి.

Also Read:  Greater Warangal Municipal Corporation: ముంచిన సంస్థకే మళ్లీ అవకాశం?.. విచ్చలవిడిగ కొనసాగిన అక్రమాలు..

ఈ కామెంట్స్ ప్రభాస్-అనుష్క పెళ్లి ఊహాగానాలకు చెక్ పెట్టాయి.ఈ వ్యాఖ్యలతో అభిమానులు షాక్‌లో ఉండగా, కొందరు ఈ మాటలు ప్రభాస్‌తో వస్తున్న రూమర్స్‌ ఆగిపోవాలని ఇలా చెప్పిందని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఇంకొందరు మీరే కాదు, మా ప్రభాస్ అన్న కూడా షాక్ అయి ఉంటాడంటూ కామెంట్స్ చేస్తున్నారు.

Just In

01

SCU: సుజీత్ సినిమాటిక్ యూనివర్స్.. దర్శకనిర్మాతలు క్లారిటీ ఇచ్చేశారుగా..!

Arjun Das: ఓరి నీ అభిమానం చల్లగుండా.. మరీ ఇంత పెద్ద మెసేజ్ ఏంటయ్యా?

Sandeep Raj: ‘ఓజీ’ విడుదల వేళ.. 8 సంవత్సరాల క్రితం చేసిన ట్వీట్‌‌‌తో సంచలనం!

O Cheliya Teaser: హీరో శ్రీకాంత్ వదిలిన ‘ఓ.. చెలియా’ టీజర్ ఎలా ఉందంటే?

Connplex Cinemas: ‘ఓజీ’ సినిమాతో హైదరాబాద్‌లో మరో లగ్జరీ మల్టీప్లెక్స్‌ ప్రారంభం.. వివరాలివే!