Peddi: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Mega Power Star Ram Charan) హీరోగా నటిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘పెద్ది’ (Peddi) షూటింగ్ షెడ్యూల్‌కు అనూహ్యంగా బ్రేక్ పడింది. దేశ రాజధాని ఢిల్లీలోని ఎర్రకోట (Red Fort) సమీపంలో ఇటీవల జరిగిన కారు పేలుడు ఘటన కారణంగా, చిత్ర బృందం తమ షూటింగ్‌ను వాయిదా వేసుకోవాల్సి వచ్చింది. దర్శకుడు బుచ్చిబాబు సానా (Buchibabu Sana) తెరకెక్కిస్తున్న ఈ సినిమాలోని కొన్ని కీలక భాగాల చిత్రీకరణను నవంబర్ 15, 16, 17 తేదీల్లో ఢిల్లీలోని ఎర్రకోట పరిసర ప్రాంతాల్లో ప్లాన్ చేశారు. ఈ మేరకు చిత్ర బృందం సంబంధిత అధికారుల నుంచి అనుమతులు కూడా తీసుకున్నట్లుగా తెలుస్తోంది. అయితే, ఇటీవల ఎర్రకోట సమీపంలో జరిగిన శక్తివంతమైన పేలుడు ఘటనతో ఆ ప్రాంతంలో భద్రతా ఏర్పాట్లు అమాంతం పెరిగిపోయాయి. పోలీసులు ఆ ఏరియాను తమ నియంత్రణలోకి తీసుకుని, కూపీ లాగుతున్నారు. ఈ నేపథ్యంలో, చిత్ర బృందం ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా, అలాగే నటీనటుల, సాంకేతిక నిపుణుల భద్రతను దృష్టిలో ఉంచుకుని షూటింగ్ షెడ్యూల్‌ను తాత్కాలికంగా వాయిదా వేశారని తెలుస్తోంది.
Also Read- Manchu Lakshmi: నాన్నకు, నాకు మధ్య గొడవలకి కారణం విష్ణు.. మంచు లక్ష్మి షాకింగ్ కామెంట్స్
రిలీజ్‌పై నో ఎఫెక్ట్
‘పెద్ది’ షూటింగ్ స్పాట్ పేలుడు జరిగిన చోటుకు కొద్ది దూరంలోనే ఉన్నందున, ఏమాత్రం రిస్క్ తీసుకోకూడదని నిర్మాతలు ఈ నిర్ణయం తీసుకున్నారని సమాచారం. పరిస్థితులు చక్కబడ్డాక, భద్రతాపరమైన ఇబ్బందులు తొలగిపోయిన తర్వాతే కొత్త షెడ్యూల్‌ను ప్రకటించే అవకాశం ఉంది. ఈ తాత్కాలిక వాయిదా ‘పెద్ది’ సినిమా విడుదలను ప్రభావితం చేయకపోవచ్చని తెలుస్తోంది. ఎందుకంటే, ఈ చిత్రాన్ని 2026 మార్చి 27న, రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా, పాన్-ఇండియా స్థాయిలో గ్రాండ్‌గా విడుదల చేయాలని మేకర్స్ ఇప్పటికే ప్రకటించారు. ఇంకా సుమారు నాలుగు నెలల సమయం ఉండటంతో, వాయిదా పడిన సన్నివేశాలను త్వరలోనే పూర్తి చేసి, విడుదల తేదీకి ఎలాంటి అడ్డంకి లేకుండా పనులు కొనసాగే అవకాశం ఉందని భావించవచ్చు.
Also Read- Tollywood: రాఘవేంద్రరావు – నిహారిక.. ఎందుకింత రచ్చ? అందులో ఏముందని?
చికిరి రికార్డుల మోత
రామ్ చరణ్ సరసన బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ (Janhvi Kapoor) హీరోయిన్‌గా నటిస్తున్న ఈ రూరల్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌కు ఏ.ఆర్. రెహమాన్ (AR Rahman) సంగీతం అందిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ‘చికిరి చికిరి’ అనే పాట, రామ్ చరణ్ రస్టిక్ లుక్ సినిమాపై అంచనాలను భారీగా పెంచాయి. శివ రాజ్ కుమార్, జగపతి బాబు, దివ్యేందు శర్మ, బొమన్ ఇరానీ వంటి వారు కీలక పాత్రలలో నటిస్తున్న ఈ చిత్రాన్ని వృద్ధి సినిమాస్ బ్యానర్ పై వెంకట సతీష్ కిలారు ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తుండగా.. మైత్రి మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సమర్పిస్తున్నాయి. ప్రస్తుతం ‘చికిరి’ సాంగ్ రికార్డులను క్రియేట్ చేస్తూ ప్రపంచవ్యాప్తంగా ట్రెండ్ అవుతోంది. త్వరలోనే రెండో సాంగ్‌ను కూడా మేకర్స్ విడుదల చేయనున్నారని తెలుస్తోంది.
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు
