Aishwarya Rai: గత కొన్ని రోజుల నుంచి సోషల్ మీడియాలో ఐశ్వర్యరాయ్, అభిషేక్ పేరు మారు మోగుతుంది. వీరిద్దరూ విడాకులు తీసుకుంటున్నారంటూ ఇప్పటికీ ఎన్నో రకాల వార్తలు వచ్చాయి. అయితే, ఇద్దరూ మంచిగా ఉన్నా కానీ, ఈ రూమర్స్ మాత్రం ఆగలేదు. అయితే, ఈ ముద్దుగుమ్మ మళ్ళీ వార్తల్లో నిలిచింది.
బాలీవుడ్‌లో అందం, అభినయంతో అభిమానుల గుండెల్లో స్థానం సంపాదించిన అతిలోక సుందరి ఐశ్వర్యరాయ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. పాన్ ఇండియా స్థాయిలో ఆమెకు ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. 2007లో అమితాబ్ బచ్చన్ కుమారుడు, నటుడు అభిషేక్ బచ్చన్‌తో ఘనంగా వివాహం చేసుకున్న ఐశ్వర్య, 2011లో వారి కుమార్తె ఆరాధ్య బచ్చన్ కు జన్మనిచ్చింది.ఈ స్టార్ కపుల్ సినిమాల్లో బిజీగా ఉంటూనే, తమ కూతురిని ప్రేమగా, జాగ్రత్తగా పెంచుతున్నారు. అయితే, ఇటీవల వీరిద్దరూ విడాకులు తీసుకోబోతున్నారనే పుకార్లు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి.ఈ వివాదాస్పద వార్తల మధ్య మరో సంచలన న్యూస్ సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. అదేంటో ఇక్కడ తెలుసుకుందాం..
ఏపీకి చెందిన సంగీత్ కుమార్ అనే వ్యక్తి తాను ఐశ్వర్యరాయ్ కుమారుడినని, ఆమె తన 15 ఏళ్ల వయసులో లండన్‌లో IVF టెక్నాలజీ ద్వారా జన్మనిచ్చిందని సంచలన వ్యాఖ్యలు చేశాడు. తన ఫోన్‌లోని కొన్ని ఫోటోలను ఆధారాలుగా చూపిస్తూ మీడియా ముందుకు వచ్చాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారడంతో నెటిజన్లు షాక్ అవుతున్నారు.
అయితే, ఈ వాదనలకు ఎలాంటి డాక్యుమెంటరీ ఆధారాలు లేనట్లు తెలుస్తోంది. సంగీత్ తన బంధువులు ఆధారాలను నాశనం చేశారని ఆరోపిస్తున్నాడు. తన తల్లి అయిన ఐశ్వర్యను మంగళగిరిలో తనతో కలిసి ఉండాలని కోరుకుంటున్నట్లు చెప్పాడు.