AI Viral Video: ఏఐ టెక్నాలజీ వేగంగా అభివృద్ధి చెందుతున్నకొద్దీ, ఏఐ-జనరేటెడ్ వీడియోలు (AI-Generated Video) నిజమైన వీడియోలను తలదన్నేలా ఉంటున్నాయి. క్రమక్రమంగా రియల్ వీడియోలు, ఏఐ వీడియోల మధ్య గీతలు చెరిగిపోతున్నట్టుగా పరిస్థితి మారుతోంది. ఈ తరహా వీడియోలు ఇప్పటికే సోషల్ మీడియాలో (AI Viral Video) కుప్పలుతెప్పలుగా చక్కర్లు కొడుతున్నాయి. ప్రామాణికత విషయంలో హైక్వాలిటీగా ఉంటున్న ఇలాంటి వీడియోలను నటులు, రాజకీయ నేతలు, లేదా ఇతర ప్రముఖుల ముఖచిత్రాలతో రూపొందిస్తున్నారు. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి నెటిజన్లతో వారెవా అనిపించేలా ఉంది.
మాలీవుడ్ సూపర్‌స్టార్, దిగ్గజ నటుడు మోహన్‌లాల్, యాక్టర్ కమ్ డైరెక్టర్ అయిన బాసిల్ జోసఫ్ ఇద్దరి ముఖచిత్రాలను ఉపయోగించి రూపొందించిన ఒక ఏఐ ఫన్నీ వీడియో సోషల్ మీడియాలో వ్యూస్ సునామీ సృష్టిస్తోంది. వైరల్‌గా మారిన ఈ వీడియో క్లిప్‌లో మోహన్‌లాల్ ఒక తెల్లటి టీ-షర్ట్, హెడ్‌సెట్ ధరించి విమానంలో ప్రయాణిస్తున్నట్టు కనిపించాడు. అయితే, విమానాన్ని నడుపుతున్న పైలట్ హాస్యనటుడు సలీం కుమార్ అని గుర్తించిన వెంటనే, మోహల్‌లాల్ విమానం నుంచి దూకేశాడు.
అయితే, భూమిపై ఓ టీకొట్టు ముందు తాపీగా ఛాయ్ తాగుతూ పైకి గమనించిన బాసిల్ జోసఫ్.. కిందపడుతున్న మోహన్‌లాల్‌ను గమనిస్తాడు. వెంటనే టీ పక్కన పెట్టేసి సూపర్‌మ్యాన్ వేషధారణలోకి మారిపోయాడు. గాల్లోకి దూసుకెళ్లి మోహన్‌లాల్‌ను రెస్క్యూ చేసి కాపాడుతాడు. భద్రంగా పట్టుకొని కిందకు దించుతాడు. ఇహఫిక్స్ (ihafix) అనే ఇన్‌స్టాగ్రామర్ షేర్ చేసిన ఈ ఏఐ వీడియో నిజంగా అద్భుతంగా ఉంది. చిన్నపాటి సినిమా సీన్‌ను తలపించింది. అందుకే, నెటిజన్లు ఫిదా అయిపోతున్నారు. అందుకే, వీడియో కూడా తక్కువ సమయంలోనే వైరల్‌గా మారిపోయింది.
ఈ వీడియో చూసిన బాసిల్ జోసఫ్ కూడా స్పందించాడు. ‘‘ఔట్ ఆఫ్ సిలబస్ సూపర్‌మ్యాన్’’ అంటూ ఫన్నీ కామెంట్ చేశాడు. వినోదాత్మకంగా ఉన్న ఈ వీడియో నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటోంది.
యాక్షన్ డ్రామాలో మోహన్‌లాల్
ఏఐ వీడియో విషయాన్ని పక్కనపెడితే, సూపర్‌స్టార్ మోహన్‌లాల్ త్వరలోనే భారీ యాక్షన్-డ్రామా మూవీతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ‘వృషభ’ (Vrusshabha) అనే టైటిల్‌లో సినిమా రూపుదిద్దుకుంటోంది. నంద కిషోర్ ఈ మూవీకి దర్శకత్వం వహిస్తున్నారు. మోహన్‌లాల్‌తో పాటు, సమర్జిత్ లంకేష్, షానయా కపూర్, జహ్రా ఎస్.ఖాన్, శ్రీకాంత్, రాఘిని ద్వివేది, తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమాను శోభా కపూర్, ఏక్తా కపూర్‌లు బాలాజీ మోషన్ పిక్చర్స్ బ్యానర్‌పై ఇతర నిర్మాణ సంస్థలతో కలిసి నిర్మిస్తున్నారు. తెలుగు, మలయాళ భాషల్లో ఒకేసారి చిత్రీకరిస్తున్నారు. మొత్తం ఐదు భాషల్లో విడుదల చేయాలని చిత్రబృందం భావిస్తోంది. ఈ సినిమా మీద ఇప్పటికే చాలా అంచనాలున్నాయి.
Read Also- Viral Video: ఇంటి పనిలో గొడవ.. జుట్లు పట్టుకొని కొట్టుకున్న అత్తా కోడళ్లు.. వీడియో వైరల్