Venkatesh: వెంకటేష్ దగ్గుబాటి.. రీల్ లైఫ్‌లో ప్రత్యేకంగా ఫ్యామిలీ ఆడియన్స్‌కు ఎంత కనెక్ట్ అయ్యే సినిమాలు చేస్తాడో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. నవ్వించాలన్నా, ఏడిపించాలన్నా వెంకీ మామకు కనెక్ట్ అయినట్లు ఆడియెన్స్ ఏ ఇతర హీరోలకు కనెక్ట్ అవ్వలేరేమో. వాస్తవ జీవితంలోనూ వెంకీ మామ చాలా ప్రశాంతమైన లైఫ్ స్టైల్‌ని లీడ్ చేస్తుంటాడు. సోషల్ మీడియాలోనూ కాంట్రవర్సీలకు దూరంగా.. పాజిటివ్ మైండ్ సెట్‌ని బిల్డ్ చేసే పోస్టులను షేర్ చేస్తుంటాడు. తాజాగా ఆయన, జీవితానికి అవసరమైన కొన్ని టిప్స్‌ని షేర్ చేశాడు.
1. నెమ్మదిగా మాట్లాడండి- ఆత్రం లేకుండా విషయాన్ని సౌమ్యంగా వ్యక్తపరచడం.
2. సునిశితంగా గమనించండి- కంగారు పడటం, ఆవేశ పడటం కన్నా ముందు ఒక ప్రాబ్లమ్ లేదా టాస్క్ ని జాగ్రత్తగా అబ్జర్వ్ చేయడం మంచిది.
3. తక్కువ మాట్లాడండి- అనవసరంగా ఎక్కువ మాట్లాడకుండా.. మాట్లాడాల్సినంత మాత్రమే మాట్లాడితే మానసిక ఆరోగ్యానికి ఉత్తమం.
4. ఎల్లప్పుడూ మీ ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇవ్వండి- ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు. ఆరోగ్యానికి మించిన సిరిసంపదలు మరొకటి ఉండవు. మీ ఆరోగ్యంపై మీరు ఫోకస్ చేస్తే.. అన్ని కంట్రోల్ లోనే ఉన్నట్లు కనిపిస్తాయి.
5. స్వీయ విద్య- సొంతంగా ఒక పనిని నేర్చుకోవడం ఎప్పుడు ఆపేయవద్దు.
6. అహం, కోరికలు, కోపం నియంత్రణ- ఈ మూడింటిని కంట్రోల్ చేసుకోవడమే విజయానికి ప్రధానం
7. మరింత నవ్వండి, చింతించడం ఆపేయండి- నవ్వడానికి కారణాలు వెతకండి.. చింతించటానికి కాదు
8. ఫ్యామిలీ కంటే ఏది ఎక్కువ కాదు- కుటుంబం కంటే ఏది ఎక్కువ కాదు.. మొదటి ప్రాధాన్యం కుటుంబానికే ఇవ్వండి.
Also Read- Samantha: ఎట్టకేలకు విడాకులకు కారణం చెప్పిన సమంత!
ఇక వెంకటేష్ ఈ సంక్రాంతికి ‘సంక్రాంతికి వస్తున్నాం’ చిత్రంతో చరిత్రలు తిరగరాసిన విషయం తెలిసిందే. ఓవరాల్‌గా రూ. 300 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించి.. బిగ్గెస్ట్ తెలుగు రీజినల్ హిట్ సినిమాగా నిలిచింది. అంతకు ముందు ఈ రికార్డ్ రూ. 250 కోట్ల కలెక్షన్స్‌తో అల్లు అర్జున్ ‘అల వైకుంఠపురములో’ పేరు మీద ఉండేది.
ఇవి కూడా చదవండి: