Love Affair Murder: నర్సాపూర్ రాయరావు చెరువు వద్ద వ్యక్తి దారుణ హత్య
మెదక్ బ్యూరో, స్వేచ్ఛ: మెదక్ జిల్లా (Medak District) నర్సాపూర్ మండల కేంద్రంలోని రాయరావు వద్ద దారుణం జరిగింది. ఉత్తర ప్రదేశ్ (Uttar Pradesh) రాష్ట్రానికి చెందిన ఓ వ్యక్తి దారుణ హత్యకు (Love Affair Murder) గురయ్యాడు. అతడి వయసు సుమారుగా 25 సంవత్సరాలు ఉంటుందని, అతడి పేరు ఫరూక్ అన్సారీ అని పోలీసులు గుర్తించారు. ఈ మేరకు దర్యాప్తు చేపట్టారు. మృతుడి భార్య సల్మా ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు దర్యాప్తు ప్రారంభించినట్టు వివరించారు. ప్రేమ వ్యవహారమే ఈ హత్యకు కారణమని డీఎస్పీ నరేందర్ గౌడ్ వెల్లడించారు. ఉత్తరప్రదేశ్‌కు శబ్బర్ అనే ఓ వ్యక్తి భార్యతో మృతుడు ఫరూక్ అన్సారీకి ప్రేమ వ్యవహారం ఉన్నట్టుగా సల్మా ఫిర్యాదులో పేర్కొందని చెప్పారు. దర్యాప్తు చేపట్టిన పోలీసులు, సోమవారం గత రాత్రి అన్సారీని శబ్బర్ తీసుకెళ్లాడని, మద్యం తాగించి, మరికొందరు వ్యక్తులతో కలిసి దారుణంగా హత్య చేసినట్లు పోలీసులు గుర్తించారు. మృతుడి ఒంటిపై తీవ్రమైన 9 కత్తిపోట్లు ఉన్నట్టు గుర్తించినట్లు పేర్కొన్నారు. పూర్తిస్థాయిలో విచారణ చేపట్టి నిందితులను పట్టుకుంటామని డీఎస్పీ నరేందర్ గౌడ్, సీఐ జాన్ రెడ్డి, ఎస్సై రంజిత్ కుమార్ రెడ్డి తెలిపారు.
Read Also- Mad Dogs Attack: బాబోయ్.. భూపాలపల్లిలో పిచ్చికుక్కల బీభత్సం.. 10 మందికిపైగా గాయాలు
లోన్ యాప్‌కు యువకుడి బలి
హనుమకొండ, స్వేచ్ఛ: తీసుకున్న అప్పు తీర్చలేక, లోన్ యాప్ నిర్వాహకులు పెట్టే వేధింపులు భరించలేక మనస్తాపం చెంది మరో ప్రాణం పోయింది. హనుమకొండలోని అమరావతి నగర్ టీవీ టవర్ కాలనీకి చెందిన గోలి నవీన్ రెడ్డి అనే యువకుడు మంగళవారం ఆత్మహత్యకు పాల్పడ్డాడు. చైనాకు చెందిన యాప్‌లో లోన్ తీసుకొని చెల్లించకపోవడంతో, అతడి ఫొటోలను యాప్ నిర్వాహకులు మార్ఫింగ్ చేశారు. వాటిని వాట్సాప్‌లో షేర్ చేశారు. దీంతో మనస్తాపానికి గురైన నవీన్, వేధింపులు తట్టుకోలేక సమీపంలో ఉన్న వడ్డేపల్లి-దేవన్నపేట మధ్యలోని బావిలో దూకాడు. ప్రాణాలు కోల్పోయాడు. మృతదేహాన్ని వెలికి తీసిన పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు. మృతుడి కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేయూ పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నారు.
