Mad-Dogs (Image source Swetcha)
తెలంగాణ, లేటెస్ట్ న్యూస్

Mad Dogs Attack: బాబోయ్.. భూపాలపల్లిలో పిచ్చికుక్కల బీభత్సం.. 10 మందికిపైగా గాయాలు

Mad Dogs Attack: జిల్లాలోని మహాదేవపూర్ మండలంలో ఘటన

పిచ్చి కుక్కల స్వైరవిహారం
10 మందికిపైగా తీవ్ర గాయాలు… ఆస్పత్రికి తరలింపు

భూపాలపల్లి, స్వేచ్ఛ: జయశంకర్ భూపాలపల్లి జిల్లా (Bhupalapally District) మహాదేవపూర్ మండలంలో పిచ్చి కుక్కలు (Mad Dogs Attack) బీభత్సం సృష్టించాయి. ఇష్టానురీతిన స్వైర విహారం చేశాయి. కుక్కల దాడిలో ఏకంగా 10 మందికి పైగా గాయపడ్డారు. అందరినీ చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. పొలం పనులకు వెళ్లిన స్థానిక రైతులపై దాడి చేసినట్టు స్థానికులు చెబుతున్నారు. పిచ్చికుక్కల దాడులు ఎక్కువవుతుండడంతో బయటకు వెళ్లేందుకు ప్రజలు భయపడే పరిస్థితులు నెలకొన్నాయి. పట్టణాల్లో, గ్రామాలలో వీధి కుక్కల బెడద లేకుండా చూడాలని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసినప్పటికీ, సంబంధిత అధికారులు ఇప్పటివరకు చర్యలు తీసుకోవడం లేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. గ్రామాల్లోని ప్రజలు బెంబేలెత్తుతున్నా ఎవరూ పట్టించుకోవడం లేదని మొరపెడుతున్నారు. ఇప్పటికైనా గ్రామ పంచాయతీ అధికారులు స్పంచింది విధికుక్కల బెడద లేకుండా చూడాలని కోరుకుంటున్నారు.

Read Also- Mufthi Police: ఇన్వెస్టిగేషన్‌లో కొత్త కోణంలో చూపించనున్న “మఫ్టీ పోలీస్”.. వచ్చేది ఎప్పుడంటే?

పొలం పనులు చేసుకుంటుంటే కుక్క దాడి చేయడంతో రైతులు ఇబ్బంది పడ్డారని గ్రామస్తులు పేర్కొన్నారు. గ్రామ పంచాయతీ అధికారులు స్పందించి కుక్కలు లేకుండా చూడాలని విజ్ఞప్తి చేస్తున్నారు. మహాదేవపూర్ ప్రభుత్వ ఆస్పత్రి సూపరిండెంట్ మాట్లాడుతూ.. కుక్కల కాటుతో ఒక్క మంగళవారం నాడే 12 మంది హాస్పిటల్‌కు వచ్చారని తెలిపారు. వారికి ఇంజెక్టన్ వేసి పంపించామని వెల్లడించారు. పెద్దగా గాయాలు కాకపోవడంతో ఇబ్బంది లేదని అన్నారు. కుక్కకాటు వేసిన వెంటనే గాయం అయిన ప్రాంతం అంతా సబ్బుతో శుభ్రంగా కడగాలని, అలా చేస్తే ఇన్ఫెక్షన్ ఉంటే పోతుందని సూచించారు. ఆ తరువాత దగ్గరలో ఉన్న హాస్పిటల్‌కు తీసుకెళ్లాలని, పెద్ద గాయమైతే భూపాలపల్లి జిల్లా హాస్పిటల్‌కి రిఫర్ చేస్తామని అధికారి వివరించారు.

Read Also- Chhinnamasta Devi: రాజమౌళి ‘వారణాసి’ గ్లింప్స్‌లో కనిపించిన శిరస్సు లేని దేవత గురించి తెలుసా.. ఇది తెలిస్తే భక్తుడైపోతారు..

Just In

01

Andhra King Taluka Trailer: రామ్ పోతినేని ‘ఆంధ్ర కింగ్ తాలూకా’ ట్రైలర్ వచ్చేసింది.. ఓ లుక్కేయండి..

Shamsabad tragedy: గర్భవతి మృతి.. జీర్ణించుకోలేక భర్త ఆత్మహత్య.. తీవ్ర విషాద ఘటన

BJP Flex Dispute: బీజేపీలో ముదిరిన ‘పవర్ వార్’.. ఈటల అడ్డాలో బండి సంజయ్ వర్గం ఏం చేస్తోందంటే?

SI Bribery Case: గోడ దూకి పరారైన ఎస్ఐ, వెంబడించి పట్టుకున్న ఏసీబీ.. ఇంతకీ ఏం చేశాడంటే?

Hyderabad IT Raids: పిస్తా హౌస్, షాగౌస్, మేఫిల్ హోటళ్లపై ఐటీ సోదాలు.. రూ. కోట్లలో హవాలా సొమ్ము!