Mufthi Police: యాక్షన్ కింగ్ అర్జున్ సర్జ – ఐశ్వర్య రాజేష్ ల పోలీస్ ఇన్వెస్టిగేటివ్ పర్సనల్ డ్రామా “తీయవర్ కులై నడుంగ” తెలుగులో “మఫ్టీ పోలీస్”గా ఈనెల 21న ప్రేక్షకుల ముందుకు రానుంది. దినేష్ లక్ష్మణన్ దర్శకత్వంలో జియస్సార్ అర్ట్స్ బ్యానర్ పై జి. అరుల్ కుమార్ నిర్మించిన ఈ తమిళ చిత్రాన్ని.. తెలుగులో “మఫ్టీ పోలీస్” పేరుతో ప్రముఖ నిర్మాత ఎ. ఎన్. బాలాజీ.. శ్రీలక్ష్మిజ్యోతి క్రియేషన్స్ ద్వారా విడుదల చేస్తున్నారు. ఒక రచయిత హత్య నేపద్యంలో పోలీస్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ గా ఈ చిత్రంలో పర్సనల్ డ్రామాకు పెద్ద పీట వేయడం విశేషం. అలాగే ఇటీవలకాలంలో పిల్లల పాలిట భూతంలా మారిన ఆటిజం వ్యాధి గురించి కూడా ఇందులో చర్చించి ఉండడం సమాజం పట్ల దర్శకుడికి ఉన్న బాధ్యతను తెలియజేస్తుంది.
Read also-Immadhi Ravi arrest: నేరాన్ని అంగీకరించిన ఐ బొమ్మ రవి.. అమీర్‌పేట డొమైన్ వల్లే దొరికాడా!
ఈ చిత్రాన్ని తెలుగులో విడుదల చేస్తున్న శ్రీలక్ష్మిజ్యోతి క్రియేషన్స్ అధినేత ఎ. ఎన్. బాలాజీ మాట్లాడుతూ… “యాక్షన్ కింగ్ అర్జున్ – ఐశ్వర్య రాజేష్ అలియాస్ భాగ్యంలకు తెలుగునాట ఉన్న క్రేజ్ ని దృష్టిలో పెట్టుకుని అత్యధిక థియేటర్లలో “మఫ్టీ పోలీస్” చిత్రాన్ని విడుదల చేస్తున్నాం. ఈ సినిమాలో యాక్షన్ తోపాటు పర్సనల్ డ్రామా కూడా చాలా ఆసక్తికరంగా ఉంటుంది. తమిళంతోపాటు తెలుగులోనూ అసాధారణ విజయం సాధిస్తుందనే నమ్మకం ఉంది. ఈ చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులకు అందించే అద్భుత అవకాశాన్ని నాకు అందించిన జి.అరుల్ కుమార్ కి, ఈ చిత్రాన్ని అత్యద్భుతంగా తీర్చిదిద్దిన దర్శకుడు దినేష్ లక్ష్మణన్ లకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు” అన్నారు.
Read also-Hema mother death: టాలీవుడ్ ప్రముఖ నటి హేమ తల్లి మృతి.. సంతాపం తెలిపిన ‘మా’ సభ్యులు..
రామ్ కుమార్ గణేశన్, అభిరామి వెంకటాచలం, ప్రవీణ్ రాజా తదితరులు ప్రధాన పాత్రలు పోషించిన ఓ కొత్త చిత్రం త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాకు సంబంధించిన నిర్మాణ, సాంకేతిక వివరాలు తాజాగా వెలువడ్డాయి. ఈ చిత్రానికి కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం బాధ్యతలను దినేష్ లక్ష్మణన్ వహించారు. ప్రముఖ నిర్మాత జి. అరుల్ కుమార్ ఈ ప్రాజెక్ట్‌ను నిర్మించారు. సాంకేతిక వర్గాన్ని పరిశీలిస్తే, శరవణన్ అభిమన్యు సంగీతం అందించగా, భరత్ ఆశీనగన్ సినిమాటోగ్రాఫర్‌గా వ్యవహరించారు. ఎడిటింగ్ పనులను లారెన్స్ కిషోర్ పూర్తి చేశారు. ఈ చిత్రానికి ధీరజ్ – అప్పాజీ ప్రచారకర్తలు (P.R.O)గా వ్యవహరిస్తున్నారు. ఈ ఆసక్తికర చిత్రాన్ని శ్రీలక్ష్మిజ్యోతి క్రియేషన్స్, ఎ. ఎన్. బాలాజీ సంయుక్తంగా విడుదల చేస్తున్నారు. మంచి తారాగణంతో ప్రతిభావంతులైన సాంకేతిక నిపుణులతో రూపొందిన ఈ చిత్రంపై సినీ అభిమానుల్లో అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమా విడుదల కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
