Crime News: బుద్ధిగా చదువుకోవాలని తండ్రి మందలించడంతో కుమారుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన గద్వాల జిల్లా(Gadwal District)లో చోటు చేసుకుంది. గ్రామస్తులు, పోలీసులు తెలిపిన సమాచారం మేరకు వివరాలిలా ఉన్నాయి. మల్దకల్ మండలం ఉలిగెపల్లి గ్రామానికి చెందిన కురువ కిష్టయ్య సుజాత దంపతులకు హరికృష్ణ, గోవర్దన్ ఇద్దరు కుమారులు ఉన్నారు. వ్యవసాయం సాగు చేస్తూ జీవనం సాగిస్తున్నారు. కిష్టయ్య పెద్ద కుమారుడు హరికృష్ణ(16) ఈ సంవత్సరం పదో తరగతి పరీక్ష ఫలితాల్లో 546 మార్కులు సాధించాడు. ఇంటర్మీడియట్ కోసం చౌటుప్పల్ కోని టీజీఅర్ జేసి గురుకుల కళాశాలలో(MPC) మొదటి సంవత్సరం విద్యాభ్యాసం చేస్తున్నాడు.
Also Read: Fire Crime: నారాయణపేట జిల్లాలో దారుణం.. మంటల్లో చిక్కుకున్న బాలిక చివరికి!
చదువులో చురుకుతనం
హరికృష్ణ చిన్నప్పటి నుంచి చదువులో చురుకుగా ఉండేవాడు. అయితే ఇటీవల ఇంటికి వచ్చిన హరికృష్ణ(Harikrishna) చదువు మానేసి తాను కూడా పొలం పనులు చేస్తానని తండ్రితో చెప్పాడు, కళాశాలకు వెళ్లనంటూ తల్లిదండ్రుల వద్ద మారాం చేశాడు. తల్లిదండ్రులు బుద్దిగా చదువుకొని ప్రయోజకుడు కావాలని నచ్చజెప్పి పంపించారు. ఈ నెల 12వ తేదిన హరికృష్ణ చౌటుప్పల్‌లోని కళాశాలకు బయలుదేరాడు. ఎర్రవల్లి చౌరస్తా వరకు వెళ్లి తిరిగి గద్వాలకు వచ్చాడు. పాతబస్టాండ్ సమీపంలో పురుగుల మందు సేవించి, అపస్మారక స్థితిలో పడిపోయాడు.
గమనించిన స్థానికులు కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. చికిత్స కోసం గద్వాల ఆసుపత్రికి తరలించారు. వైద్యుల సూచన మేరకు మెరుగైన చికిత్స కోసం కర్నూల్ ఆసుపత్రికి తరలించగా, అక్కడ చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందాడు. చేతికి వచ్చిన కొడుకుని పోగోట్టుకున్న అంటూ కుటుంభ సబ్యులు కన్నీరు పాలయ్యారు. దీంతో ఓక్కసారిగా ఆ గ్రామంలో విషాదచాయలు అమలుకున్నాయి.
Also Read: CM Revanth Reddy: అధిక వడ్డీలకు చెక్ పెట్టేందుకు ప్రత్యేక ప్రణాళిక