CM Revanth Reddy (imagecrdit:swetcha)
తెలంగాణ

CM Revanth Reddy: అధిక వడ్డీలకు చెక్ పెట్టేందుకు ప్రత్యేక ప్రణాళిక

CM Revanth Reddy: అప్పుల నుంచి గట్టెక్కడం ఎలా? అని సర్వార్ అధ్యయనం చేస్తున్నది. ఇప్పటికే దేశంలో పలువురి కీలక ఆర్ధిక వేత్తల సలహాలు, సూచనలు స్వీకరించిన సర్కార్ ప్రధాన మంత్రి ఆర్ధిక సలహా మండలి చైర్మన్ ఎస్ మహేంద్ర దేవ్(Mahendra Dev) అభిప్రాయాన్నీ కూడా తాజాగా సేకరించింది. గత పదేళ్లలో రాష్ట్రం అప్పుల కుప్పగా మారిపోయిందని, ఆ ప్రభావం ప్రస్తుత ప్రభుత్వంపై పడుతుందని సీఎం ఆర్ధిక వేత్తల మీటింగ్‌లలో చెప్తున్నారు. ఈ గండం నుంచి బయట పడే మార్గాన్ని, ఉపాయాన్ని శోధించాల్సిన అవసరం ఉన్నట్లు సీఎం ఎక్స్ పర్ట్స్ ను కోరుతున్నారు. ప్రత్యేకంగా కలిసిన ప్రధాన మంత్రి ఆర్ధిక సలహా మండలి చైర్మన్ తోనూ సీఎం ఇదే విన్నవించారు. రాష్ట్ర డెవలప్‌కు తమ వద్ద ప్రత్యేక వ్యూహాం ఉన్నప్పటికీ, అప్పుల ఊబి వలన సజావుగా ప్లాన్స్ ముందుకు సాగడం లేదని వెల్లడించారు. ఇందుకు పరిష్​కార సూత్రాన్ని కనుకొనగాల్సిందిగా సీఎం ఆర్ధిక వేత్తలను కోరుతున్నారు. గత ఏడాది కూడా సీఎం రేవంత్ రెడ్డి ప్రముఖ ఆర్ధిక వేత్త ప్రణాళిక సంఘం మాజీ ఉపాధ్యక్షుడు మాంటెక్ సింగ్ అహ్లూవాలియా భేటీ అయ్యారు. పదేళ్ల పాటు చేసిన అప్పులు రాష్ట్రాన్ని సతమతం చేస్తున్నట్లు వివరించారు.

అభివృద్ధి పథంలో తీసుకువెళ్లే అంశం
అంతేగాక సీఎం ఢిల్లీ(Delhi) వెళ్లిన ప్రతీ సారి ఆర్ధిక నిపుణులతో ప్రత్యేకంగా చర్చిస్తూనే ఉన్నారు. ఇందుకు పరిష్​కారం మార్గం లభించలేదని, దీంతో తమకు కేంద్రం నుంచి సహకారం కావాల్సిందేనని సీఎం ప్రధాన మంత్రి(PM) ఆర్ధిక సలహా మండలి చైర్మన్ కు వివరించారు. జూబ్లీహిల్స్ లో సీఎం నివాసానికి ఆర్ధిక వేత్త మహేంద్ర దేవ్ ప్రత్యేకంగా వచ్చారు. తెలంగాణను అభివృద్ధి పథంలో తీసుకువెళ్లే అంశంపై చర్చించారు. సమాఖ్య విధానంలో కేంద్రం,రాష్ట్రాలు పరస్పరం సహకరించుకోవాలని సీఎం కోరారు. రాష్ట్రాలు అభివృద్ధి చెందితేనే దేశం అభివృద్ధి చెందుతుందని సీఎం వివరించారు.

హైదరాబాద్‌తో పాటు రాష్ట్రం లోని పట్టణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల కల్పన పై దృష్టి సారించినట్లు తెలిపారు. యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడమే ధ్యేయంగా ముందుకు సాగుతున్నట్లు సీఎం వెల్లడించారు. రాష్ట్రం లో పారిశ్రామిక రంగంతో పాటు సేవల రంగం అభివృద్ధి కోసం ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు వెల్లడించారు. ఉద్యోగులకు సముచితమైన అవకాశాలు కల్పిస్తేనే రాష్టానికి కంపెనీలు వస్తాయని, తద్వారా జీడీపీ(GDP) పెరుగుతుందనే ఉద్దేశ్యంతోనే భారీ స్థాయిలో పరిశ్రమలను ఆహ్వానిస్తున్నట్లు సీఎం వెల్లడించారు. హైదరాబాద్(Hyderabad) చుట్టూ రీజినల్ రింగ్ రోడ్డు(RRR), అనుసంధానంగా రేడియల్ రోడ్లు ఏర్పాటు చేస్తున్నట్లు వివరించారు. తెలంగాణ అభివృద్ధికి ఇందిరమ్మ ప్రభుత్వం స్పష్టమైన ప్రణాళిక ఉన్నదని, ఇందుకు కేంద్రం నుంచి సాయం అందేలా చొరవ తీసుకోవాలని సీఎం మహేంద్ర దేవ్ ను కోరారు.

Also Read: MLC Kavitha: బీసీ రిజర్వేషన్లపై ఆర్డినెన్స్ జారీ చేయించాలి.. కవిత డిమాండ్​!

అధిక వడ్డీలు అడ్డొస్తున్నాయ్?
ప్రభుత్వం ఏ కొత్త ప్రాజెక్టు, పథకం, కార్యక్రమాలు చేపట్టినా, నిధుల కొరతతో ఆటంకం ఏర్పడుతున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) ఆర్ధిక వేత్తలతో నిత్యం చెప్తూ ఉన్నారు. మహేంద్ర దేవ్ కు కూడా ఇదే చెప్పినట్లు తెలిసింది. గత ప్రభుత్వం అధిక వడ్డీలకు లోన్లు తీసుకొని, తమ నెత్తి మీద భారం పెట్టినట్లు సీఎం ప్రచారం చేస్తున్నారు. వడ్డీలకు తీసుకున్న లోన్లు కట్టేందుకు రాష్ట్ర ఆదాయం నుంచి ఖర్చు చేయాల్సి వస్తుందని, దీని వలన ప్రభుత్వంలో రోటేషన్ జరగడానికి సమస్యలు వస్తున్నట్లు సీఎం ఆర్ధిక వేత్త మహేంద్ర దేవ్ తో స్పష్టం చేశారు.

అధిక వడ్డీలకు చెక్ పెట్టేందుకు తమ ప్రభుత్వానికి ప్రత్యేక ప్రణాళిక వెసులుబాటు ఇవ్వాల్సిందిగా సీఎం కోరారు. కేంద్రం నుంచి ఆర్ధిక సాయంతో పాటు అప్పుల నుంచి గట్టేక్కెందుకు అవసరమైన సలహాలు, సూచనలు కూడా అవసరమేనంటూ సీఎం కోరారు. గత పదేల్లుగా పెరిగిన అప్పులు, వాటి ప్రభావంతో కాంగ్రెస్(Congress) ప్రభుత్వం చేపట్టాల్సిన పనులు పెండింగ్ లో పడుతున్నట్లు వెల్లడించారు. ఊదాహరణకు రాజీవ్ యువ శక్తి స్కీమ్(Rajiv Yuva Shakti Scheme)ను యువత స్వయం ఉపాధి కోసం తీసుకువచ్చామని, కానీ ఆర్ధిక పరమైన ఇబ్బందులు ఉన్నందున ఆ స్కీమ్ కాస్త నెమ్మదిగా నడుస్తుందని రాష్ట్ర ఆర్ధిక శాఖ .ప్రధాన మంత్రి ఆర్ధిక సలహా మండలి చైర్మన్ ఎస్ మహేంద్ర దేవ్ కు వివరించినట్లు తెలిసింది. మిగతా ప్రభుత్వ ప్లాన్స్, స్కీమ్స్ లలోనే సమస్యలు ఉన్నట్లు ఫైనాన్స్ శాఖ చెప్తున్నది.

సుమారు రూ.7 లక్షల కోట్లు?
గడిచిన పదేళ్లలో బీఆర్ఎస్(BRS) ప్రభుత్వం 7 లక్షల కోట్లకు పైనే అప్పులు చేసిందని కాంగ్రెస్(Congress) ఆరోపిస్తుంది. దీంతోనే తమకు ప్రభుత్వం నిర్వహణ భారంగా మారినట్లు సాక్షాత్తు మంత్రులే పలుమార్లు ఆన్ రికార్డులో అంగీకరించారు. ఇరిగేషన్, పవర్ ప్రాజెక్టుల కోసం అధిక వడ్డీలకు తీసుకున్నందునే రాష్ట్ర ప్రభుత్వం అప్పుల భారీన పడిందనేది కాంగ్రెస్ వాదన. ఏకంగా రాష్ట్ర ఆదాయం నుంచి కూడా వడ్డీలు చెల్లిస్తున్నారంటే పరిస్థితిని అర్ధం చేసుకోవాలంటూ ప్రభుత్వ పెద్దలు కోరుతున్నారు. అయితే కాంగ్రెస్ సర్కార్ పవర్ లోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు మరో లక్ష కోట్లు, అంటే ఓవరల్ గా సుమారు రూ. 8 లక్షల కోట్లు రాష్ట్ర ప్రభుత్వం కట్టాల్సి ఉన్నట్లు ఫైనాన్స్ శాఖ చెప్తున్నది. ఈ నేపధ్యంలో రెగ్యులర్ గా విధిగా ఇవ్వాల్సిన పేమెంట్లకు చిక్కులు ఏర్పడుతున్నాయి. దీంతోనే వడ్డీ భారానికి మార్గం చూపించాలని సీఎం పదే పదే ఆర్ధిక వేత్తలు, కేంద్రాన్ని కోరుతున్నారు.

Also Read: Plants Care: మితిమీరి ఇలా చేస్తే మొక్కలు చనిపోతాయ్!

ప్రతీ నెల విధిగా చెల్లించాల్సిన పేమెంట్లలో ముఖ్యమైనవి
జీతాలు, పెన్షన్లు= రూ. 5 వేల కోట్లు
ఆసరా ఫించన్= వెయ్యి కోట్లు
అప్పులు, కుస్తీలు, వడ్డీ= రూ.6 వేల కోట్లు
గ్రీన్ ఛానల్ పేమెంట్లు= రూ.2 వేల కోట్లు
ప్రభుత్వ నిర్వహణకు= రూ.వెయ్యి కోట్లు

 

 

Just In

01

Donald Trump: భారత్‌పై ట్రంప్ యూటర్న్.. మోదీ ఎప్పటికీ ఫ్రెండే అంటూ.. దగ్గరయ్యేందుకు తాపత్రయం!

SIIMA Awards 2025: సైమా 2025 విజేతలు ఎవరంటే?.. ఖుషీ అవుతున్న ఆ హీరోల ఫ్యాన్స్

Telangana Jagruthi: తెలంగాణ జాగృతి సంస్థ నాయకులు ఫైర్.. కారణం అదేనా..?

Crime News: తీరుమారని గంజాయి పెడ్లర్ పై పీడీ యాక్ట్.. ఉత్తర్వులు జారీ!

Crime News: హైదరాబాద్‌లో దారుణం.. మార్ఫింగ్ ఫోటోలతో యవతికి బెదిరింపులు