Gold Missing Crime: నిజామాబాద్ జిల్లాలోని ప్రగతి ఆసుపత్రిలో దారుణం చోటు చేసుకుంది. ఓ మహిళ డెడ్ బాడీ పైన ఉన్న బంగారం మాయం అవ్వబడం తీవ్ర సంచలనం రేపింది. ఆసుపత్రిలో ఓ మహిళ గుండె నొప్పి రావడంతో నిన్న సాయంకాలం చికిత్సకోసం వచ్చింది. దీంతో ఆ మహిళ ఉదయం 8 గంటలకు చికిత్స పొందుతూ మృతి చెందింది. అనంతరం భందువులు అక్కడి వెల్లి చూడగా తమ మహిళ ఓంటిపై ఉన్న బంగారం మాయమైనట్లు గుర్తించారు. దీంతో ఈ సంఘటన తీవ్ర సంచలనం రేపుతుంది.
ఇక వివరాల్లోకి వెలితే..
నిజామాబాద్ జిల్లాలోని ప్రగతి ఆసుపత్రిలో గంగవ్వ అనే మహిళ చికిత్స కోసం వచ్చింది. అయితే నిన్నత్రి గంగవ్వ అనే మహిళకు గుండెలో నొప్పిరావంతో తమ భందువులు అమేను నిజామాబాద్ లోని ప్రగతి ఆసుపత్రిలో చేర్పించారు. గుండెలో తీవ్ర నొప్పి ఉండటంతో రాత్రంతా ఆసుపత్రిలోనే ఆ మహిళను ఉంచారు. అయితే చిత్స పోందుతూ నేడు ఉదయం 8 గంటల సమయంలో మరణించింది. దీంతో ఆసుపత్రి యాజమాన్యం మరణ వార్త తెలిపారు. గంగవ్వ దగ్గరకు వెల్లిన తమ భందువులు ఆమేను చూశారు. అనంతరం మృతురాలి ఓంటిపై ఉన్న బంగారం కనిపించక పోవడంతో ఆసుపత్రి యాజమాన్యాన్ని అడిగారు.
Also Read: Bigg Boss Telugu 9: హౌస్‌లో ‘మండే’ మంటలు మొదలయ్యాయ్.. ఇంకెవరూ ఆపలేరు!
పని చేయని సీసీ కెమెరాలు
దీంతో ఆగ్రహించిన భందువులు మహిళ ఓంటిపై ఉన్న బంగారాన్ని అపహరించినట్టుగా భందువులు గుర్తించారు. తీవ్ర ఆగ్రహనికి గురైన భందువులు పోలీస్ స్టేషన్ లో ఆసుపత్రి సిబ్బందిపై ఫిర్యాదు చేశారు. దీంతో వెంటనే పోలీసులు స్పందించి ఆసుపత్రిలోకి వచ్చి సీసీ కెమెరాలను చెక్ చేశారు. పోలీసులు చెక్ చేసే సమయంలో అక్కడి కెమెరాలు పనిచేయడంలేదని తెలిపారు. దీంతో అక్కడి పరిపర ప్రాంతాల్లో ఆసుపత్రిలో కెమెరాలు పనిచేయడం లేదని పోలీసులు గ్రహించారు. దీంతో మృతురాలు ఓంటి మీద 18 గ్రాముల వరకు బంగారం చోరి అయ్యిందని తెలిపారు. ఆసుపత్రిలో పనిచేయని సిసి కెమెరాలు ఉండటం వలనే ఇలా జరిగిందని పోలీసులు తెలిపారు.
Also Read: Telangana ACB: ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్న వరంగల్ ఏసీబీ వసూళ్ల సార్ లీలలు
