Swathi murder case: వీడిన స్వాతి మర్డర్ మిస్టరీ
Swathi murder case ( image credit: swetcha twitter)
క్రైమ్

Swathi murder case: వీడిన స్వాతి మర్డర్ మిస్టరీ.. వెలుగులోకి సంచలన నిజాలు!

Swathi murder case: సంచలనం సృష్టించిన స్వాతి హత్య కేసులో మిస్టరీ వీడింది. తనను రెండో వివాహం చేసుకోవాలని స్వాతి ఒత్తిడి తీసుకురావడంతోనే ఇంటి యజమాని ఈ ఘాతుకానికి పాల్పడినట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. ఇంటి యజమాని, అతడి అల్లుడు, ఉద్యోగి మొత్తం ముగ్గురిని దుండిగల్ పోలీసులు అరెస్ట్ చేశారు. మేడ్చల్ ఏసీపీ శంకర్ రెడ్డి మీడియాకు వివరాలు వెల్లడించారు. మెదక్ జిల్లా కౌడిపల్లి మండలం తిమ్మాపూర్ గ్రామానికి చెందిన స్వాతి (28)కి 2015లో రమేశ్‌తో పెళ్లయింది.

Also Read: Crime News: అమ్మాయిని వేధించిన ఆరోపణలతో ప్రైవేట్ కంపెనీ ఉద్యోగి అరెస్ట్

భార్యాభర్తల మధ్య విభేదాల కారణం

వీరికి ఇద్దరు కుమారులు. భార్యాభర్తల మధ్య విభేదాల కారణంగా స్వాతి ఏడాదిన్నరగా బహదూర్‌పల్లిలోని గ్రీన్‌హిల్స్ కాలనీలో ఒక ఇంట్లో అద్దెకు ఉంటోంది. చిన్న కుమారుడితో ఉంటూ ప్రైవేటు ఉద్యోగం చేస్తోంది. ఒంటరిగా ఉంటున్న స్వాతితో ఇంటి యజమాని, రియల్టర్ బోయ కిషన్ వివాహేతర సంబంధాన్ని ఏర్పరుచుకున్నాడు. కొన్ని రోజులుగా స్వాతి తనను రెండో పెళ్లి చేసుకోవాలని కిషన్‌పై ఒత్తిడి తేవడం మొదలుపెట్టింది. దీంతో కిషన్ కుటుంబంలో గొడవలు మొదలయ్యాయి. దీనికి కారణం స్వాతి అని కక్ష పెంచుకున్న కిషన్, ఆమె అడ్డు తొలగించుకోవాలని నిర్ణయించుకున్నాడు.

డబ్బు ఆశ చూపి

ఈ క్రమంలో, తన అల్లుడు రాజేశ్, తన ఆఫీసులో పనిచేస్తున్న వంశీకి భారీ మొత్తంలో డబ్బు ఆశ చూపించి స్వాతిని హత్య చేయాలని కిషన్ చెప్పాడు. వారు అంగీకరించడంతో, పథకం ప్రకారం శనివారం ఉదయం ఆరు గంటల సమయంలో రాజేశ్, వంశీలు స్వాతి ఇంటికి వచ్చారు. ఆమె చిన్న కుమారుడు చూస్తుండగానే కత్తితో గొంతు కోసి స్వాతిని కిరాతకంగా హతమార్చారు. దుండిగల్ పోలీసులు కేసును సవాలుగా తీసుకుని, హత్య జరిగిన ఇంటి పరిసరాల్లోని సీసీ ఫుటేజీని విశ్లేషించారు. హత్య చేసింది రాజేశ్, వంశీ అని నిర్ధారించుకుని, వారిని విచారించగా కిషన్ చెప్పటం వల్లే చంపినట్లు వెల్లడించారు. దీంతో పోలీసులు కిషన్‌ను కూడా అరెస్ట్శారు. నిందితుల నుంచి హత్యకు ఉపయోగించిన కత్తి, మూడు మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. ముగ్గురిని న్యాయస్థానంలో హాజరుపరిచి జైలుకు రిమాండ్ చేశారు.

Also Read: Crime News: అమ్మాయిని వేధించిన ఆరోపణలతో ప్రైవేట్ కంపెనీ ఉద్యోగి అరెస్ట్

సంగారెడ్డిలో దారుణ హత్య  భార్యను బ్యాట్‌తో కొట్టి చంపిన భర్త

సంగారెడ్డి జిల్లా అమీన్‌పూర్ పరిధిలోని కేఎస్ఆర్ కాలనీలో దారుణ హత్య జరిగింది. భార్య ప్రవర్తనపై అక్రమ సంబంధం ఉందనే అనుమానంతో ఓ భర్త కట్టుకున్న భార్యనే అత్యంత కిరాతకంగా బ్యాట్‌తో కొట్టి చంపిన సంఘటన స్థానికంగా కలకలం రేపింది. వివరాల్లోకి వెళ్తే.. కేఎస్ఆర్ కాలనీలో నివాసం ఉంటున్న కృష్ణవేణి, వెంకట బ్రహ్మం భార్యాభర్తలు. వీరిద్దరికీ ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. కృష్ణవేణి కోహీర్ డీసీసీబీలో అసిస్టెంట్ మేనేజర్‌గా పనిచేస్తున్నారు. అయితే, భార్య కృష్ణవేణికి ఇల్లీగల్ ఎఫైర్ ఉందనే అనుమానాన్ని పెంచుకున్న భర్త వెంకట బ్రహ్మం, ఆదివారం ఉదయం ఆమెపై దాడికి దిగాడు. తీవ్ర ఆగ్రహానికి లోనైన వెంకట బ్రహ్మం ఏకంగా బ్యాట్‌తో కొట్టి భార్య కృష్ణవేణిని దారుణంగా హత్య చేశాడు. సమాచారం అందుకున్న అమీన్‌పూర్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాన్ని పరిశీలించి, కేసు నమోదు చేశారు. నిందితుడు వెంకట బ్రహ్మాన్ని అదుపులోకి తీసుకున్నారు.

Just In

01

Maoists surrender: వనం నుంచి జనంలోకి.. నలుగురు మావోయిస్టులు లొంగుబాటు!

Allu Arjun: తమిళ దర్శకులు అల్లు అర్జున్ కోసం ఎందుకు క్యూ కడుతున్నారు?.. రీజన్ ఇదే..

Medaram Jatara 2026: మేడారంలో భారీగా ట్రాఫిక్ జామ్.. కట్టలు తెంచుకుంటున్న భక్తుల ఆగ్రహం!

Municipal Elections: కాంగ్రెస్‌కు మున్సిపల్ ఎన్నికలు టెన్షన్ .. ఈ ఫలితాలే రాజకీయ దిశను నిర్ణయిస్తాయా?

BRS Party: మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఒంటరి పోరు.. పొత్తులు లేకుండా గెలుపు సాధ్యమా?