Gadwal Surveyor Murder Case: గద్వాల సర్వేయర్ హత్య కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న కెన్ ఫిన్ బ్యాంక్ మేనేజర్ తిరుమల రావు(Tirumla Rao) బాగోతాలు పోలీసులు విచారణలో ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. గత నెల 17న తేజేశ్వర్(Tejeshwar) ను ఐశ్వర్య ప్రియుడు తిరుమల రావు హత్య చేయించిన సంఘటన రెండు తెలుగు రాష్ట్రాలలో సంచలనం సృష్టించింది. తాజాగా తిరుమల రావు, ఐశ్వర్యను గద్వాల సీఐ టంగుటూరి శ్రీను కస్టడీలోకి తీసుకొని విచారించగా పలు విషయాలను రాబట్టారు. బ్యాంకులో స్వీపర్ గా పనిచేసే ఐశ్వర్య తల్లితో సాహిత్యం ఏర్పడింది. ఆమె పనికిరాని రోజులలో ఐశ్వర్య బ్యాంకులో పనికి వచ్చేది. యువతితో సైతం సానిహిత్యాన్ని పెంచుకున్నాడు. ఈ క్రమంలో యువతి తల్లి సుజాత(Sujatha)కు అనుమానం రావడంతో ఆమెకు వివాహం చేయాలని నిర్ణయించి సంబంధాలు చూసింది. యువతి పుట్టినిల్లు గద్వాల సమీపంలోని జమ్మిచేడు గ్రామం కావడంతో ఆమె బంధువులు గద్వాలలోని ప్రైవేట్ సర్వేయర్ తేజేశ్వర్ తో వివాహాన్ని నిశ్చయించుకున్నారు.
ఐశ్వర్యను ఎలాగైనా దక్కించుకోవాలని
ఐశ్వర్యకు వివాహం నిశ్చయం కావడంతో ఎలాగైనా సంబంధాన్ని కొనసాగించాలని భావించగా ఆమె సైతం వివాహానికి అయిష్టత చూపడంతో బెంగళూరు(Bangalore)లోని తమ బంధువుల ఇంటికి పంపాడు. అక్కడి నుంచి విదేశాలకు పారిపోదామని ప్లాన్ చేశాడని సిఐ(CI) తెలిపారు. కానీ కూతురు కనిపించకపోవడంతో కర్నూలు(Kurnool Police) పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు విచారణ చేపట్టి యువతి బెంగళూరులో ఉందని భావించి తిరిగి కర్నూలుకు తీసుకువచ్చారు.
Also Read: Central govt: చెప్పులు ఆధార్ కార్డులతో రైతులు క్యూ.. అధికారుల నిర్లక్ష్యం
ఐశ్వర్య స్కూటీకి సైతం జిపిఎస్ ట్రాకర్
తన ప్రేయసి పై సైతం అనుమానంతో ఆమె నడిపే స్కూటికి జిపిఎస్(GPS) ట్రాకర్ అమర్చాడు. తనతోనే కాక ఇంకెవరితోనైనా సంబంధాలు ఉన్నాయనే అనుమానంతో తిరుమల రావు(Tirumala Rao) ఆమె నడిపే స్కూటీకి జిపిఎస్ ట్రాకర్ అమర్చారు. ఈ విషయం తన ప్రేయసికి సైతం తెలియకుండా మేనేజ్ చేశాడు. పరిస్థితులు అనుకూలించకపోవడంతో తేజేశ్వర్ తో వివాహం జరగగా వివిధ కారణాలతో భర్తతో ఐశ్వర్య తన ప్రియుడు తిరుమల రావ్ సూచన మేరకు దూరం పెడుతూ వచ్చింది. వాయిస్ చేంజర్ డివైస్ తో లేడీ గొంతుగా ఎవరికి అనుమానం రాకుండా తరచుగా మాట్లాడేవారు.
అడ్డును తొలగించుకునేందుకు కిరాయి ముఠాతో తేజేశ్వర్(Tejeshwar) ను హత్య చేయించేందుకు అతని బైక్ కు సైతం జిపిఎస్ ట్రాకర్ ను అమర్చారు. పలుమార్లు ప్రయత్నం విఫలమైన చివరకు సర్వే పేరుతో తీసుకెళ్లి దారుణంగా కారులోనే హత్య చేశారు. అనంతరం డెడ్ బాడీ దొరకకుండా, ఆధారాలు లభించకుండా చేసి అండమాన్ లేదా లడఖ్ కు పారిపోవాలని ప్లాన్ చేశారు. కర్నూల్ జిల్లా పాణ్యం సమీపంలో డెడ్ బాడీ దొరకడంతో మొత్తం ప్లాన్ అంతా భూమరంగై ప్రస్తుతం కటకటాల పాలై జైలు జీవితం గడుపుతున్నారు.
Also Read: RMP Clinics: ఆర్ఎంపీల ఇష్టారాజ్యం.. నిబంధనలకు విరుద్ధం
