Criem News (imagecredit:swetcha)
క్రైమ్

Criem News: భీమదేవరపల్లి మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం.. స్పాట్‌లో ముగ్గురు మృతి

Criem News: హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం కొత్తపల్లి వద్ద శుక్రవారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. సిద్దిపేట(Sdhipeta) హనుమకొండ(hanumakonda) ప్రధాన రహదారిలో రోడ్డు పక్కన ఆగిఉన్న బొలోరో పెళ్లి వాహనాన్ని బోర్ వెల్స్ లారీ వెనుకనుంచి ఢీ కొట్టడంతో ఈ ప్రమాదం జరిగిందని స్థానికులు తెలిపారు. ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ 14 ఏళ్ల బాలిక అక్కడికక్కడే మృతి చెందగా వరంగల్(Warangal) ఎంజీఎం(MGM) లో చికిత్స పొందుతూ మరో ఇద్దరు మృతి చెందారు. తీవ్ర గాయాలతో క్షతగాత్రులు పలువురు వరంగల్ ఎంజీఎం లో చికిత్స పొందుతున్నారు.

Also Read: Maoists: తెలంగాణ.. ఆంధ్రప్రదేశ్ సరిహద్దులోని నల్లమలలో మావోయిస్టుల సమావేశం!

వివాహం అనంతరం

మృతులు మహబూబాద్(Mahabubabad) జిల్లా కురవి మండలం సుదన్ పల్లి(Sudan Pally) గ్రామంకు చెందిన వారుగా తెలుస్తుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం మహబూబాబాద్ జిల్లా కురవి మండలం సుధన్ పల్లి గ్రామానికి చెందిన 21 మంది సిద్దిపేటలో జరిగిన వివాహానికి హాజరు అయ్యి వివాహం అనంతరం నల్లపూసల తంతు ముగించుకుని బొలేరో వాహనంలో తిరిగి వస్తున్నారు. ఈక్రమంలో కొత్తపల్లి వద్ద ఆపగా వెనుక నుంచి వచ్చిన లారీ ఢీకొట్టింది. ప్రమాదంలో ముగ్గురు మరణించగా పలువురికి గాయాలయ్యాయి. సంఘటన స్థలం చేరుకున్న పోలీసులు ప్రమాదంపై విచారణ చేపట్టారు. వివాహా వేడుకలకు హాజరై సంతోషంగా తిరిగి వస్తున్న సమయంలో జరిగిన రోడ్డు ప్రమాదం వారి కుటుంబాల్లో విషాదం నింపింది.

Also Read: Cyclone Montha: రాష్ట్రంలో వర్ష బీభత్సం.. డిప్యూటీ సీఎం వీడియో కాన్ఫరెన్స్.. అధికారులకు కీలక ఆదేశాలు

Just In

01

Hindu Mythology: అతడి రక్తం భూమి పై పడిన ప్రతి సారి కొత్త జన్మ ఎత్తి పుడుతూనే ఉంటాడా?

Cotton Crop: భారీ వర్షాలకు తీవ్రంగా నష్టపోయిన పత్తి పంట.. ఆందోళనలో అన్నదాతలు

Mohammad Azharuddin: కేబినేట్‌లోకి అజారుద్దీన్.. గవర్నర్, సీఎం సమక్షంలో.. మంత్రిగా ప్రమాణ స్వీకారం

Naxal Operation: కర్రెగుట్టలో కాల్పుల కలకలం.. హిడ్మా లక్ష్యంగా భద్రతా బలగాల కూంబింగ్

Bigg Boss Telugu 9: భరణి గారి కుటుంబం.. అని పెట్టి ముద్ద మందారం సీజన్ 2 తీయండి? బిగ్ బాస్ పై నెటిజన్స్ ఫైర్