Kite Accident: అందోలు మండలం డాకూరు గ్రామంలో అరవింద్ (6) బాలుడు గాలిపటం ఎగరవేస్తుండడంతో స్థానిక డబుల్‌బెడ్ రూం వద్ద ఉన్న హైటెన్షన్(High tension) తీగలకు గాలిపటానికి ఉన్న మాంజ తట్టుకోవడంతో గట్టిగా లాగడంతో విద్యుత్ షాక్ రావడంతో ఒళ్లంతా కాలిపోయి తీవ్రగాయాలయ్యాయి. ఈ సంఘటనకు సంబంధించిన వివరాలు ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం వివరాలు ఈ విధంగా ఉన్నాయి.
Also Read: NBK111: బాలయ్య, గోపీచంద్ మలినేని మూవీకి మార్పులు.. కారణం అదేనా?
సరదాగా కొద్దిసేపు..
చిలప్‌చెడ్ మండలం ఇబ్రహీంబాద్ గ్రామానికి చెందిన అరవింద్ డాకూరు(Aravindtagur) గ్రామంలోని పెద్దనాన్న గడ్డమీది సుగ్రీవ్ వద్దకు తల్లి స్వప్నతో కలిసి వెళ్లాడు. సరదాగా కొద్దిసేపు గాలిపటాన్ని ఎగరవేయాలనుకొని ప్రమాదానికి గురయ్యాడు. వెంటనే జోగిపేటలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా పరిస్థితి ప్రమాదకరంగా ఉండడంతో సంగారెడ్డి ఆసుపత్రికి తరించారు. అక్కడి నుంచి కూడా హైద్రాబాద్‌లోని ఉస్మానియా ఆసుపత్రికి తరలించినట్లు సమాచారం. కరెంట్ షాక్ కారణంగా బాలుడి ఒంటిపై ఉన్న బట్టలు పూర్తిగా కాలిపోయినట్లు స్థానికులు తెలిపారు. గాలిపటాలను ఎగరవేయడానికి ఉపయోగించే మాంజ ప్లాస్టిక్ కావడం వల్లనే కరెంట్‌షాక్ వచ్చినట్లు తెలిపారు. ఏది ఏమైనప్పటికిని చైనా మాంజకు యువకులు దూరంగా ఉండాలని స్థానికులు సూచిస్తున్నారు.
Also Read: Medchal District: ఆశా వర్కర్ పోస్టుల సమస్యల పరిష్కారానికై కలెక్టర్‌కి వినతి!

