Medchal District: ఎల్లంపేట మున్సిపల్ పరిధిలోని నూతనకల్(Nuthanakal) గ్రామంలో అంగన్వాడి కేంద్రాలు, ఆశా వర్కర్ పోస్టుల సమస్యలను పరిష్కరించాలని గ్రామస్తులు మేడ్చల్ జిల్లా కలెక్టర్ ను కోరారు. ఈ మేరకు స్థానిక నాయకులు సోమవారం కలెక్టర్‌కు వినతిపత్రం సమర్పించారు. నూతనకల్ గ్రామంలో మొత్తం రెండు అంగన్వాడి కేంద్రాలు ఉండగా, ప్రస్తుతం అంగన్వాడి టీచర్లు లేకపోవడం వల్ల ఒక కేంద్రం పూర్తిగా మూసివేయబడిందని వారు తెలిపారు. మరో కేంద్రంలో ఇతర గ్రామానికి చెందిన ఇన్చార్జి ద్వారా తాత్కాలికంగా అంగన్వాడి నిర్వహిస్తున్నారని, అక్కడ కూడా హెల్పర్ లేకపోవడంతో చిన్నారులు, గర్భిణీ స్త్రీలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు.
Also Read: Sankranti 2026: ఇద్దరు భామలతో గ్లామర్ ప్రదర్శన మొదలెట్టారు.. పాపం చిరుకి ఆ ఛాన్స్ లేదుగా!
చాలా కాలంగా ఖాళీ..
సుమారు నాలుగు వేలకుపైగా జనాభా గల గ్రామంలో అంగన్వాడి సేవలు సక్రమంగా లేకపోవడం వల్ల గర్భిణీ స్త్రీలకు పోషకాహారం అందకపోవడం, చిన్నారులను అంగన్వాడి కేంద్రాలకు పంపలేని పరిస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు.అదేవిధంగా, నూతనకల్ ప్రాథమిక ఆరోగ్య కేంద్ర పరిధిలో ఒక ఆశా వర్కర్ పోస్టు చాలా కాలంగా ఖాళీగా ఉండటంతో గ్రామ ప్రజలకు ప్రాథమిక వైద్య సేవలు సరిగా అందడం లేదని తెలిపారు. ఈ నేపథ్యంలో నూతనకల్ గ్రామంలోని రెండు అంగన్వాడి కేంద్రాలకు ఇద్దరు అంగన్వాడి టీచర్లు, ఇద్దరు హెల్పర్లను నియమించడంతో పాటు ఖాళీగా ఉన్న ఆశా వర్కర్ పోస్టును వెంటనే భర్తీ చేయాలని కలెక్టర్‌ను కోరారు. ఈ కార్యక్రమంలో డబిల్ పూర్ మాజీ పిఏసిఎస్ చైర్మన్ సద్ది సురేష్ రెడ్డి(Suresh Reddy), మాజీ సర్పంచ్ కవిత జీవన్(Kavitha Geevan), మాజీ మండల కో-ఆప్షన్ మెంబర్ రుక్సానా యూనుస్ పాషా, బిఆర్ఎస్(BRS) గ్రామ శాఖ అధ్యక్షులు భాస్కర్, మాజీ వార్డు సభ్యులు తలారి భూషణం తదితరులు పాల్గొన్నారు.
Also Read: Poonam Kaur: అశ్లీల వీడియోలు రిలీజ్ చేస్తామని.. పూనమ్‌ని బెదిరించిన కడప వ్యక్తులెవరు?

