Twist in Death Case: బెంగళూరు నగరంలో ఇటీవల ఓ మహిళా టెకీ తన అపార్ట్‌మెంట్‌లో చనిపోవడం సంచలనం రేకెత్తించింది. ఏవో వ్యక్తిగత కారణాలతో ఆమె ఆత్మహత్య చేసుకొని ఉంటుందని అంతా భావించారు. పోలీసులు సైతం అలాగే అనుకున్నారు. కానీ, కేసు నమోదు చేసి, దర్యాప్తు జరిపిన పోలీసులు విస్తుపోయే నిజాలను (Twist in Death Case) గుర్తించారు. కేవలం 18 ఏళ్ల వయసున్న ఓ టీనేజర్ హత్య చేసి, చాలా తెలివిగా ఆత్మహత్యగా చిత్రీకరించే ప్రయత్నం చేశాడని గుర్తించి అవాక్కయ్యారు.
కేసు దర్యాప్తులో సంచలనాలు
షర్మిల అనే 34 ఏళ్ల సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ బెంగళూరులోని రామమూర్తి నగర్‌లో సుబ్రమణ్య లేఅవుట్‌లో ఒక ఫ్లాట్‌ను అద్దెకు తీసుకొని ఒంటరిగా నివాసం ఉండేది. జనవరి 3న ఆమె ఫ్లాట్‌లో అగ్నిప్రమాదం జరిగింది. దీంతో, ఇదంతా ఆత్మహత్యలో భాగమని అంతా భావించారు. ఊపిరి ఆడకపోయిందని అనుకున్నారు. కానీ, పోలీసులు అనునాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు జరిపారు. షర్మిల నివాసమున్న ఫ్లాట్‌కు ఎదురుగా ఉండే ఇంట్లో ఉండే 18 ఏళ్ల కుర్రాడే ఆమెను చంపేసినట్టు గుర్తించారు.
తొలుత ఆత్మహత్యగా అనుమానించారు. అయితే, సమగ్ర దర్యాప్తు జరపడంతో మర్డర్ అని తేలడంతో అంతా షాక్‌కు గురయ్యారు. కేరళకు చెందిన 18 ఏళ్ల క్రిష్ణయ్య అనే టీనేజర్.. షర్మిలను వన్‌సైడ్ లవ్ చేసినట్టు తేలింది. హత్య జరిగిన రోజు బాగా పొద్దుపోయాక బాల్కని విండో ద్వారా షర్మిల ఫ్లాట్‌లోకి ప్రవేశించినట్టు గుర్తించామని పోలీసులు వెల్లడించారు. నిందితుడు షర్మిల పట్ల దుష్ప్రర్తనకు పాల్పడినట్టుగా తెలిసిందన్నారు. వెనుక నుంచి ఆమెను హత్తుకున్నాడని, దీంతో, షర్మిల నిరోధించడంతో పాటు అతడి నుంచి బలవంతంగా విడిపించుకుందని వెల్లడించారు. దీంతో, నిందితుడు బలంగా మెడ నొక్కిపట్టాడని, దీంతో, షర్మిల స్పృహ కోల్పోయిందని వివరించారు. నిందితుడు అంతటితో కూడా ఆగకుండా గొంతునులిమి ప్రాణాలు తీసేశాడని పోలీసులు వివరించారు. అయితే, షర్మిల మరణాన్ని ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు నిందితుడు ప్రయత్నించాడని, ఆధారాలు చెరిపివేందుకు పన్నాగం పన్నినట్టు గుర్తించామన్నారు. ప్రమాదం కారణంగా చనిపోయిందని నమ్మించేందుకు షర్మిల బెడ్‌రూమ్‌కు నిప్పు పెట్టాడని, అది ఇళ్లంతా వ్యాపించిందని వివరించారు. ఈ మంటల కారణంగా తొలుత విచారణ తప్పుదారి పట్టిందని, ఊపిరాడక యువతి చనిపోయి ఉంటుందని భావించామని చెప్పారు.
Read Also- Ramagundam: రామగుండంలో అభివృద్ధి పండగ.. 175 కోట్లతో సింగరేణి ఉద్యోగులకు గుడ్ న్యూస్..?
అయితే, సమగ్ర దర్యాప్తులో అన్ని విషయాలు వెలుగులోకి వచ్చాయని వివరించారు. నిందిత వ్యక్తితో మృతురాలికి పరిచయం ఉండేదని, అతడితో మాట్లాడిన సందర్భాలు కూడా ఉన్నాయని ఇరుగుపొరుగువారు చెబుతున్నారు. మొత్తంగా, నిందితుడు వన్ సైడ్ లవ్ ఇంతటి నేరానికి దారితీసిందని పోలీసులు తెలిపారు. కాగా, నిందిత యువకుడు అరెస్టయ్యాడు. ప్రస్తుతం రిమాండ్‌పై మూడు రోజుల పోలీసు కస్టడీలో ఉన్నాడు. ఈ కేసుపై తదుపరి దర్యాప్తు జరుగుతుందని, నేరానికి సంబంధించిన ఘటనలను రీకన్‌స్ట్రక్చన్ చేయనున్నామని, ఫోరెన్సిక్ ఆధారాలు సేకరించనున్నామని పోలీసులు తెలిపారు.

