Borambanda Murder: హైదరాబాద్‌లోని బోరబండ ఏరియాలో ఘోరం
కిరాతకంగా యువతిని చంపేసిన నిందితుడు
యవతి మృతదేహం గాంధీ ఆస్పత్రికి తరలింపు
సన్నిహితంగా ఉన్నన్ని రోజులు మంచిగానే ఉన్నాడు. కాస్త దూరమయ్యి, సరిగా మాట్లాడకపోవడంతో అనుమానం పెంచుకొని, ఆవేశానికి గురయ్యాడు. విచక్షిణ కోల్పోయి, ఉన్మాదిగా మారి దారుణమైన హత్య చేశాడు. మాట్లాడుకుందామని కత్తితో పొడిచి చంపేశాడు. ఈ షాకింగ్ ఘటన హైదరాబాద్‌లోని బోరబండ (Borambanda Murder) పరిధిలో జరిగింది. ఓ పబ్‌లో డ్యాన్సర్‌గా పనిచేస్తున్న ఖనీజ్ ఫాతిమా అనే మహిళను జహీరుద్దీన్ అనే వ్యక్తి హత్య చేశాడు.
పబ్‌లో స్నేహం.. ఆ తర్వాత ప్రేమే
హత్యకు పాల్పడ్డ నిందితుడు జహీరుద్దీన్ జ్యూస్ సెంటర్‌లో పనిచేస్తున్నాడు. ఇక మృతురాలు ఖనీజ్ ఫాతిమా సికింద్రాబాద్‌లోని కార్ఖానా ప్రాంతానికి చెందిన మహిళ అని తెలిసింది. ఆమెకు ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. ఖనీజ్ ఫాతిమా బంజారాహిల్స్‌లోని ఓ పబ్‌లో పనిచేసిన సమయంలో వీరిద్దరి మధ్య పరిచయం ఏర్పడింది. నిందితుడు తరచూ అక్కడికి వచ్చేవాడు. దీంతో, పరిచయం ఏర్పడి, క్రమంగా శారీరక సంబంధానికి దారితీసినట్టు తెలుస్తోంది. అయితే, కారణాలు ఏమిటో తెలియదు గానీ, ఆ మహిళ బంజారాహిల్స్‌లోని పబ్‌లో వర్క్ మానేసి, బోరబండ పరిధిలో ఉన్న ఊర్వశీ బార్‌లో చేరింది. అప్పటినుంచి నిందితుడితో మాట్లాడటం బాగా మె తగ్గించింది. దీంతో, నిందితుడు బాగా కోపం పెంచుకున్నాడు.
Read Also- PSLV C62-EOS N1: నింగిలోకి ఎగసిన తర్వాత రాకెట్‌లో క్రమరాహిత్యం.. అంతరిక్షంలో 16 శాటిలైట్స్ వృథా !
మాట్లాడుకుందామంటూ చెప్పి, ఆదివారం రాత్రి ఆమెను బైక్ ఎక్కించుకొని, ఎర్రగడ్డలోని మానసిక రోగుల హాస్పిటల్ వెనుక వైపునకు తీసుకెళ్లాడు. మాట్లాడుకుంటున్న సమయంలో ఇద్దరి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. ఈ క్రమంలో ఉన్మాదిగా మారిన జహీరుద్దీన్ ఆవేశంతో యువతిపై పదునైన కత్తితో దాడి చేశాడు. దీంతో, యువతి తీవ్ర రక్తస్రావమయ్యి, ఘటనా స్థలంలోనే చనిపోయింది.
నిందిత వ్యక్తే స్థానికులకు చెప్పడంతో ఈ విషయం బయటపడినట్టు తెలుస్తోంది. కాగా, నిందితుడు ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉన్నాడు. యవతి మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం గాంధీ ఆస్పత్రికి తరలించారు. ఈ హత్యకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. కాగా, మృతురాలు ఖనీజ్ ఫాతిమా భర్త డ్రైవర్‌గా పనిచేస్తున్నట్టు తెలిసింది.
Read Also- MP Etela Rajender: నేనే స్వయంగా హెచ్చరించినా ఇంత బరితెగింపా.. ఎంపీ ఈటల రాజేందర్ ఫైర్!

