Suicide Case: వేధింపులు తట్టుకోలేక.. గొర్రెల కాపరి ఆత్మహత్య!
Suicide Case (imagecredit:swetcha)
క్రైమ్, నార్త్ తెలంగాణ

Suicide Case: యజమాని వేధింపులు తట్టుకోలేక.. గొర్రెల కాపరి ఆత్మహత్య!

Suicide Case: యజమాని వేధింపులు భరించలేక పురుగుల మందు తాగి గొర్రెల కాపరి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన రాయపర్తి మండలం కొత్తూరు గ్రామంలో కలకలం రేపింది. ఈ సంఘటనకు సంభందించి పోలీసుల తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.

పురుగుల మందు తాగి

కొత్తూరు గ్రామానికి చెందిన ఆకారపు నరసయ్య(Naradsaya) (55) గత నెల 30న పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడనీ పోలీసులు తెలిపారు. పురుగుల మందు తాగిన నరసయ్యను కుటుంబ సభ్యులు గమనించి వెంటనే వర్ధన్నపేటలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా, పరిస్థితి విషమంగా ఉండటంతో వరంగల్(Warangal) లోని ఎంజీఎం(MGM)ఆసుపత్రికి రిఫర్ చేశారు. అక్కడ చికిత్స పొందుతున్న నరసయ్య ఆదివారం మధ్యాహ్నం 3.30 గంటలకు మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు.

Also Read: Bhatti Vikramarka: గత ప్రభుత్వ పాలకులు కవులను వాడుకుని వదిలేశారు.. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క

యజమాని దూషించడం వల్లే.. నా భర్త చనిపోయాడు

కుటుంబ సభ్యుల వివరాల ప్రకారం నరసయ్య అదే గ్రామానికి చెందిన అడ్లూరి శ్రీనివాసరావు(Adlure Srinivasa Rao) వద్ద గొర్రెల కాపరిగా పని చేస్తున్నాడు. ఈ క్రమంలో యజమాని తరచూ దూషణలు, వేధింపులకు పాల్పడటంతో తీవ్ర మనస్తాపానికి గురైన నరసయ్య ఈ అఘాయిత్యానికి పాల్పడినట్లు మృతుడి భార్య ఎల్లమ్మ(Yellama) తెలిపారు. మృతుడు భార్య ఎల్లమ్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు రాయపర్తి ఎస్సై ముత్యం(SI Muthyam) రాజేందర్ తెలిపారు.

MP Suresh Kumar: గ్రామాలు అభివృద్ధి చెందితేనే దేశం బాగుంటుంది: జహీరాబాద్ ఎంపీ సురేశ్ శెట్కార్!

Just In

01

NTR viral video: అభిమానులపై సీరియస్ అయిన జూనియర్ ఎన్టీఆర్.. ఎందుకంటే?

Seethakka: గ్రామాల్లో తాగునీటి సరఫరా పటిష్టం చేయాలి.. ఉన్నతాధికారులతో మంత్రి సీతక్క సమీక్ష!

Telangana Govt: విద్యుత్ సబ్సిడీల్లో అన్నదాతదే అగ్రభాగం.. వ్యవసాయ రంగానికి రూ.13,499 కోట్లు!

Akhil Akkineni: అఖిల్ అక్కినేని గురించి ప్రొడ్యూసర్ చెప్పింది వింటే గూస్‌బంప్స్ రావాల్సిందే..

Thummala Nageswara Rao: యూరియా కొరత లేదు.. ప్రతిపక్షాలు అసత్య ఆరోపణలు చేస్తే తాట తీస్తాం.. మంత్రి తుమ్మల ఫైర్!