Crime News: డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ అధికారులు శంషాబాద్ ఎయిర్ పోర్టులో ఓ వ్యక్తిని అరెస్ట్ చేశారు. అతని నుంచి 2.37కోట్ల రూపాయల విలువ చేసే పసిడిని(Gold) సీజ్ చేశారు. ధరలు చుక్కలను తాకుతున్న నేపథ్యంలో బంగారం స్మగ్లింగ్ ను నిరోధించటానికి కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని కేంద్ర ప్రభుత్వం ఇటీవలే దేశంలోని అన్ని ఎయిర్ పోర్ట్(Air Port)ల సిబ్బందితోపాటు డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ అధికారులను ఆదేశించిన విషయం తెలిసిందే. దాంతో అధికారులు దీనిపై ప్రత్యేక దృష్టి సారించారు. ఈ క్రమంలోనే గురువారం కువైట్(Kuwait) నుంచి షార్జా మీదుగా హైదరాబాద్(Hyderabad) వచ్చిన ఓ ప్రయాణికున్ని పట్టుకున్నారు. అతని లగేజీని తనిఖీ చేయగా 1.8కిలోల బరువున్న బంగారు బిస్కెట్లు దొరికాయి. ఈ క్రమంలో సదరు ప్రయాణికున్ని అదుపులోకి తీసుకుని విచారణ జరుపుతున్నారు.
ధూల్ పేటలో..
గంజాయి అమ్ముతున్న ఇద్దరిని ఎక్సయిజ్ స్టేట్ టాస్క్ ఫోర్స్ పోలీసులు గురువారం అరెస్ట్ చేశారు. వారి నుంచి 1.830 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. వివరాలు ఇలా ఉన్నాయి. ధూల్ పేట.. పురానాపూల్ ప్రాంతాల్లో గంజాయి అమ్మకాలు జరుగుతున్నట్టు సమాచారం అందటంతో సీఐ అంజిరెడ్(Anjireddy)డి సిబ్బందితో కలిసి రూట్ వాచ్ జరిపారు. ఈ క్రమంలో ద్విచక్ర వాహనంపై వెళుతున్న బద్రినారాయణ సింగ్(Badrinarayan Singh), రాజాసింగ్(Raja Singh) లను అదుపులోకి తీసుకుని వారి నుంచి గంజాయితోపాటు రెండు సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. విచారణలో గంజాయి అమ్మకాలతో ముఖేశ్(Mukesh), మంజు దేవి(Manu Devi), ప్రతీక్ సింగ్(Prateek Singh) లకు కూడా సంబంధం ఉన్నట్టు తేలటంతో వారిపై కూడా కేసులు నమోదు చేశారు. ప్రస్తుతం పరారీలో ఉన్న ఈ ముగ్గురి కోసం గాలిస్తున్నారు.
Also Read: Local Body Polls: భలే పనైంది.. ఇక స్థానిక ఎన్నికలు జరిగేది అప్పుడేనా?
