vd-15( image ;X)
ఎంటర్‌టైన్మెంట్

Vijay Deverakonda: క్రియేటివ్ దర్శకుడితో విజయ్ దేవరకొండ మరో కొత్త ప్రాజెక్ట్.. గ్రీన్ సిగ్నల్ పడిందా?

Vijay Deverakonda: తెలుగు సినిమా ఇండస్ట్రీలో మరో సెన్సేషనల్ కలయిక కొసం సన్నాహాలు జరుగుతున్నాయి. రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ, హిట్ చిత్రాల దర్శకుడు విక్రమ్ కె.కుమార్‌తో కలిసి కొత్త ప్రాజెక్ట్‌పై పని ప్రారంభించనున్నారు. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ యూవీ క్రియేషన్స్ నిర్మిస్తోంది. ఇటీవల క్రియేటివ్ దర్శకుడు విక్రమ్ కె.కుమార్ తన కథను విజయ్ దేవరకొండకు వినిపించారు. కథ విపరీతంగా నచ్చడంతో విజయ్ దేవరకొండ తక్షణమే గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు. ప్రస్తుతం ఈ వార్త తెలుగు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. వరుస పరాజయాల్లో ఉన్న విజయ్ దేవరకొండకు క్రియేటివ్ సినిమాల హిట్ దర్శకుడు విక్రమ కే కుమార్ బ్రేక్ ఇస్తారని విజయ్ దేవరకొండ అభిమానులు నమ్ముతున్నారు. ఈ కాంబినేషన్ కనుక ఓకే అయితే విజయ్ దేవరకొండ టాప్ లో పోయి కూర్చొంటాడని అభిమానులు ఆశిస్తున్నారు.

Read also-Mithra Mandali Review: ‘మిత్ర మండలి’ ప్రేక్షకుల మనసు గెలుచుకుందా.. పూర్తి రివ్యూ..

తెలుగు సినిమా స్టార్ విజయ్ దేవరకొండ ప్రస్తుంత బిజీగా గడుపుతున్నారు. రష్మిక మందన్నతో అక్టోబర్ 4న జరిగిన ఎంగేజ్‌మెంట్ జరిగింది. ఫిబ్రవరి 2026లో పెళ్లి జరగవచ్చని సమాచారం. రష్మిక తన పెట్ డాగ్ ఆరాతో ఫోటోలో డైమండ్ రింగ్ ఫ్లాష్ చేసి ఫ్యాన్స్‌ను థ్రిల్ చేసింది. అదే సమయంలో విజయ్ దేవరకొండ కొత్త సినిమా ‘రౌడీ జనార్ధన’ అక్టోబర్ 12న పూజా కార్యక్రమంతో లాంచ్ అయింది. ఈ సినిమాలో కీర్తి సురేష్ హీరోయిన్‌గా నటిస్తోంది, రవి కిరణ్ కోలా డైరెక్షన్‌లో ముంబైలో షూటింగ్ ఈరోజు (అక్టోబర్ 16) ప్రారంభం కానుంది. అయితే, అక్టోబర్ 6న జోగులంబ గద్వాల్ సమీపంలో జరిగిన కారు ప్రమాదంలో విజయ్‌కు హెడ్ ఇంజ్యూరీ అయింది, అతను సోషల్ మీడియాలో ఫ్యాన్స్‌కు థ్యాంక్స్ చెప్పుకుని రికవరీలో ఉన్నాడని అప్‌డేట్ ఇచ్చాడు. అంతేకాకుండా, VD14లో అతని ‘విశ్వరూపం’ లుక్ ఫోటోలు వైరల్ అవుతున్నాయి. ఈ అన్ని అప్‌డేట్స్‌తో ఫ్యాన్స్ ఉత్సాహంగా, అతని రాబోయే ప్రాజెక్టులపై అంచనాలు పెరిగాయి.

Read also-Peddi movie update: ‘పెద్ది’ గురించి అదిరిపోయే అప్డేట్ ఇచ్చిన దర్శకుడు.. ముందు వచ్చేది ఏంటంటే?

విక్రమ్ కె. కుమార్ తెలుగు, తమిళ సినిమా ఇండస్ట్రీలో ప్రసిద్ధ డైరెక్టర్. ’24’, ‘ నాని గ్యాంగ్ లీడర్’ వంటి చిత్రాలతో ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈ డైరెక్టర్, తాజాగా యంగ్ రాక్ స్టార్ విజయ్ దేవరకొండతో కలిసి కొత్త ప్రాజెక్ట్‌పై పని ప్రారంభించనున్నారు. విక్రమ్ కె కుమార్ ఇంతకు ముందు అల్లు అర్జున్‌తో కూడా కొత్త ప్రాజెక్ట్‌పై చర్చలు జరుగుతున్నట్టు బజ్ ఉంది. విక్రమ్ కె కుమార్ ప్రాజెక్ట్ ఓకే అయితే విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ పండగ చేసుకుంటారు. విక్రమ్ కె కుమార్ క్రియేటివిటీతో సినిమాను మరో రేంజ్ కు తీసుకువిళతారు. అందుకే ఈ సినిమా వీలైనంత త్వరగా పట్టాలు ఎక్కాలని అభిమానులు కోరుకుంటున్నారు. అయితే ఏం జరుగుతుంది అనే దానిపై వేచి ఉండాల్సిందే.

Just In

01

NIMS Hospital: నిమ్స్ ఆసుపత్రిలో అక్రమ నియామకాలు.. శాంతి కుమారి కమిటీ రిపోర్ట్‌లో సంచలనాలు..?

Twitter toxicity: సినిమాలపై ట్విటర్‌లో ఎందుకు నెగిటివిటీ పెరుగుతుంది?.. ట్విటర్ టాక్సిక్ అయిపోయిందా?

Ashanna: మావోయిస్టు పార్టీ ఆరోపణలను ఖండించిన ఆశన్న

Viral Video: అయ్యప్ప మాల దీక్షను తీసుకుని మద్యం సేవించిన స్వామి.. వీడియో వైరల్

Ramchandra Rao: జూబ్లీహిల్స్‌లో రెండు రాష్ట్రాల నేతలు కలిసి పని చేస్తాం..?