rc-peddi( image :X)
ఎంటర్‌టైన్మెంట్

Peddi movie update: ‘పెద్ది’ గురించి అదిరిపోయే అప్డేట్ ఇచ్చిన దర్శకుడు.. ముందు వచ్చేది ఏంటంటే?

Peddi movie update: భారీ అంచనాలతో రూపొందుతున్న రామ్ చరణ్ ‘పెద్ది’ సినిమాపై అదిరిపోయే అప్డేట్ ఇచ్చాడు దర్శకుడు బుచ్చిబాబు సనా. ఓ సినిమా ప్రమోషన్ ఈవెంట్ లో పెద్ది సినిమా గురించి అడగ్గా.. సినిమా అప్డేట్ ఖచ్చితంగా ఈ నెలలో ఉంటుందని చెప్పారు. అది టీజరా.. ఫస్ట్ సింగిలా..అని అడగ్గా మొదట సాంగ్ వస్తుందని అది కూడా మెలొడీ సాంగ్ వస్తుందని. ఈ సినిమాలో పాటలు ఏఆర్ రెహమాన్ ఇరగదీశాడంటూ చెప్పుకొచ్చారు. బుచ్చిబాబు స్వయంగా సోషల్ మీడియాలో షేర్ చేసిన ఈ అప్డేట్, ఫ్యాన్స్‌లో భారీ ఎక్సైట్‌మెంట్‌కు దారితీసింది. దీనిని చూసిన ఫ్యాన్స్ సంబారాలు చేసుకుంటున్నారు. ఇప్పటికే ఈ సినిమా గురించి ఓ నిర్మాతను అడగ్గా మార్చి 27, 2025 మూవీ థియోటర్లలోకి రావడం ఫిక్స్ అంటూ చెప్పారు. అయితే బుచ్చిబాబు చెప్పిన అప్డేట్ కోసం ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మొదట మెలొడీ సాంగ్ ఎలా ఉండబోతుందో అని ఫ్యాన్స్ ఎంతో కుతూహలంగా ఎదురు చూస్తున్నారు.

Read also-theatres crisis: తెలుగు రాష్ట్రాల్లో సింగిల్ స్క్రీన్ థియేటర్లు ఎందుకు తగ్గుతున్నాయి?.. అవి ఎందుకు అవసరం?

తెలుగు సినిమా ప్రేక్షకుల్లో భారీ ఆసక్తిని రేకెత్తిస్తున్న చిత్రం ‘పెద్ది’. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా, బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్‌గా, ‘ఉప్పెన’ ఫేమ్ దర్శకుడు బుచ్చిబాబు సనా దర్శకత్వంలో రూపొందుతున్న ఈ స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా, 1980ల రూరల్ ఆంధ్రప్రదేశ్ బ్యాక్‌డ్రాప్‌లో ఆకట్టుకునే కథనం కలిగి ఉంది. పాన్-ఇండియా ప్రాజెక్ట్‌గా రూపొందుతున్న ఈ సినిమా, ఏఆర్ రెహమాన్ సంగీతం, రామ్-లక్ష్మణ్ మాస్టర్ కొరియోగ్రఫీతో ప్రేక్షకులను ఆకర్షిస్తోంది. మైసూర్, పూణే వంటి లొకేషన్‌లలో యాక్షన్ సీక్వెన్స్‌లు షూట్ చేసిన టీమ్, ఇప్పుడు మరిన్ని సర్ప్రైజ్‌లతో ముందుకు సాగుతోంది.

Read also-Pankaj Dheer: ఆ సమయంలో సర్వస్వం కోల్పోయిన పంకజ్ ధీర్ కుటుంబం.. ఎందుకంటే?

ఈ లవ్ సాంగ్ గురించి మరిన్ని డీటెయిల్స్ తెలిస్తే, ఇది రూరల్ లవ్ స్టోరీని రిఫ్లెక్ట్ చేసేలా డిజైన్ చేశారట. రెహమాన్ స్పెషల్ టచ్‌తో, ఫోక్ ఎలిమెంట్స్ మిక్స్ చేసి, హృదయాలను ఆకర్షిస్తుందని అంటున్నారు. దీపావళి సమయంలో ఈ సింగిల్ రిలీజ్ అవ్వే అవకాశం ఉందని, ఇది ఫ్యాన్స్‌కు మాస్ రాంబో లుక్‌తో రామ్ చరణ్‌ను ప్రజెంట్ చేస్తుందని సోర్సెస్ చెబుతున్నాయి. ఇంతకుముందు, రామ్ చరణ్ 18 ఏళ్ల సినిమా జర్నీని సెలబ్రేట్ చేసుకున్న సందర్భంగా ‘పెద్ది’ టీమ్ స్పెషల్ పోస్టర్ రిలీజ్ చేసింది. ఇక ఈ సాంగ్ తర్వాత, టీజర్ లేదా ట్రైలర్ వచ్చే అవకాశం ఉందని ఊహాగానాలు రాబట్టుతున్నాయి. బుచ్చిబాబు టాలెంట్ అందరికీ తెలిసింది. ‘ఉప్పెన’తో పంచ్ డైరెక్షన్ చూపించి, కొత్త హీరోతో రూ.100 కోట్ల మార్కెట్ సృష్టించాడు. ‘పెద్ది’లో కూడా అదే మ్యాజిక్ కొనసాగుతుందని ఆశలు. రామ్ చరణ్ మాస్ లుక్, జాన్వీ ఫ్రెష్ అవతారం, రెహమాన్ మ్యూజిక్ – ఈ కాంబినేషన్ తెలుగు సినిమాను కొత్త ఎత్తులకు చేర్చబోతోంది. ఈ అప్డేట్‌తో ఫ్యాన్స్ కాలర్ ఎగరేస్తున్నారు.

Just In

01

Ram Charan Next movie: రామ్ చరణ్ నెక్స్ట్ సినిమా దర్శకుడు ఎవరో తెలిస్తే ఫ్యాన్స్‌కు పండగే..

Swetcha Effect: స్వేచ్ఛ కథనంతో సంచలనం.. రంగంలోకి దిగిన నిఘా వర్గాలు డీఎస్పీ అరాచకాలకు తెర!

Ellamma movie: బలగం వేణు ‘ఎల్లమ్మ’ సినిమాకు సంగీత దర్శకుడు ఎవరంటే?

Liquor License: వైన్​ షాపుల లాటరీకి హైకోర్టు గ్రీన్ సిగ్నల్!

Telugu States Disasters 2025: ప్రకృతి గట్టిగానే హెచ్చరిస్తుందిగా.. లోకంలో పాపాలు ఆపకపోతే ఇలాంటి వినాశనాలు తప్పవా?