వివరాలు
చిత్రం: మిత్ర మండలి
రచన, దర్శకత్వం: విజయేందర్ ఎస్
నటీనటులు: ప్రియదర్శి (చైతన్య), నిహారిక ఎన్.ఎం (స్వేచ్ఛ), రాగ్ మయూర్ (అభి), విష్ణు ఓయ్ (సాత్విక్), ప్రసాద్ బెహరా (రాజీవ్), వెన్నెల కిషోర్ (ఎస్సై సాగర్), వీటీవీ గణేష్ (నారాయణ), సత్య, బ్రహ్మానందం తదితరులు.
సంగీతం: ఆర్.ఆర్ ధృవన్
కెమెరా: సిద్ధార్థ్ ఎస్.జె
ఎడిటింగ్: పీకే
నిర్మాతలు: కళ్యాణ్ మంతిన, భాను ప్రతాప, డాక్టర్ విజయేందర్ రెడ్డి తీగల (సమర్పణ: బన్నీ వాస్)
Mithra Mandali Review: తెలుగు సినిమా ప్రేక్షకుల ముందుకు మరో యూత్ ఫుల్ ఎంటర్‌టైనర్ ‘మిత్ర మండలి’ అక్టోబర్ 16, 2025న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇది బడ్డీ కామెడీ జానర్‌లో వచ్చిన మరో చిత్రం. ప్రియదర్శి, నిహారిక ఎన్.ఎం వంటి ట్రెండీ నటులతో కలిసి ఒక ఫ్రెండ్స్ గ్యాంగ్ చుట్టూ తిరిగే కథ ఇది. సగటు సినిమా ప్రేక్షకుడిని నవ్వించడానికే ఈ సినిమా తీశామని మన్నీవాస్ అనేక సందర్భల్లొ తెలిపారు. సినిమా చూస్తున్న ప్రతి నిమిషం ఆగకుండా నవ్వుతారు అని భరోసా కూడా ఇచ్చారు. దీంతో సినిమాపై మరింత హైప్ పెరిగింది. మరి నవ్వుకోవడానికి వచ్చిన ప్రేక్షకుడిని నవ్వించిందో లేదో చూసేద్దామా మరి.
Read also-Peddi movie update: ‘పెద్ది’ గురించి అదిరిపోయే అప్డేట్ ఇచ్చిన దర్శకుడు.. ముందు వచ్చేది ఏంటంటే?
కథ
సినిమాకు వెళ్లి కూర్చోగానే ప్రేక్షకుడికి ఒక క్లారిటీ వస్తుంది. ఈ సినిమా ఓ కథ లేనికథ అని. ఈ సినిమా మొత్తం జంగ్లీ పట్నం అనే కల్పిత ఊరులో జరిగే సంఘటనల చుట్టూ తిరుగుతుంది. ‘తుట్టె’ కులానికి చెందిన నారాయణ (వీటీవీ గణేష్) కుల పిచ్చితో ప్రవర్తిస్తూ ఉంటాడు. అతనికి ఎమ్మెల్యే కావాలని ఉంటుంది. దానికి ఆయన కులం మద్ధతు అవసరం. ఆయనకు టికెట్ కూడా ఇస్తారు అదే సమయంలో అతని కూతురు స్వేచ్ఛ (నిహారిక)ఇంటి నుంచి పారిపోతుంది. ఈ విషయం బయటకు పొక్కితే పరువు పోతుందని భావించి, తన కూతురు కిడ్నాప్ అయిందని పోలీస్ స్టేషన్ లో కంప్టెంట్ ఇస్తాడు. నారాయణ కూతురు పారిపోవడం వెనక ఆదే ఊరికి చెందిన చైతన్య (ప్రియదర్శి), అభి (రాగ్ మయూర్), సాత్విక్ (విష్ణు ఓయ్), రాజీవ్ (ప్రసాద్ బెహరా) నలుగురి పాత్ర ఉందని తెలుస్తుంది. ఇంతకూ ఆ నలుగురిలో నిహారికి ఎవరిని ప్రేమిస్తుంది? ఎవరి కోసం ఇంటినుంచి పారిపోయింది? పారి పోయిన తర్వాత ఏం జరిగింది? అనే ప్రశ్నలకు సమాధానం ఈ సినిమా చూసి తెలుసుకోవాలి.
నటీనటుల ప్రదర్శన
ప్రియదర్శి కామెడీ టైమింగ్‌లో తిరుగులేని నటుడు అయినప్పటికీ, ఇక్కడ రొటీన్‌గా అనిపించాడు. హీరోయిన్ నిహారిక ఎన్.ఎం అయితే సోషల్ మీడియాలో మెరిసినంతగా ఇక్కడ వెలగలేదు. డైలాగ్ డెలివరీలో కొంచెం ఇబ్బంది పడింది. రాగ్ మయూర్, విష్ణు ఓయ్, ప్రసాద్ బెహరాలు గ్యాంగ్‌లో బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇచ్చారు. దాదాపు వాళ్లు ఉన్న అన్ని సీన్స్ నవ్వు తెప్పిస్తుంది. వెన్నెల కిషోర్ తన కామెడీతో కథని నిలబెట్టాడు. సత్య ఇంపార్టెంట్ క్యారెక్టర్‌గా వచ్చి నవ్వులు తెప్పించాడు. వీటీవీ గణేష్ కులపిచ్చి పాత్రకు న్యాయం చేశాడు, కానీ కొత్తగా ఏమీ అనిపించలేదు. బ్రహ్మానందం ఒక పాటలో మెరసినప్పటికీ, పెద్ద ఇంపాక్ట్ చూపించలేక పోయారు. మొత్తంగా, మంచి కామెడియన్స్ ఉన్నప్పటికీ కామెడీ పండించడంతో సినిమా విఫలమైందనే చెప్పాలి.
విశ్లేషణ
‘మిత్ర మండలి’ స్నేహితుల చుట్టూ తిరిగే కథ అయినప్పటికీ సినిమాలో అసలు కథ లేదు. సినిమా మొత్తం బలవంతంగా నవ్వించడానికి ప్రయత్నిస్తారు. కేవలం కొన్ని సందర్భాలలో మాత్రమే నవ్వు వస్తుంది. సినిమాలో మిత్రమండలి పరిచయం, కులపిచ్చి నారాయణ ఎంట్రీ, హీరోయిన్ పారిపోవడం వరకు కడుపునిండా నవ్వులు వస్తాయి. ఇంటర్వల్ తర్వాత సినిమాను బాగా సాగదీయడంతో సినిమా ఎప్పుడు అయిపోతుందా అనిపిస్తుంది. సినిమా మొత్త జబర్ధస్త్ స్కిట్ల మాదిరిగా అనిపిస్తుంది. సీరియస్ టాపిక్‌లు సరిగ్గా హ్యాండిల్ చేయకపోవడంతో కొన్ని సీన్స్ అపహాస్యంగా మారాయి. సాంకేతికంగా పర్లేదు అనిపించినా.. నేపథ్య సంగీతం మాత్రం ప్రేక్షకుడిని కుర్చీలో కూర్చోబెడుతోంది. పాటోల్లో కొత్త ప్రయోగాలు ఉన్నప్పటికీ పెద్దగా పండలేదు. పతాక సన్నివేశం అందరూ ఊహించేదిగా ఉంటుంది.
బలాలు
- మొదటి అర్ధంలో కొంత కామెడీ
- సత్య, వెన్నెల కిషోర్, రాగ్ మయూర్ల కామెడీ
- నేపథ్య సంగీతం
బలహీనతలు
- కథ లేకపోవడం
- రెండో అర్ధంలో సాగదీత.
రేటింగ్ – 1.5 / 5
మొత్తంగా నవ్వుకుందామని వచ్చిన ప్రేక్షకుడిని ‘మిత్ర మండలి’ బలవంతంగా నవ్వించే ప్రయత్నం చేసింది.
