Warangal
క్రైమ్

Series of thefts: మంచితనం ముసుగులో వరుస దొంగతనాలు

Series of thefts: చూడడానికి ఇంట్లో మనిషిలాగే ఉంటాడు. మంచి మాటలు చెబుతూ అవసరాలకు ఉపయోగపడే మంచి బాలుడిగా నటిస్తూ ఇంత మంచివాడు ఉండడు అనేలా బిల్డప్ ఇస్తాడు. ఇంట్లో చోరీ జరితే ఇంటి మనిషిలా వెంట ఉండి పోలీస్ స్టేషన్ తీసుకువెళ్ళి దరఖాస్తు కూడ ఇప్పిస్తాడు. ఇంత చేసిన ఆ యువకుడే వరుస దొంగతనాలకు పాల్పడ్డ దొంగ అని తేలడంతో అటూ గ్రామస్తులు, ఇటూ పోలీసులు అవాక్కయ్యారు. మెకవన్నే పులిలా నమ్మకంగా నటిస్తూ ఆ నయవాంఛక యువకుడు వరుస దొంగతనాలకు పాల్పడడంతో పాటు చివరికి దొంగతనం చేస్తుండగా గుర్తుపట్టిన గర్భిణీ మానవత్వం మరిచి హత్య చేసేందుకు ప్రయత్నించి పోలీసులకు చిక్కిన ఘటన హన్మకొండ జిల్లా కమలాపూర్ మండలం వంగపల్లి లో చోటు చేసుకుంది.

కమలాపూర్ మండలం వంగపల్లిలో జరిగిన వరుస చోరీలకు పాల్పడుతూ సవాల్ గా మారిన కేసును పోలీసులు శుక్రవారం చేధించారు. కాజీపేట ఏసిపి పింగళి ప్రశాంత్ రెడ్డి మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించారు. వంగపల్లి గ్రామానికి చెందిన చిలువేరి ప్రశాంత్ అనే యువకుడు కొంతకాలంగా ఒంటరిగా ఉన్న మహిళలు తాళాలు వేసిన ఇల్లు టార్గెట్ చేసుకొని దొంగతనాలకు పాల్పతున్నాడని ఏసిపి తెలిపారు.

Also Read: Viral News: ప్లాస్టిక్ వాడవద్దని వేడుకుంటున్న.. నవ దంపతులు!

వరుస దొంగతనాలతో పోలీసులకు సవాల్

హనుమకొండ జిల్లా కమలాపూర్ మండలం, వంగపల్లి గ్రామంలో వరుస దొంగతనాలకు పోలీసులకు సవాల్ గా మారాడు. ఒంటరిగా ఉన్న మహిళలు తాళాలు వేసిన ఇల్లు టార్గెట్ చేసి వారితోపాటు కలిసి ఉంది అదును చూసి దొంగతనం చేస్తూ ఎవ్వరికీ అనుమానం రాకుండ జాగ్రత్త పడ్డాడు. గ్రామానికి చెందిన చిలివేరు ప్రశాంత్ అతని దగ్గరి మిత్రుడు ఆయన కోడెపాక మధుషూధన్ ను నమ్మించి ఇంట్లో చోరికి పాల్పడి రూ.60 వేలకు పైగా విలువ చేసే బంగారు ఆభరణాలు ఎత్తుకు వెళ్ళాడు. అదే గ్రామానికి చెందిన పశువుల రమాదేవి ఇల్లు తాళం వేసి ఉన్న సమయంలో చోరికి పాల్పడి రూ.2లక్షల విలువ చేసే బంగారు ఆభరణాలు ఎత్తుకు వెళ్ళాడు. చోరీ చేయడంతోపాటు చిలివేరు ప్రశాంత్ ఏమి తెలియనట్టు ఎవరికి అనుమానం రాకుండ వారిని పోలీస్ స్టేషన్ తీసుకు వెళ్ళి వారితో పోలీసులకు పిర్యాదు చేయించాడు.

గర్భిణిపై పాశవికంగా దాడి

గత వారం క్రితం అదే గ్రామంలోని ఓ ఇంట్లో దొంగతనానికి చిలివేరు ప్రశాంత్ ప్రయత్నించాడు. ఆ సమయంలో ఇంట్లో ఒంటరిగా ఉన్న గర్భిణీ ప్రశాంత్ ను గమనించింది. దీంతో తన బాగోతం బయట పడుతుందని బయటపడి గర్భిణీ అని చూడకుండా మహిళపై పాశవికంగా దాడి చేసి హత్య చేసేందుకు ప్రయత్నం చేశాడు. కొడవలితో దాడి చేసి మహిళ చనిపోయిందనుకుని వదిలేసి బంగారు నగలు దోచుకెళ్ళాడని బాధితులు తెలిపారు.

ఇంత చేసి ఏమి తెలియనట్టు 100 కు పోన్ చేసి పోలీసులకు సమాచారం ఇచ్చి గాయపడ్డ మహిళను గ్రామస్థులతో కలిసి ఆస్పత్రికి తీసుకు వెళ్ళాడు. ఇంతలో స్పృహలోకి వచ్చిన గర్భిణి తనపై చిలివేరు ప్రశాంత్ అన్న దాడి చేశాడనీ తెలుపడంతో అసలు విషయం బయటకు వచ్చింది. బాధితురాలు ఇచ్చిన సమాచారంతో విచారణ చేపట్టిన కమలాపూర్ పోలీసులు శుక్రవారం కమలాపూర్ బస్టాండ్ లో తనిఖీలు నిర్వహిస్తున్న ప్రశాంత్ పోలీసులకు ఎదురుపడటంతో నిందితున్ని అదుపులోకి తీసుకొని దోచుకున్న నగలను రికవరీ చేసి కోర్టులో హాజరు పరిచినట్టు ఏసిపి తెలిపారు.

వ్యసనాలకు బానిసై దొంగతనాలు

నిందితుడు ప్రశాంత్ ఆన్ లైన్ గేమ్ లకు అలవాటు పడి నష్టపోయి, అక్కడిక్కడ అప్పులు చేసి జల్పాలకు అలవాటుపడి సులువుగా డబ్బులు సంపాదించడానికి తన గ్రామంలో తాళం వేసిఉన్న ఇండ్లు, ఇంట్లో ఒంటరిగా ఉన్న మహిళలను లక్ష్యంగా చేసుకొని వారి పై దాడి చేసి దొంగతనాలు చేయడం అలవాటుగా మార్చుకున్నాడని ఏసిపి తెలిపారు. ప్రజలు అప్రమత్తంగా ఉండి గ్రామాల్లో జులాయిగా తిరుగుతూ చెడు వ్యసనాలకు అలవాటుపడ్డా యువకుల కదలికల సమాచారం పోలీసులకు అందించాలని, ప్రయాణాలు చేసే ముందు తమ విలువైన వస్తువులను సురక్షితంగా భద్రపరుచుకోవాలని ఏసిపి కోరారు. వంగపల్లి వరుస దొంగతనాలపై ప్రత్యేకంగా దృష్టి సారించి కేసులు చేదించడంలో క్రియాశీలకంగా పని చేసిన ఇన్స్పెక్టర్ హరికృష్ణ, ఎస్ఐ వీరభద్రం, పోలీస్ సిబ్బందిని ఏసిపి అభినందించారు.

 Also Read: Gold Medal Electrical: రాజస్థాన్ నకిలీ వ్యాపారాలతో.. ఆర్థికంగా నష్టపోతున్న ప్రజలు!

Just In

01

CM Revanth Reddy: నిమజ్జనానికి సింపుల్ గా సీఎం.. ఏమైనా ఇబ్బందులున్నాయా?

Leaves denied: బ్రదర్ పెళ్లికి లీవ్స్ ఇవ్వలేదని ఓ మహిళా ఉద్యోగి తీసుకున్న నిర్ణయం ఇదీ

Students Protest: మా సార్ మాకు కావాలి.. నిరసనకు దిగిన విద్యార్థులు

Dhanush: మరో తెలుగు డైరెక్టర్‌కి ధనుష్ గ్రీన్ సిగ్నల్.. ఆ దర్శకుడెవరో తెలుసా?

Gaddam Prasad Kumar: మహిళల ఆర్థిక అభివృద్ధే ప్రభుత్వ లక్ష్యం.. గడ్డం ప్రసాద్ కీలక వ్యాఖ్యలు