Gold Medal Electrical( IMAGE CREDIT SWETCHA REPORTER)
తెలంగాణ

Gold Medal Electrical: రాజస్థాన్ నకిలీ వ్యాపారాలతో.. ఆర్థికంగా నష్టపోతున్న ప్రజలు!

Gold Medal Electrical: ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో ఇటీవల గోల్డ్ మెడల్ ఎలక్ట్రికల్ నాణ్యమైన వస్తువుల ఆధారంగా రాజస్థాన్కు చెందిన వారు తమ తమ షాపుల్లో గోల్డ్ మెడల్ ఎలక్ట్రికల్ వస్తువుల పేరుట డూప్లికేట్ వస్తువులను విక్రయిస్తున్నారని సమాచారం మేరకు రాష్ట్రవ్యాప్తంగా గోల్డ్ మెడల్ కంపెనీకి చెందిన ఇన్వెస్టిగేషన్ అధికారులు, ఇన్వెస్టిగేషన్ డిటెక్టివ్ సర్వీస్ అధికారులు సంయుక్తంగా దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో నివ్వెరపోయే నిజాలు వెళ్లడయ్యాయి.

ఎలక్ట్రికల్ సామాన్యుల విషయానికి వస్తే గోల్డ్ మెడల్ కంపెనీ, ఫినోలెక్స్, ఆశీర్వాద్ కంపెనీలకు చెందిన ఇళ్లలో వాణిజ్య సముదాయాల్లో ఉపయోగించే తీగలు స్విచ్లు బోర్డులు బల్బులు ఫ్యాన్లు కుక్కర్లు గ్రైండర్లు వంటి వాటికి బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ బిఎస్సి ఆమోదం ఉంటేనే కొనాలని సంబంధిత కంపెనీలు సూచనలు చేస్తున్నాయి. కానీ ఇవే కంపెనీలకు చెందిన అన్ని రకాల వస్తువులను రాజస్థానీ వ్యాపారుల మాయాజాలంతో శాఖ చక్యంగా నకిలీ వస్తువులను తయారు చేసి విపరీతమైన వ్యాపార లావాదేవీలను సాగిస్తున్నారు.

 Also Read: PM Narendra Modi: పాకిస్థాన్ టార్గెట్ అదే.. ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు

వస్తువేదైనా మక్కికి మక్కి తయారు చేయడమే వారి లక్ష్యం

మార్కెట్లో విస్తృతంగా అమ్మకాలు జరిగే వస్తువేదైనా మక్కీకి మక్కీగా తయారు చేస్తూ తెలంగాణ ప్రజలను రాజస్థానీ వ్యాపారులు ఆర్థికంగా చితక్కొడుతున్నారు. ఏది అసలు.. ఏది నకిలీ.. ఏది లోకల్ అనేది కూడా పోల్స్కోలేనంతగా ప్యాక్ చేసి ఉంటున్న డబ్బాలతో వినియోగదారులు కొనేది బ్రాండెడ్ వస్తువులుగానే అపోహ పడాల్సిన దుస్థితి ఏర్పడింది. కంపెనీ ఎక్కడ తయారవుతుందో… డూప్లికేట్ వస్తువులు కూడా అదే ప్రాంతంలో తయారుచేసి అక్కడి నుంచే డిస్ట్రిబ్యూటర్ల సహాయంతో వివిధ జిల్లాలు, మండల కేంద్రాల్లోని రాజస్థానీయులు నిర్వహిస్తున్న వ్యాపార సముదాయాలకు చేరవేసి ప్రజలకు ఆర్థికంగా లోటు కలిగిస్తున్నారు.

రాజస్థాన్ షాపులకు తూనికలు కొలతల అధికారుల దాడులు.. జరిమానాలు

రాజస్థాన్ నుంచి వివిధ జిల్లా కేంద్రాలు మండల కేంద్రాల్లో వ్యాపారాలు నిర్వహిస్తున్న కిరాణా వంటి షాపులపై ఇటీవలనే తూనికలు కొలతల అధికారులు విస్తృతంగా దాడులు జరిపారు. ఈ దాడుల్లో ఒక్కో కేజీకి దాదాపుగా 100 గ్రాముల నెట్ వెయిట్ తగ్గినట్టుగా గుర్తించారు. అలా తనిఖీల్లో బయటపడిన షాపులకు జరిమానాలను సైతం విధించారు. అదేవిధంగా ఇకపై ఇలాంటి వ్యాపారాలు సాగిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరికలను కూడా జారీ చేశారు.

రాష్ట్రవ్యాప్తంగా ఇన్వెస్టిగేషన్ డిటెక్టివ్ సర్వీస్ అధికారుల విస్తృత దాడులు

నివాస యోగ్యమైన ఇండ్లు వ్యాపార సముదాయాల షాపింగ్ కాంప్లెక్స్ లు అపార్టు మెంట్లకు గోల్డ్ మెడల్ ఫినోలెక్స్ ఆశీర్వాద్ వంటి కంపెనీల వైర్లు, స్విచ్, బోర్డులు, బల్బులు, ఫ్యాన్లు, ఏసీ సంబంధిత వైర్లను సైతం డూప్లికేట్ గా తయారుచేసి విక్రయాలు జరిపారు. ఇలా జరిపిన వాటిల్లో ప్రముఖంగా కోటి ట్రూప్ బజార్లో విస్తృతంగా డూప్లికేట్ వస్తువులను విక్రయిస్తున్నట్టుగా అధికారులు గుర్తించారు. ఇలా కొనుగోలు చేసిన వస్తువుల కారణంగానే ఓల్డ్ సిటీలో గుల్జార్ హౌస్ లో నకిలీ ఏసి వైర్ల కారణంగానే విద్యుత్ ప్రమాదం సంభవించి 11 మంది మృత్యువాత చెందిన విషయం తెలిసిందే. అధికారులు చేపట్టిన విచారణలో ఏసీలకు అనుసంధానం చేసిన నకిలీ వైర్ల కారణంగానే విద్యుత్ ప్రమాదం జరిగినట్టు గుర్తించి అదే కోణంలో విచారణ జరిపారు. ఇందుకు సంబంధించిన నివేదికను బాంబే హైకోర్టులో అందించనున్నట్లు అధికారులు వెల్లడిస్తున్నారు.

Also Read: MLA harish Rao: క్యాబినెట్ నిర్ణయాలపై.. హరీష్ రావు అసహనం!

జీరో ఐటెం… తక్కువ ధరకు విక్రయాలు

వివిధ జిల్లా కేంద్రాలు, మండల కేంద్రాల్లో రాజస్థానీయుల కు సంబంధించిన షాపుల్లో జీరో ఐటమ్ దందా కొనసాగుతుంది. అయితే జీరో ఐటెం అమ్మడం వల్ల ప్రభుత్వానికి టాక్స్ కట్టాల్సిన అవసరం లేదు. అదేవిధంగా షాపుకు సంబంధించిన ఆడిట్లో పొందుపరచాల్సిన అవసరం లేదు. ఈ కారణంగానే స్థానికంగా నిర్వహిస్తున్న వ్యాపారులకు రాజస్థానీ వ్యాపారులకు కొంత తక్కువ ధరకు రావడంతో స్థానికులు రాజస్థానీలకు సంబంధించిన షాపుల వైపు కొనుగోలు చేసేందుకు మగ్గు చూపుతున్నారు.

గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ రాష్ట్రం కోసం పోరాటం చేసిన ఉద్యమం లాగానే రానున్న రోజుల్లో తెలంగాణ.. రాజస్థాన్ కోసం ఉద్యమం చేయాల్సిన పరిస్థితులు నెలకు స్థితి తెలంగాణలో వచ్చిందని వ్యాపారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలో రాజస్థానీయులు ఆధార్ సహా అన్ని రకాల నివాస యోగ్యమైన ఐడెంటిటీ ప్రూఫ్ లను సాధించుకున్నట్లుగా తెలుస్తుంది. ఏ మండలం ఏ జిల్లా చూసినా దాదాపుగా వ్యాపార వర్గాలు కనిపించేది రాజస్థానీలకు సంబంధించిన వ్యాపారస్తుల కనిపించడం ఆందోళన కలిగించే అంశం.

రాజస్థానీ వ్యాపారుల నకిలీ లీలలు

ఒకటి కాదు..రెండు కాదు.. ఏకంగా అన్ని వస్తువుల్లోనూ నకిలీ లను తయారు చేయడమే రాజస్థానీ వ్యాపారం లక్ష్యంగా పెట్టుకున్నారు. కిరాణా షాపులు, టీ స్టాల్స్, ఫ్యాన్సీ, సెల్ స్పేర్ పార్ట్స్, ఆటోమొబైల్, ప్లంబింగ్, శానిటరీ, ఎలక్ట్రికల్, వన్ గ్రామ్ గోల్డ్, జనరల్ బుక్స్, స్వీట్ హౌసెస్ లా అన్నిట్లోనూ రాజస్థానీలు పాతుకుపోయారు. వీళ్లు అమ్మే ఐటమ్స్ ఎక్కువగా ఎమ్మార్పీ లేని వాటి మీద ఫోకస్ పెట్టి వ్యాపారం చేస్తారు. ఉదాహరణకు సానిటరీ షాపులు బేసిన్స్, స్వీట్ హౌసెస్, సెల్ షాప్స్, కేబుల్ ప్లైవుడ్ షాపులతో పాటు ఎమ్మార్పీ రేట్లు లేని వస్తువులను తమ షాపుల్లో విక్రయాలు చేస్తుంటారు.

జీరో ఐటమ్స్… తక్కువ ధరలు

రాజస్థానీ వ్యాపారులు ప్రధానంగా జీరో ఐటమ్స్ పై ప్రత్యేక దృష్టి పెట్టి ఆ వస్తువులను మాత్రమే తమ షాపుల్లో విక్రయించడానికి సుముఖం చూపుతారు. అలా వచ్చిన వస్తువులు అమాయక ప్రజలకు వినియోగిస్తుంటారు. అయితే అదే వస్తు బయట షాపుల్లో కొనుగోలు చేస్తే ఎమ్మార్పీ ధరకు కచ్చితంగా ఇవ్వాల్సి ఉంటుంది… కానీ ఇక్కడ అమ్మే వస్తువులకు ఎమ్మార్పీ రేటు ఉండదు కాబట్టి కస్టమర్ ను బట్టి ఒక్కో వ్యక్తికి ఒక్కో రకమైన రేటుకు అంటగడతారు.

అయితే ఇక్కడ కోనే వ్యక్తిని బట్టి లాభాలను అర్జిస్తూ ఉంటారు. కచ్చితంగా ఇంత రేటుకు అమ్మాలని నిబంధన కూడా వీరి షాపుల్లో ఉండదు. ఒక విధంగా చెప్పాలంటే ఈ షాపుల్లో కనీసం తెలంగాణకు సంబంధించిన వర్కర్ ఒక్కరు కూడా ఉండకుండా జాగ్రత్తలు పడతారు. అలా తెలంగాణకు సంబంధించిన వ్యక్తులను పెట్టుకుంటే వీరి వ్యాపారం లోసుగులు ఎక్కడ తెలుస్తాయోననే కారణం తోటే ఇక్కడివారిని పనిలో పెట్టుకోవడానికి సుముఖంగా ఉండరు. అదేవిధంగా బిల్లు వివరాలు రాసేటప్పుడు కేవలం హిందీలోనే రాసి బిల్ టోటల్ చేసి అందిస్తారు. అలా చేయడం వల్ల ఏ వస్తువుకు ఎంత రేటు పడిందో కూడా తెలుసుకునేందుకు వీలుండదు.

మన ఊరు…మన దుకాణం Support local business

మన ఊరు.. మన దుకాణం అంటూ సూర్యాపేటలో విస్తృత ప్రచారం మొబైల్ ఆటోలకు ప్లెక్సీలను అంటించి ప్రచారం నిర్వహించుకుంటున్నారు. రాజస్థానీలను ఏమి చేయలేక తమ వ్యాపారాలను సాగించుకోవాలంటే ఏం చేయాలో తోచక మన ఊరు మన దుకాణం సపోర్టు లోకల్ బిజినెస్ అనే ట్యాగ్ లైన్ తో వ్యాపారాలను సాఫీగా సాగించుకునేందుకు ప్రయత్నం చేస్తున్నారు. అలాగే మైకుల్లో స్థానిక వ్యాపారాలను ప్రోత్సహించండి మన ఐక్యతను చాటుకుందాం. మన జనం మన బలం ప్రజా ప్రయోజనాల కోసం సపోర్టు చేయనని వేడుకుంటున్నారు.

ప్రతి ఏటా విద్యుత్ ప్రమాదాలతో 600 మంది మృత్యువాత
నకిలీ వైర్లు, స్విచులు, వివిధ రకాల గృహోపకరణాల విద్యుత్ వస్తువుల కారణంగా ప్రతి ఏటా తెలంగాణ రాష్ట్రంలో 600 మంది మృతి చెందుతున్నట్లుగా నివేదికలు వెల్లడిస్తున్నాయి. ఇదే విషయాన్ని ఇటీవలే పలు ప్రమాద ఘటనల్లో విచారణ చేసిన అధికారులే స్వయంగా వెల్లడించడం గమనార్హం.

 Also Read: World Environment Day: పర్యావరణ పరిరక్షణ కోసం.. మొక్కలు నాటాలి!

Just In

01

Sensational Cases: రాష్ట్రంలో సంచలన కేసులు.. నత్తనడకగా విచారణ.. ఇది దేనికి సంకేతం..?

Turakapalem Village: ఎవరూ వంట చేసుకోవద్దు.. కనీసం నీళ్లూ తాగొద్దు.. ప్రభుత్వం ఆదేశాలు

Ponguleti Srinivasa Reddy: త్వరలో సాదాబైనామాలకు మోక్షం.. మంత్రి కీలక వ్యాఖ్యలు

Su From So OTT release: ‘ఓటీటీలోకి వచ్చేస్తున్న కామెడీ థ్రిల్లర్.. ఎక్కడంటే?

BRS Party: గులాబీ పార్టీకి డ్యామేజ్.. కంట్రోల్ చేసేందుకు ప్రయత్నం?.. సాధ్యపడేనా..?