Sangareddy Tragic: ఏ తల్లి కన్న బిడ్డనో కారణాలు ఏవో కానీ జన్మించిన పసికందు చెత్తబుట్టలో శవమై కనిపించింది. సంగారెడ్డి జిల్లా(Sangareddy District) జహీరాబాద్ ప్రభుత్వ ఏరియా హాస్పిటల్ ఆవరణలో క్యాంటీన్ సమీపంలో ఉన్న ఓ చెత్తబుట్టలో శనివారం మగ పసి గుడ్డు మృతదేహం లభించింది. ఎవరో గుర్తు తెలియని వారు పసికందును చెత్తబుట్టలో వేసి వెళ్లారు. ఆస్పత్రిలో జన్మించిన పసి గుడ్డు(KID) ప్రాణాలు పోవడంతో మృతదేహాన్ని చెత్త బుట్టలో వేశారా లేక మరేమైనా కారణాలు ఉన్నాయా అనే అనుమానాలు వ్యక్త మవుతున్నాయి. సమాచారం అందుకున్న జహీరాబాద్ పోలీసులు(Police) ఏరియా హాస్పిటల్‌కు చేరుకొని చెత్తబుట్టలో ఉన్న మృతదేహాన్ని మార్చురికి తరలించారు. పసి గుడ్డు కాలుకు ఉన్న హాస్పిటల్ బ్యాడ్జి ఆధారంగా దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
Also Read: Tragedy: మియాపూర్ లో విషాదం.. భవనం పై నుండి దూకి 10వ తరగతి విద్యార్థిని ఆత్మహత్య
మద్దిలపాలెంలో హృదయవిదారక ఘటన
గత కొన్ని రోజుల క్రితం ఆంధ్రప్రదేశ్(AP) లోని విశాఖపట్నం(Visakhapatnam) మద్దిలపాలెంలో హృదయవిదారక ఘటన జరిగింది. విశాఖలోని శ్రీ రాజ రాజేశ్వరి ఆలయం(Raja Rajeshwari Temple) దగ్గర చెత్తబుట్టలో అప్పుడే పుట్టని మగ శిశువు మృతదేహం లభ్యమైంది. గురువారం రోజు ఉదయం ఈ సంఘటన చూసిన స్థానికులు ఒక్క సారిగా షాక్‌కి గురయ్యారు. చూసిన వెంటనే అక్కడి స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. దీంతె పోలీసులు మగ శిశువును కేజీహెచ్(KGH) కి తరలించగా, అప్పటికే మృతి చెందినట్లు హస్పటల్(Hospital) వైద్యులు తెలిపారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసుకొని సీసీ కెమెరాలు పరిశీలిస్తూ దర్యాప్తు చేస్తున్నారు.
Also Read: Mulugu District: భారీ వర్షంలో వాగు దాటుతూ నిండు గర్బిణీ ఆవస్ధలు