Tragedy: పదవ తరగతి విద్యార్థిని భవనం పైనుంచి దూకి ఆత్మహత్య చేసుకున్న ఘటన మియాపూర్ (Miyapur Police) పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మియాపూర్‌లోని జనప్రియ అపార్ట్‌మెంట్స్‌లో నివాసం ఉండే బిజోయి నాయక్ కుమార్తె హన్సిక (14), స్థానిక ప్రైవేట్ పాఠశాలలో పదవ తరగతి(10th class)చదువుతుంది. మధ్యాహ్నం ఆమె తమ అపార్ట్‌మెంట్ ఐదవ అంతస్తు పైనుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడింది. తీవ్రంగా గాయపడిన హన్సిక, అక్కడికక్కడే మృతి చెందింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ దవాఖానకు తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Also Read: Nagarkurnool district: నాగర్‌కర్నూల్ జిల్లాలో నయా మోసం.. అధికారులపై వేటు!
స్కూల్ యాజమాన్యమే కారణం..
హన్సిక మృతికి రిజ్వాన్ కుటుంబ సభ్యులు, స్కూల్ యాజమాన్యమే కారణమని ఆమె తండ్రి బిజోయి నాయక్ ఆరోపించారు. గత వారం రోజుల క్రితం మియాపూర్(Miyapur)లోని సెయింట్ మార్టిన్ స్కూల్‌లో రిజ్వాన్ అనే విద్యార్థి స్కూల్ భవనం పైనుంచి దూకి ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. రిజ్వాన్ మృతికి హన్సిక కారణమంటూ అతని కుటుంబ సభ్యులు, స్కూల్ యాజమాన్యం తన కుమార్తెను వేధిస్తున్నారని బిజోయి నాయక్ తెలిపారు. “హన్సిక చస్తేనే రిజ్వాన్ ఆత్మ శాంతిస్తుందని బెదిరించడం, స్కూల్‌లో పరీక్షలు రాయనీయకుండా అడ్డుకోవడం వల్లే నా కుమార్తె తీవ్ర మనోవేదనకు గురై ఈ ఘాతుకానికి పాల్పడింది,” అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. హన్సిక మృతికి కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.
Also Read: Farmers Protest: రోడ్డెక్కిన రైతన్నలు.. సీడ్ కంపెనీల తీరుపై తీవ్ర ఆగ్రహం..