Mulugu District: ఓ గర్భిణీ నిండు చూలాలతో అవస్థలు పడుతోంది. గత మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు ఆ గ్రామ సమీపంలోని రహదారికు అడ్డుగా ఉన్న వాగు తీవ్ర ఉధృతితో ప్రవహించడంతో గర్భిణీని ఆసుపత్రికి తరలించాలంటే నాన్న అవస్థలు పడాల్సిన దుస్థితి ఏర్పడింది. వివరాల్లోకి వెళితే ములుగు(Mulugu) జిల్లా తాడ్వాయి మండలం బంధాల శివారు అల్లిగూడెం గ్రామానికి చెందిన గర్భిణీ కృష్ణవేణికి నిండు నెలలు వచ్చాయి. గురువారం మధ్యాహ్నం పురిటి నొప్పులు ఎక్కువ కావడంతో ఆమెను మండలంలోని ఆసుపత్రికి తరలించాలంటే రహదారి లేకపోవడంతో నానా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. గ్రామంలోని యువకులు సదరు గర్భిణీని ఆసుపత్రికి తీసుకెళ్లేందుకు వాగు దాటించే క్రమంలో చేతులపై మోసుకుంటూ వెళ్తూ తీసుకెళ్లారు. తాడువాయి మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రికి సదరు గర్భిణీని తరలించి చికిత్స అందిస్తున్నారు.
Also Read: Eatala Rajendar: ఈటల రాజేందర్ పై ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఫైర్
అల్లిగూడెం వాగు పై బ్రిడ్జి నిర్మించాలని గ్రామస్తుల డిమాండ్
ములుగు జిల్లాలోని తాడ్వాయి మండలం మారుమూల ప్రాంతమైన బంధాల శివారు అల్లిగూడెం సమీపంలోని వాగుపై బ్రిడ్జి నిర్మించాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. ఎన్నో ఏళ్లుగా బ్రిడ్జ్ కి నోచుకోక పోవడంతో అల్లిగూడెం గ్రామానికి చెందిన గ్రామస్తులు తీవ్ర ప్రయాణ ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. గత బిఆర్ఎస్(BRS) ప్రభుత్వంలో ఈ బ్రిడ్జికి సంబంధించిన విషయమై పట్టించుకోకపోవడంతో పలుమార్లు ఆందోళనలు సైతం చేశారు. జిల్లాకి చెందిన సీతక్క మంత్రి(Min Seethakka) కావడం అది కూడా పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి శాఖల మంత్రిగా ఉండడంతో ఇకనైనా అల్లిగూడెం వాగు పై బ్రిడ్జి నిర్మాణానికి మోక్షం లభిస్తుందని గ్రామస్తులు ఎదురుచూస్తున్నారు.
Also Read: Gali Kireeti :చిన్నారి స్టెప్పులు అదుర్స్.. గాలి కిరీటీ
