Shocking Murder (imagecredit:swetcha)
క్రైమ్

Shocking Murder: కుషాయిగూడలో దారుణం.. ఓ రియల్టర్ దారుణ హత్య!

Shocking Murder: అందరూ చూస్తుండగానే దుండగుడు ఓ రియల్టర్ ను అతని ఇంటి ముందే దారుణంగా హత్య చేశాడు. అడ్డుకోవటానికి ఓ బైకర్​ ప్రయత్నించగా అతన్ని బెదిరించాడు. స్థానికంగా తీవ్ర సంచలనం సృష్టించిన ఈ హత్య కుషాయిగూడ(Kushaiguda) పోలీస్ స్టేషన్​ పరిధిలో జరిగింది. వివరాలు ఇలా ఉన్నాయి. మంగాపురం కాలనీ నివాసి శ్రీకాంత్ రెడ్డి(Srikanth Reddy) రియల్ ఎస్టేట్ వ్యాపారి. కాగా, శుక్రవారం సాయంత్రం శ్రీకాంత్ రెడ్డి ఇంటికి వచ్చిన ఓ వ్యక్తి అతన్ని బయటకు పిలిచాడు. బయటకు రాగానే వెంట తెచ్చుకున్న కత్తితో శ్రీకాంత్ రెడ్డిపై దాడి చేసి విచక్షణారహితంగా పొడిచాడు.

ఆ సమయంలో అటుగా బైక్​ పై వెళుతున్న ఓ వ్యక్తి అడ్డుకోవటానికి ప్రయత్నించగా కత్తి చూపించి బెదిరించాడు. తీవ్రంగా గాయపడ్డ శ్రీకాంత్ రెడ్డి రక్తం మడుగులో కుప్పకూలి అక్కడికక్కడే చనిపోయాడు. విషయం తెలియగానే కుషాయిగూడ పోలీసులు నేరస్థలానికి వచ్చారు. పంచనామా జరిపి మృతదేహాన్ని గాంధీ ఆస్పత్రి(Gandhi Hospital) మార్చురీకి తరలించారు. ఆర్థిక విభేధాల నేపథ్యంలోనే హత్య జరిగినట్టుగా భావిస్తున్నారు.

Also Read: Gold Rate Today: మహిళలకు షాకింగ్ న్యూస్.. నేడు భారీగా పెరిగిన గోల్డ్ రేట్స్..

బాకీ తీర్చటం లేదని ఆత్మహత్యాయత్నం..

అప్పు తీసుకున్న వ్యక్తి బాకీ తీర్చటం లేదన్న బాధతో ఓ మహిళ ఆత్మహత్యాయత్నం చేసింది. అయితే, సకాలంలో పోలీసులు ఆమెను రక్షించారు. ఈ సంఘటన కూకట్ పల్లి పోలీస్ స్టేషన్​ పరిధిలో జరిగిది. కూకట్ పల్లి(Kukatpally)లో నివాసముంటున్న రాధిక కొంతకాలం క్రితం పరిచయం ఉన్న వ్యక్తి అత్యవసరమని అడగటంతో లక్ష రూపాయలు అప్పుగా ఇచ్చింది. అయితే, అప్పు తీసుకున్న వ్యక్తి చెప్పిన సమయానికి బాకీ తీర్చలేదు. ఎపుడు అడిగినా అపుడు ఇపుడు అంటూ కాలం గడుపుతున్నాడు. దాంతో రాధిక కూకట్ పల్లి ప్రాంతంలోని చెరువులోకి దూకి ఆత్మహత్యకు ప్రయత్నించింది. ఆ సమయంలో చెరువు దగ్గరలోనే ఉన్న పోలీసులు వెంటనే అక్కడికి వెళ్లి మహిళను రక్షించారు. కూకట్ పల్లి పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Also Read: Vikarabad Rice Mill Scam: వికారాబాద్​ రైస్ మిల్లులో.. రూ.200 కోట్ల విలువైన బియ్యం మాయం?

Just In

01

Huzurabad Heavy Rains: హుజురాబాద్‌లో రికార్డు స్థాయిలో వర్షం.. లోతట్టు ప్రాంతాలు అతలాకుతలం

Mirai success meet: ‘మిరాయ్’ సక్సెస్ మీట్‌లో ఎమోషనల్ అయిన మంచు మనోజ్.. ఎందుకంటే?

Congress: మణిపూర్‌లో ప్రధాని పర్యటన.. లాజిక్‌ ప్రశ్నలతో ఏకిపారేసిన కాంగ్రెస్

Modi Manipur Visits: మణిపూర్ ప్రజలకు ప్రధాని మోదీ కీలక సందేశం

Ramchander Rao: ఆప్టికల్ ఫైబర్ సౌకర్యాలు లేక.. ఇబ్బందుల్లో కేబుల్ ఆపరేటర్స్!