Drugs Seized: విలువైన మాదక ద్రవ్యాలు సీజ్ చేసిన పోలీసులు
Drugs Seized (imagecredit:swetcha)
క్రైమ్

Drugs Seized: లక్షల విలువైన మాదక ద్రవ్యాలు సీజ్ చేసిన పోలీసులు

Drugs Seized: పక్కా సమాచారం మేరకు హైదరాబాద్(Hyderabad) నార్కొటిక్ ఎన్‌ఫోర్స్‌మెంట్ వింగ్ అధికారులు బేగంబజార్ పోలీసు(Begum Bazar)లతో కలిసి డ్రగ్స్ దందా నిర్వహిస్తున్న ముగ్గురిని అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి రూ.10 లక్షల విలువ చేసే మాదక ద్రవ్యాలతోపాటు ఒక నాటు తుపాకీ, 6 బుల్లెట్లను స్వాధీనం చేసుకున్నారు. హైదరాబాద్ కమిషనర్ సీవీ ఆనంద్(CV Ananadh) ఐసీసీసీ(ICC)లో నిర్వహించిన మీడియా సమావేశంలో టాస్క్‌ఫోర్స్ డీసీపీ సుధీంద్ర(DCP Sudheendra) తో కలిసి ఈ వివరాలను వెల్లడించారు. రాజస్థాన్ రాష్ట్రానికి చెందిన జితేందర్ పన్వర్ అలియాస్ జీతూ (38) 12 ఏళ్ల వయసులోనే ఉపాధి వెతుక్కుంటూ హైదరాబాద్ వచ్చి కాటేదాన్‌లో స్థిరపడ్డాడు.

ఇద్దరూ కలిసి డ్రగ్స్ దందా
వేర్వేరు స్వీట్ షాపుల్లో పని చేస్తూ మిఠాయిలు తయారు చేయడంలో నైపుణ్యం సంపాదించుకుని సొంతంగా షాపు పెట్టుకున్నాడు. అయితే, ఈ వ్యాపారంలో నష్టాలు రావడంతో, రాజస్థాన్(Rajasthan) నుంచి డ్రగ్స్ తెస్తూ హైదరాబాద్‌లో అమ్ముతున్న ట్రాన్స్‌పోర్టర్ పవన్ భాటీ (24)తో అతనికి పరిచయం ఏర్పడింది. ఆ తర్వాత ఇద్దరూ కలిసి డ్రగ్స్ దందా ప్రారంభించారు. పవన్ భాటీ రాజస్థాన్ వెళ్లి సురేందర్(Surndhar) అనే వ్యక్తి నుంచి డ్రగ్స్ తెస్తే జీతూ అతనితో కలిసి వాటిని అమ్మేవాడు. మరికొన్నిసార్లు జీతూ రాజస్థాన్‌కు చెందిన హేమ్ సింగ్ కచ్వా నుంచి నేరుగా డ్రగ్స్ తెప్పించుకుని విక్రయిస్తూ వస్తున్నాడు. ఇదిలా ఉండగా, జీతూ కొంతకాలం క్రితం 70 వేల రూపాయలు వెచ్చించి ఒక నాటు తుపాకీతోపాటు 7 బుల్లెట్లను కొనుగోలు చేశాడు.

Also Read: Maha Lakshmi Scheme: మరో మైలురాయి దాటిన తెలంగాణ ఆర్టీసీ

ఒక రౌండ్ కాల్పులు జరిపి
అవసరం వచ్చినప్పుడు దానిని ఉపయోగించాలని ఇంటిలో దాచి పెట్టుకున్నాడు. దానికి ముందు కాటేదాన్‌లోని ఒక నిర్జన ప్రదేశంలో ఒక రౌండ్ కాల్పులు జరిపి దానిని పరీక్షించుకున్నాడు కూడా. ఈ గ్యాంగ్ సాగిస్తున్న డ్రగ్స్ దందా గురించి సమాచారం సేకరించిన హైదరాబాద్ నార్కొటిక్ ఎన్‌ఫోర్స్‌మెంట్(Hyderabad Narcotic Enforcement) వింగ్ సీఐ జీఎస్ డేనియల్, ఎస్ఐ వెంకట రాములతోపాటు బేగంబజార్ సీఐ భరత్ కుమార్ గౌడ్, ఎస్ఐ శ్రీశైలం కలిసి ముగ్గురిని అరెస్ట్ చేశారు. వారి నుంచి ₹10 లక్షల రూపాయల విలువ చేసే డ్రగ్స్, మొబైల్ ఫోన్లు, నాటు తుపాకీ, బుల్లెట్లు స్వాధీనం చేసుకున్నారు. ముగ్గురిపై బేగంబజార్ పోలీసులు మాదక ద్రవ్యాల నిరోధక చట్టం, ఆర్మ్స్ యాక్ట్ ప్రకారం కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Also Read: Jurala Incident: జూరాలలో గల్లంతైన యువకుని మృతదేహం లభ్యం

 

Just In

01

Etela Rajender: నేను ఏ పార్టీలో ఉన్నానో వారే చెప్పాలి: ఈటల రాజేందర్

Overdraft vs Personal Loan: ఓవర్‌డ్రాఫ్ట్ vs పర్సనల్ లోన్.. మీ డబ్బు అవసరంలో ఏది సరైన ఎంపిక?

MLC Kavitha: గులాబీ నాయకులకు కవిత గుబులు.. ఎవరి అవినీతిని బయట పడుతుందో అని కీలక నేతల్లో టెన్షన్!

Akhanda2: ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ ప్రశంసలు పొందిన బాలయ్య ‘అఖండ 2 తాండవం’..

Gold Rates: ఈ రోజు తెలుగు రాష్ట్రాల్లో గోల్డ్ రేట్స్ ఎలా ఉన్నాయంటే?