Jurala Incident: ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు నదీ జలాలను చూసేందుకు వచ్చిన యువకుడు.. తిరుగు ప్రయాణంలో కారు ఢీకొనగా కృష్ణా నదిలోకి ఎగిరి పడగా నీటిలో గల్లంతయ్యాడు. నేడు జాలర్లకు యువకుడి మృతదేహం లభించింది. జూరాల డ్యాంపై కారు – బైక్ ఢీకొన్న ఘటనలో మానవపాడు మండలం బూడిదపాడుకు చెందిన మహేశ్‌తో (Mahesh) పాటు మరో ముగ్గురు జూరాలకు వచ్చారు. నది జలాలను చూసిన అనంతరం గద్వాలకు తిరిగి వస్తుండగా జూరాల బ్రిడ్జిపై ఎదురుగా వస్తున్న కారు డ్రైవింగ్ చేస్తున్న వ్యక్తి ఫోన్ చూస్తూ నిర్లక్ష్యంగా నడుపుతూ ద్విచక్ర వాహనాన్ని ఢీ కొట్టింది.
Also Read: Jurala Accident: జూరాల వద్ద విషాదం.. కొంపముంచిన సెల్ ఫోన్ డ్రైవింగ్
జూరాల డాం పై ధర్నా
దీంతో డ్రైవింగ్ చేస్తున్న వ్యక్తి తీవ్రంగా గాయపడగా వెనకాల కూర్చున్న మహేష్ (Mahesh) సమీపంలోని నదీ ప్రవాహంలో ప్రమాదవశాత్తు పడ్డాడు. గత మూడు రోజులుగా గల్లంతైన యువకుని కోసం గాలించగా ఆచూకీ లభించలేదు. దీంతో మహేష్ (Mahesh) కుటుంబ సభ్యులు బంధువుల రోదనలు మిన్నంటాయి. మహేష్ (Mahesh) ఆచూకీ కనిపెట్టాలని జూరాల డాం పై ధర్నా సైతం చేపట్టారు. మూడు రోజుల గాలింపు అనంతరం నేడు ఆత్మకూరు మండలం మూలమల్ల గ్రామ శివారులోని కృష్ణా నదిలో చేపల వేటకు వెళ్లిన జాలర్లకు గుర్తు తెలియని మృతదేహం లభించింది. దీంతో పోలీసులకు (Police) సమాచారం ఇవ్వడంతో ఇటీవల నీటిలో గల్లంతైన మహేష్ (Mahesh) డెడ్ బాడీగా పోలీసులు గుర్తించారు.
Also Read: Farmers Protest: రోడ్డెక్కిన రైతన్నలు.. సీడ్ కంపెనీల తీరుపై తీవ్ర ఆగ్రహం..
