Medchal Tragedy (imagcredit:swetcha)
క్రైమ్

Medchal Tragedy: టిప్పర్ ఢీకొని ఆరేళ్ళ బాలుడు మృతి

Medchal Tragedy: ఓ టిప్పర్ ముక్కు పచ్చలారని ఆరేళ్ళ బాలుడిని చిదిమేసింది. ఈ హృదయ విధారక సంఘటన దుండిగల్ పోలీస్ స్టేషన్(Dundigal Police Station) పరిధిలో చోటు చేసుకుంది. ఇంటి నుంచి బయలుదేరిన బాలుడిని టిప్పర్ రూపంలో మృత్యువు కబళించింది. దీంతో బాలుడి కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు. దుండిగల్ పోలీసులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం నిజామాబాద్(Nizamabad) జిల్లాకు చెందిన రాజు మల్లంపేటలోని ఆకాష్ లే అవుట్ లో కుటుంబ సభ్యులతో కలిసి జీవిస్తున్నాడు. వారి కుమారుడు అభిమన్సు రెడ్డి(6) స్థానికంగా ఉండే గీతాంజలి ఇంటర్నేషనల్ స్కూల్‌(Geetanjali International School)లో ఒకటవ తరగతి చదువుతున్నాడు.

తల్లి ఎదుటే ఈ ఘటన

రోజులాగే ఈ నెల 27న ఉదయం ఎనిమిది గంటలకు తన తల్లి ద్విచక్రవాహనంపై బాలుడిని తీసుకొని స్కూల్‌(school)కు బయలు దేరింది. మల్లంపేట లోని పల్లవి ఇంటర్నేషనల్ స్కూల్ దగ్గరకు రాగానే ద్విచక్రవాహనాన్ని ఓ టిప్పర్ వెనక నుంచి ఢీకొట్టడంతో బాలుడు అక్కడికక్కడే మృతి చెందాడు. తల్లి ఎదుటే ఈ ఘటన జరిగింది.దీంతో అప్పటివరకు తనతో కబుర్లు చెప్పిన కొడుకు చనిపోవడంతో ఆమె విలవిల్లాడింది. మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం మేడ్చెల్ ప్రభుత్వ ఆసుపత్రి(Medchel Govt Hospital)కి తరలించి టిప్పర్ డ్రైవర్‌ను అదుపులోకి తీసుకొని పోలీసులు విచారణ చేస్తున్నట్లు సిఐ పి.సతీష్ తెలిపారు.

Also Read: Medchal district: భారీ శబ్ధాలు దుమ్ము ధూళితో ప్రజలు ఉక్కిరిబిక్కిరి.. ఎక్కడంటే!

పోలీసులు వాల్లను ఆపడం లేదు

మూడుు రోజుల క్రితం మాగనూరు మురహరదొడ్డి గ్రామానికి చెందిన ఉరుకుందు అనే వ్యక్తి తన భార్యతో రోడ్డుపై వెలుతుండగా అక్కడే భూడిద టిప్పర్ డీకొట్టింది. ఆ ఇంటి యజమాని ప్పస్తుతం కోమాలో ఉన్నాడు. ప్రమాదం జరిగిన వెంటనే టిప్పర్ యజమానులు పత్తా లేకుండా పోయారని భాదిత కుటుంబికులు తెలిపారు. డ్రంక్ అండ్ డ్రైవ్(Drunk and Drive చెక్ చేయడానికి సైతం పోలీసులు సైతం టిప్పర్‌ల జోలికి వెల్లకుండా భయపడుతున్నారు. మద్యంమత్తులో అతివేగంగా నడుసపుతున్నా వారిని మాత్రం పట్టించుకోవడం లేదన్న ఆరోపణలు వెలువడుతున్నాయి.

Also Read: Medchal district: భారీ శబ్ధాలు దుమ్ము ధూళితో ప్రజలు ఉక్కిరిబిక్కిరి.. ఎక్కడంటే!

 

Just In

01

O Cheliya movie song: ‘ఓ.. చెలియా’ సినిమా నుంచి పాటను విడుదల చేసిన మంచు మనోజ్..

Khairatabad Ganesh 2025: గంగమ్మ ఒడికి.. ఖైరతాబాద్ మహా గణపతి.. భారీగా తరలివచ్చిన భక్తులు

Ponguleti Srinivasa Reddy: అభివృద్ధి సంక్షేమాన్ని ముందుకు తీసుకెళ్లడమే మా లక్ష్యం: మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి

Donald Trump: భారత్‌పై ట్రంప్ యూటర్న్.. మోదీ ఎప్పటికీ ఫ్రెండే అంటూ.. దగ్గరయ్యేందుకు తాపత్రయం!

SIIMA Awards 2025: సైమా 2025 విజేతలు ఎవరంటే?.. ఖుషీ అవుతున్న ఆ హీరోల ఫ్యాన్స్