Medchal Crime: అనుమానం పెనుభూతమైంది. ఏ పరిస్థితుల్లోనూ నీ తోడు వీడిపోను అని పెళ్లినాడు చేసిన ప్రమాణాలకు కాలం చెల్లాయి. అనుమానంతో రోజు రోజుకు ఆలీపై కోపం, అసహనం పెరిగి, కాటికి పంపే స్థాయికి చేరుకుంది. ఇరువురి మధ్య జరిగిన ఘర్షణలో భర్త భార్యను గొంతు నులిమి హత్య చేసి, ఐదు నెలల చిన్నారికి తల్లిని లేకుండా చేశాడు. భార్య చనిపోయిందని నిర్ధారించుకున్నాకే ఘటనా స్థలం నుంచి భర్త పారిపోయాడు. ఈ దురాగతం మేడ్చల్(Medchal) పోలీస్‌స్టేషన్ పరిధిలోని కేఎల్‌ఆర్-ఎన్‌జేఆర్ నగర్‌లో జరిగింది. పోలీసులు, కుటుంబ సభ్యుల కథనం ప్రకారం ఆంధ్రప్రదేశ్(AP) లోని కందుకూరు మండలం ముప్పల గ్రామానికి చెందిన రాంబాబుతో ప్రశాంతి (22)కి వివాహం ఏడాదిన్నర కిందట జరిగింది. ఐదు నెలల పాప ఉంది. రాంబాబు వృత్తి రీత్యా మేస్త్రీగా పని చేస్తున్నాడు.
గొంతు నులిమి హత్య
నెల రోజుల కిందట మేడ్చల్ పట్టణంలోని కేఎల్ఆర్-ఎన్‌జేఆర్ నగర్‌లో అద్దెకు ఉంటున్నారు. పెళ్లి అయిన నాటి నుంచి రాంబాబుకు ప్రశాంతిని అనుమానంతో వేధిస్తున్నాడు. ఈ విషయమై తరుచుగా ఇరువురి మధ్య గొడవలు జరుగుతుండేవి. కుటుంబ పెద్దలు ఇరువురికి నచ్చచెబుతూ వచ్చారు. పాప పుట్టిన తర్వాత అయినా రాంబాబు(Rambabu) మారకపోతాడా? అని భావించారు. అయితే అతడిలో ఏమాత్రం మార్పు రాలేదు. ఈ క్రమంలో గురువారం రాత్రి కూడా ఇరువురి మధ్య గొడవ జరిగి, రాంబాబు భర్తను గొంతు నులిమి హత్య చేశాడు. చనిపోయిందని నిర్ధారించు కున్నాక ఐదు నెలల పాపను అక్కడే వదిలేసి పారిపోయాడు. ఉదయం బంధువులు రాంబాబుకి ఫోన్ చేయగా ఫోన్ స్విఛాప్ వచ్చింది. దీంతో వారు ఇంటికి వచ్చి చూసేసరికి ప్రశాంతి మృతి చెంది నేలపై పడి ఉంది. ఐదు నెలల పాప పక్కన ఏడుస్తూ కనిపించింది. వెంటనే వారు పోలీసులకు సమాచారం అందించారు.
Also Read: Illegal Bike Taxi: మంత్రి స్టింగ్ ఆపరేషన్.. సామాన్యుడిలా మారి.. బైక్ ట్యాక్సీల గుట్టురట్టు!
హత్యగా నిర్ధారణ
అనుమానాస్పద స్థితిలో ప్రశాంతి అనే మహిళ మృతి చెందిన సమాచారం అందుకున్న ఏసీపీ శంకర్ రెడ్డి, ఎస్‌ఐలతో కలిసి ఘటనా స్థలాన్ని సందర్శించాడు. అక్కడి పరిస్థితులను పరిశీలించి, ప్రశాంతి భర్త రాంబాబు హత్య చేసినట్టు నిర్ధారించారు. ఇరువురి మధ్య జరిగిన ఘర్షణ జరిగి, ప్రశాంతిని భర్త గొంతు నులిమి హత్య చేసినట్టు తేల్చారు. ఈ సందర్భంగా ఏసీపీ శంకర్ రెడ్డి(ACP Shanka Reddy) మాట్లాడుతూ కేఎల్‌ఆర్-ఎన్‌జేఆర్‌నగర్‌లో వివాహిత అనుమానాస్పద స్థితిలో మృతి చెందినట్టు వచ్చిన సమాచారంతో ఘటనా స్థలాన్ని సందర్శించామన్నారు. అక్కడి పరిస్థితులను పరిశీలిస్తే గురువారం ఇరువురు గొడవ జరిగినట్టు తెలుస్తున్నన్నారు. భార్య గొంతుపైన ఉన్న గుర్తులను బట్టి భర్త గొంతు నులిమి చంపినట్టు భావిస్తున్నామన్నారు. క్లూస్ టీం ద్వారా ఆధారాలను సేకరించామని తెలిపారు.
అనుమానంతోనే హత్య చేశాడు
ఏడాదిన్నర కిందట ప్రశాంతిని రాంబాబుకు ఇచ్చి వివాహం చేశామని, అప్పటి నుంచే అనుమానాంతో వేధిస్తున్నాడని ప్రశాంతి తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు. అనుమానంతో తరుచుగా మా కూతురుతో రాంబాబు గొడవపడే వారన్నారు. పాప పుట్టాక మారుతాడని కాపురానికి పంపించామన్నారు. మా బిడ్డకు భర్త అంటే ఎనలేని అభిమానమని, అది కూడా గుర్తించకుండా హత్య చేశాడని రోదిస్తూ చెప్పారు. మా మనువరాలికి తల్లిని లేకుండా చేశాడని, ఐదు నెలల పాప పరిస్థితి ఏంటని ఆవేదన వ్యక్తం చేశారు.
Also Read: Sigachi Blast: సిగాచి పేలుడు వేదన.. కడసారి చూపు దక్కక మృతుల కుటుంబాల కంటనీరు!