స్వేఛ్చ జోగిపేటః Sangareddy Crime: కేబుల్ వైర్లను దొంగిలించడానికి వెళిన్ల జోగిపేట పట్టణానికి చెందిన చిత్తారి సంగమేశ్ (30) అనే వ్యక్తి మృత్యువాత పడ్డ సంఘటన సంగారెడ్డి జిల్లా అందోలు శివారులో శనివారం రాత్రి జరిగింది. కొక్కొండ జగదీశ్ అనే రైతు తన వరి పొలానికి నీరు పారబెట్టడానికి ఆదివారం ఉదయం పొలం వద్దకు రాగా బోరు వద్ద కరెంటు సరఫరా లేకపోవడం, కేబుల్‌ను ఎవరో ఎత్తుకెళ్లారని గుర్తించి వెళుతుండగా రమేశ్ కౌలుకు తీసుకున్న భూమి దగ్గర కరెంటు బోర్డు వద్ద పడి ఉన్న యువకుడి మృతదేహన్ని చూసి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.
Also read: The Suspect: క్షణం చూపు తిప్పుకోనివ్వని క్రైమ్ థ్రిల్లర్ రిలీజ్‌కు రెడీ!
సీఐ అనీల్‌కుమార్, ఏఎస్‌ఐ గౌస్ పోలీసు సిబ్బందితో వచ్చి మృతదేహాన్ని పరిశీలించగా కూలీ పనిచేసుకొని జీవించే వాడని గుర్తించారు. బోరు వద్ద గల ప్యానెల్ బోర్డు స్విచ్ తీసేసి కేబుల్‌వైరును కటింగ్ ప్లేర్‌తో కట్ చేయగా మెడకు కరెంట్‌షాక్ తగలడంతో తల కొద్ది భాగం తెగిపోవడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. పొలంలో దొంగిలించిన కేబుల్ వైరు సంచి సంగమేష్ మృతదేహం ప్రక్కనే ఉంది. దీనిని బట్టి చోరీకి వచ్చి కరెంట్ షాక్ తో మృతి చెందినట్లు పోలీసులు భావిస్తున్నారు. మృతదేహాన్ని జోగిపేట ఆసుపత్రికి పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు జరుపుతున్నారు. దర్యాప్తులో అసలు విషయం వెల్లడి కావాల్సి ఉంది.