The Suspect Movie
ఎంటర్‌టైన్మెంట్

The Suspect: క్షణం చూపు తిప్పుకోనివ్వని క్రైమ్ థ్రిల్లర్ రిలీజ్‌కు రెడీ!

The Suspect: క్రైమ్ థ్రిల్లర్ చిత్రాలకు ప్రత్యేకంగా అభిమానులుంటారు. వారు కొంచెం ఎంగేజ్ చేయగలిగితే చాలు.. సినిమాను ఎక్కడో పెట్టేస్తారు. బిగి సడలకుండా, చివరి వరకు థ్రిల్ చేస్తే, ఈ జోనర్‌లో గుర్తింపు తెచ్చుకోవడం చాలా ఈజీ. కాకపోతే ఈ మధ్య ఓటీటీలు వచ్చిన తర్వాత ఈ తరహా చిత్రాలు బోలెడన్ని లభించడంతో, ఇప్పుడీ జోనర్‌లో ప్రేక్షకులను మెప్పించడం అంత ఈజీ కానే కాదు. అయినా సరే, క్షణం చూపు తిప్పుకోనివ్వని విధంగా మా క్రైమ్ థ్రిల్లర్ చిత్రం ఉంటుందని అంటున్నారు ‘ది సస్పెక్ట్’ చిత్రయూనిట్.

Also Read- Vishnu Manchu: ‘కన్నప్ప’ స్వగ్రామంలో విష్ణు మంచు.. మ్యాటర్ ఏంటంటే?

రుషి కిరణ్, శ్వేత, రూప, శివ యాదవ్, రజిత, ఏకెఎన్ ప్రసాద్, మృణాల్ తదితరులు ప్రధాన పాత్రలలో నటించిన చిత్రం ‘ది సస్పెక్ట్’. మార్చి 21న విడుదలకు సిద్ధమైన ఈ క్రైమ్ థ్రిల్లర్ చిత్రం సెన్సార్ పూర్తి చేసుకుని, పూర్తి స్థాయిలో రిలీజ్‌కు రెడీ అయింది. టెంపుల్ టౌన్ టాకీస్ బ్యానర్‌పై రాధాకృష్ణ గర్నెపూడి (Radhakrishna Garnepudi) దర్శకత్వంలో కిరణ్ కుమార్ నిర్మించారు. ఈ సినిమాను ఎప్పుడెప్పుడు ప్రేక్షకులకు చూపించాలా? అని ఎంతో ఎగ్జయిటెడ్‌గా ఉంది చిత్ర టీమ్. ఎందుకంటే, సినిమాపై మాకున్న నమ్మకమిదని అంటున్నారు. సినిమా సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధమైన సందర్భంగా టీమ్ మీడియాకు చిత్ర విశేషాలను తెలిపారు.

ఈ సందర్భంగా దర్శకనిర్మాతలు మాట్లాడుతూ.. క్రైమ్ థ్రిల్లర్‌గా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ‘ది సస్పెక్ట్’ చిత్రం ఇప్పటి వరకు ప్రేక్షకులు చూడని సరికొత్త కోణంలో ఉంటుంది. ఇది ఒక హత్య చుట్టూ జరిగే కథ.. అయినా కేసు పరిశోధన మాత్రం చాలా థ్రిల్లింగ్‌గా ఉంటుంది. కచ్చితంగా ప్రేక్షకులు ఆ ఫీల్‌ని అనుభవిస్తున్నారు. క్షణం చూపు తిప్పుకోనివ్వని కథనం ఈ సినిమాలో చూస్తారు. రాఘవేంద్ర కెమెరా పనితనం, ప్రజ్వల్ క్రిష్ మ్యూజిక్, ప్రవీణ్ ఎడిటింగ్ హైలెట్స్‌గా ఉంటాయి. ఇతర సాంకేతిక నిపుణులు కూడా మంచి ఎఫర్ట్ పెట్టారు. ఇటీవల విడుదలైన ట్రైలర్ ట్రెమండస్ రెస్పాన్స్‌ను రాబట్టుకుంది.

ఇందులో నటించిన వారంతా ఎంతో సపోర్ట్‌ను అందించారు. ప్రతి ఒక్కరూ సినిమా కోసం ప్రాణం పెట్టేశారు. వారి కష్టం రేపు విడుదల తర్వాత అందరికీ తెలుస్తుంది. అందరికీ మంచి పేరు వస్తుందని భావిస్తున్నాం. ఒక బర్నింగ్ టాపిక్‌పై డిస్కషన్ నడుస్తూనే, అందరినీ అలెర్ట్ చేసే సినిమా ఇది. ట్రైలర్ ఎలా అయితే అందరికీ నచ్చిందో.. సినిమా కూడా తప్పకుండా ప్రేక్షకులను మెప్పిస్తుందని నమ్ముతున్నాం. ప్రేక్షకులు థియేటర్లలో ఈ సినిమాను చూడాలని కోరుతున్నామని అన్నారు. ఈ చిత్రం ఎస్‌కె‌ఎమ్‌ఎల్ మోషన్ పిక్చర్స్ ద్వారా ఆంధ్ర, తెలంగాణలో గ్రాండ్‌గా విడుదల కాబోతుంది.

ఇవి కూడా చదవండి:

David Warner: బౌండరీ టు బాక్సాఫీస్.. గంగి రెడ్డి ఎట్టున్నది వార్నర్ మామ లుక్!

Devi Sri Prasad: ఎక్కడ వాయించాలో, ఎక్కడ వాయించకూడదో తెలిసినవాడే నిజమైన మ్యూజిక్ డైరెక్టర్

Just In

01

Balapur Laddu Auction 2025: బాలాపూర్ లడ్డు సరికొత్త రికార్డ్.. ఈసారి ఎన్ని రూ.లక్షలు పలికిందంటే?

Pending Bills: పెండింగ్‌లో అద్దెవాహన బిల్లులు.. ఖజానా కోసం ఎంపీడీవోల చూపులు

Sensational Cases: రాష్ట్రంలో సంచలన కేసులు.. నత్తనడకగా విచారణ.. ఇది దేనికి సంకేతం..?

Turakapalem Village: ఎవరూ వంట చేసుకోవద్దు.. కనీసం నీళ్లూ తాగొద్దు.. ప్రభుత్వం ఆదేశాలు

Ponguleti Srinivasa Reddy: త్వరలో సాదాబైనామాలకు మోక్షం.. మంత్రి కీలక వ్యాఖ్యలు