Devi Sri Prasad (Image Source: Raw Talks With VK Youtube Video)
ఎంటర్‌టైన్మెంట్

Devi Sri Prasad: ఎక్కడ వాయించాలో, ఎక్కడ వాయించకూడదో తెలిసినవాడే నిజమైన మ్యూజిక్ డైరెక్టర్

Devi Sri Prasad: దేవిశ్రీ ప్రసాద్.. ఇట్స్ ఏ బ్రాండ్. ఈ రాక్‌స్టార్ సినిమా ఓకే చేశాడంటే చాలు.. ఆ సినిమా 50 శాతం సక్సెస్ అని ఫిక్స్ అయిపోవచ్చు. ఎందుకంటే, సినిమా టీమ్‌తో పాటు ట్రావెల్ చేస్తూ, తన సలహాలు, సూచనలు ఆ టీమ్‌కి ఇస్తూ ఉంటారు. ఆయన ఓకే చేసినప్పటి నుంచి విడుదలయ్యే వరకు, ఆ సినిమా టీమ్‌తో దేవి చేసే జర్నీ, సినిమాకు సగం సక్సెస్‌ని ఇస్తుంది. దేవి శ్రీ ప్రసాద్ నమ్మినా, దేవి శ్రీ ప్రసాద్‌ని నమ్మినా.. ఆ యా సినిమాలు బాక్సాఫీస్ వద్ద దుమ్మురేపాయి. అంత డెడికేషన్ ఉంటుంది దేవికి. అంతేకానీ, ఏది పడితే అది, ఎలా పడితే అలా చేసే టైప్ పర్సన్ కానే కాదు దేవి. అందుకే ఎప్పుడూ బిజీగా ఉంటాడీ రాక్ స్టార్. అలాంటి దేవి, సినిమా ప్రమోషన్స్‌కి తప్పితే.. పెద్దగా ఇతర కార్యక్రమాలలో కనిపించడు. కానీ ఇప్పుడో పాడ్ కాస్ట్ ఇంటర్వ్యూలో పాల్గొని, అనేక విషయాలను షేర్ చేసుకున్నారు. నిజంగా ఇంత టైమ్‌ని సదరు పాడ్ కాస్ట్ వారికి ఇవ్వడం, చాలా గొప్ప గొప్ప విషయాలు చెప్పడమనేది.. బహుశా ఇదే ఫస్ట్ టైమ్ అనుకుంటా. సుమారు 2 గంటల సమయం ఉన్న ఈ పాడ్ కాస్ట్ వీడియోలో.. మొత్తం అంటే కష్టం కానీ, మెయిన్ పాయింట్స్ ఏంటో చూద్దాం.

Also Read- David Warner: బౌండరీ టు బాక్సాఫీస్.. గంగి రెడ్డి ఎట్టున్నది వార్నర్ మామ లుక్!

కాజల్ (పక్కా లోకల్), సమంత (ఊ అంటావా మావ), తమన్నా (స్వింగ్ జర), పూజా హెగ్డే (జిగేల్ రాణి), శ్రీలీల (కిస్సిక్) వంటి వారు తారలంతా నటీమణులుగా టాప్ ప్లేస్‌లో ఉన్నప్పుడు స్పెషల్ సాంగ్ చేశారు. వాళ్ల ఫస్ట్ స్టెప్ ఇది. ఆ పాట కనుక వర్కవుట్ కాకపోతే చాలా కష్టం. అలాంటప్పుడు ఎక్కువ ప్రెజర్ మీపైనే కదా ఉంటుందీ అంటే.. ‘వాళ్లకి పాట మీద నమ్మకం మాత్రమే కాదు.. వీళ్లంతా కూడా పాట విన్న తర్వాతే స్పెషల్ సాంగ్ చేయడానికి ఒప్పుకున్నారు. సమంత కూడా పాట విన్న తర్వాతే ఓకే చేశారు. క్రెడిట్ మొత్తం పాటకే చెందుతుంది. పాట వాళ్లకి నచ్చింది కాబట్టే కదా చేశారు. కానీ, టాప్ హీరోయిన్లు అందరూ నా పాటతోనే స్పెషల్ సాంగ్ చేశారనే గొప్ప ఫీలింగ్ నాకుంది. దీనిని ఎప్పుడూ చాలా గౌరవంగా చూస్తాను’’ అని దేవి శ్రీ సమాధానమిచ్చారు. ఇంకా ఈ రాక్ స్టార్ ఏం చెప్పుకొచ్చారంటే..

‘ఉప్పెన’ సినిమాకు ‘నీ కళ్లు నీలి సముద్రం’ పాట చేసిన తర్వాత సుకుమార్‌కి వినిపిస్తే.. బుచ్చి తన అసిస్టెంట్ కాబట్టి ఆ పాటను ఇచ్చాను.. లేదంటే అది నా సినిమాకు వాడేసుకునేవాడిని అని అన్నారు. అదొక బెస్ట్ కాంప్లిమెంట్ నాకు.

మ్యూజిక్ డైరెక్టర్ ఎప్పుడూ.. కథని ఒక ఆడియన్‌లా వినాలి.. మ్యూజిక్‌ని ఒక స్టోరీ రైటర్‌లా ఆలోచించాలి. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌ని ఓ డైరెక్టర్‌లా ఆలోచించాలి.

గంగమ్మ తల్లి పాటకు 1 మినిట్ మ్యూజిక్ చాలన్నారు. కానీ ఫుల్ సాంగ్ చేసేశాం. బోస్, సుక్కు గార్లతో కూర్చుంటే పాథ్ బ్రేకింగ్ సాంగ్స్ వాటంతట అవే పుట్టుకొస్తాయి. నా ఇమాజినేషన్‌కు సుక్కు భాయ్ చాలా వేల్యూ ఇస్తారు.

మనం చేసే, వినే పాటని చైల్డ్‌లా ఊహించుకోవాలి. చైల్డ్‌గా ఎంజాయ్ చేయగలిగితే చాలు. పెద్ద వాడిలా ఆలోచన చేయాల్సిన అవసరం లేదు. నాలోని చైల్డ్ బిహేవియర్ పాట విని యస్ అన్నాడంటే.. లోకంలోని పెద్దలందరితో ఫైట్ చేసేస్తా.

90 పర్సెంట్ బిజీఎమ్ కంటే ఒక సినిమాకు 10 పెర్సెంట్ ఉండే సైలెంట్ చాలా ఇంపార్టెంట్. అదే సినిమాను డిసైడ్ చేస్తుంది. ఎక్కడ వాయించాలో, ఎక్కడ వాయించకూడదో తెలిసినవాడే నిజమైన మ్యూజిక్ డైరెక్టర్.

బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ ఒక్కోసారి సినిమాను ఎక్కడికో తీసుకెళ్లవచ్చు.. ఒక్కోసారి నాశనం కూడా చేయవచ్చు. ఒక సీన్‌కి దానికి సరిపడా మ్యూజిక్, ఎలివేట్ చేసే మ్యూజిక్ వాయిస్తే వచ్చే పవరే వేరు.

బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌‌కి మకుటం లేని మహారాజు అంటే ఇళయరాజాగారే.

మా నాన్నగారు మా చిన్నప్పుడు పేపరులో నిత్యసత్యాలు అని వచ్చే కాలమ్‌ని కట్ చేయించి, అందులో ఏం రాసి ఉందో చదివించి, అతికించమనేవారు. అలా నాకు గుర్తున్నదే ‘కాలు తడవకుండా సముద్రాన్ని దాటే మేధావి అయినా.. కళ్లు తడవకుండా జీవితాన్ని దాటలేడు’.

కాపీ వేరు.. ఇన్స్‌పిరేషన్ వేరు.. ఒక మాటని కూడా ఇన్స్‌పిరేషన్‌గా తీసుకోవచ్చు… ఇలా ఎన్నో విషయాలను దేవిశ్రీ ఈ ఇంటర్వ్యూలో తెలిపారు.

ఇవి కూడా చదవండి:

Prakash Raj: మరోసారి పవన్ కళ్యాణ్‌ని ప్రశ్నించిన ప్రకాష్ రాజ్.. నెటిజన్ల రియాక్షన్ చూశారా!

Manyam Dheerudu OTT: ఓటీటీలోకి వచ్చేసిన సీతారామరాజు.. ఎందులో అంటే?

Just In

01

Minister Sridhar Babu: పరిశ్రమల ఏర్పాటుకు ఇక్కడ అన్నీ అనుకూలమే!

CBI Director Praveen Sood: హైదరాబాద్ వచ్చిన సీబీఐ డైరెక్టర్ ప్రవీణ్​ సూద్.. అందుకోసమేనా..?

Jajula Surender: సమీక్షలు కాదు సత్వర చర్యలు చేయండి: జాజుల సురేందర్

KTR: రాబోయే ఆరు నెలల్లో ఉప ఎన్నికలు ఖాయం.. కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు

Expand Dog Squad: రాష్ట్రంలో నేరాలను తగ్గించేందుకు పోలీసులు సంచలన నిర్ణయం..?