David Warner
ఎంటర్‌టైన్మెంట్

David Warner: బౌండరీ టు బాక్సాఫీస్.. గంగి రెడ్డి ఎట్టున్నది వార్నర్ మామ లుక్!

David Warner: క్రికెట్ అభిమానులకు, అందునా ఇండియన్ క్రికెట్ అభిమానులకు వార్నర్, విలియమ్సన్ అంటే ఎంత ఇష్టమో, ఎంత అభిమానమో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఐపీఎల్ ద్వారా వీరు తెలుగు క్రీడాభిమానులకు మరింత దగ్గరయ్యారు. ఎంతగా అంటే, సొంత వాళ్లని పిలిచినట్లుగా ‘మామ’ అని ఎంతో ఆప్యాయంగా వారిని పిలుచుకుంటూ ఉంటారు. వీరిలో కేన్ మామ కాస్త మొహమాట పడుతుంటాడు కానీ, వార్నర్ మాత్రం క్రికెట్‌తోనే కాకుండా, ఇండియన్ సినిమా హీరోలను ఇమిటేట్ చేస్తూ, ఎప్పుడూ ట్రెండ్ అవుతూ ఉంటారు. ఆ విషయం తెలియంది కాదు. వార్నర్ ది ఆస్ట్రేలియా అయినప్పటికీ, తెలుగు సినిమా హీరోల డైలాగ్స్ చెబుతూ, డ్యాన్స్‌లు చేస్తూ రచ్చ రచ్చ చేస్తుంటారు. ఆయనొక్కడే కాదు, ఫ్యామిలీ ఫ్యామిలీ కూడా అదే టైపు. అందుకే ఇండియన్ క్రీడాభిమానులకు వార్నర్ చాలా స్పెషల్‌గా మారిపోయాడు. అలాగే, క్రికెట్ కాకుండా ఆయనని పాపులర్ చేసిన సౌత్ సినీ ఇండస్ట్రీ అంటే వార్నర్ కూడా ఎనలేని అభిమానం ఉంది.

Also Read- Manyam Dheerudu OTT: ఓటీటీలోకి వచ్చేసిన సీతారామరాజు.. ఎందులో అంటే?

ఆ అభిమానంతోనే క్రికెట్ తర్వాత ఏంటి? అని ఆలోచించకుండా యాక్టింగ్‌లోకి దిగిపోయారు. ఆల్రెడీ దర్శకధీరుడు రాజమౌళితో కలిసి ఓ యాడ్‌లో నటించిన వార్నర్.. ఇప్పుడు అఫీషియల్‌గా యాక్టింగ్‌లోకి దిగుతున్నారు. అదీ కూడా ఒక తెలుగు చిత్రంతో ఆయన నటుడిగా పరిచయం అవుతుండటం విశేషం. నితిన్ (Nithiin), శ్రీలీల (Sreeleela) జంటగా.. వెంకీ కుడుముల దర్శకత్వంలో రూపుదిద్దుకుంటోన్న చిత్రం ‘రాబిన్‌హుడ్’ (Robinhood). ఈ సినిమాలో ఈ ఆస్ట్రేలియా డైనమిక్ క్రికెటర్ డేవిడ్ వార్నర్ ఒక ప్రత్యేక అతిధి పాత్రలో కనిపించబోతున్నట్లుగా కొన్ని రోజులుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఇటీవల ఓ వేదికపై ఈ సినిమాను నిర్మిస్తున్న మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాత రవి, ఈ సినిమాలో వార్నర్ నటిస్తున్నట్లుగా చెప్పేశారు. అంతే, అప్పటి నుంచి వార్నర్‌పై వార్తలు వైరల్ అవుతూనే ఉన్నాయి.

మార్చి 28న విడుదలకు సిద్ధమైన ఈ చిత్ర ప్రమోషన్స్‌ని మేకర్స్ ప్రస్తుతం యమా జోరుగా నిర్వహిస్తున్నారు. ప్రమోషన్స్‌లో భాగంగా యూనిట్ ఏపీ టూర్‌లో ఉంది. మరోవైపు వార్నర్ కూడా ప్రమోషన్స్‌కి వస్తారా? అంటూ నెటిజన్లు కొందరు నిర్మాణ సంస్థకు ప్రశ్నలు సంధిస్తున్నారు. మరి వార్నర్ వస్తాడో, లేదో తెలియదు కానీ, ఆయన ఫస్ట్ లుక్‌ని వదలి ప్రమోషన్స్‌లో మరింత ఊపు తెప్పించారు మేకర్స్. ఈ ఫస్ట్ లుక్ చూసిన నెటిజన్లు.. ‘ఆది’ సినిమా డైలాగ్‌తో అల్లరల్లరి చేస్తున్నారు.

‘గంగి రెడ్డి.. ఎట్టున్నడు వార్నర్ మామ?’ అంటూ నెటిజన్లు మేకర్స్ వదిలిన ఫస్ట్ లుక్‌ని వైరల్ చేస్తున్నారు. ఈ ఫస్ట్ లుక్‌లో వార్నర్‌ని గమనిస్తే.. ట్రెండీ డ్రస్‌లో ఫుల్ స్వాగ్‌లో కనిపిస్తున్నారు. ముఖంపై చిరునవ్వు‌తో పాటు కూల్ ఎక్స్‌ప్రెషన్స్ ఇస్తుంటే.. స్పాట్‌లైట్ ఆయన ముఖాన్ని మరింత హైలెట్ చేస్తుంది. ఇందులో వార్నర్ చేసేది అతిథి పాత్రే అయినప్పటికీ సినిమాపై భారీగా ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుందని మేకర్స్ చెబుతున్నారు. ఈ సినిమా తర్వాత ఆయన బిజీ నటుడిగా మారిన ఆశ్చర్యపోనవసరం లేదనేలా అప్పుడే టాక్ మొదలైంది. త్వరలోనే ఈ చిత్ర థియేట్రికల్ ట్రైలర్‌ని మేకర్స్ విడుదల చేయనున్నారు. అందులో వార్నర్‌కు కూడా స్పేస్ ఉంటుందని తెలుస్తుంది.

ఇవి కూడా చదవండి:

Sivaji: ‘యానిమల్’లోని బాబీ డియోల్ కంటే బాగా చేశానని రాశారు.. చాలా హ్యాపీగా ఉంది

Prakash Raj: మరోసారి పవన్ కళ్యాణ్‌ని ప్రశ్నించిన ప్రకాష్ రాజ్.. నెటిజన్ల రియాక్షన్ చూశారా!

Just In

01

Harish Rao: పాలకులే నెగిటివ్ మైండ్ సెట్.. అభివృద్ధి ఎలా సాధ్యం..?

Ashish Warang death: ప్రముఖ నటుడు కన్నుమూత.. సోకసంద్రంలో ఇండస్ట్రీ

Telangana politics: బీజేపీలో బిగ్ డిస్కషన్.. ఆపరేషన్ ఆకర్ష్ కవిత వర్తిస్తుందా..?

Minister Sridhar Babu: పరిశ్రమల ఏర్పాటుకు ఇక్కడ అన్నీ అనుకూలమే!

CBI Director Praveen Sood: హైదరాబాద్ వచ్చిన సీబీఐ డైరెక్టర్ ప్రవీణ్​ సూద్.. అందుకోసమేనా..?