Prakash Raj: జస్ట్ ఆస్కింగ్ అంటూ.. ప్రకాష్ రాజ్ సోషల్ మీడియా ఎక్స్‌లో ఎటువంటి పోస్ట్‌లు చేస్తుంటారో తెలియంది కాదు. ముఖ్యంగా దేశ ప్రధాని మోడీ చేసే పనులను, అలాగే ఏపీ డిప్యూటీ సీఎం మాట్లాడే మాటలను ఆయన ఎక్కువగా టార్గెట్ చేస్తుంటారు. ఇక ప్రపంచంలో ఏం జరిగినా తనకేం పట్టనట్లుగా కేవలం ఒక్క బీజేపీ నాయకులను, పవన్ కళ్యాణ్‌ను మాత్రమే ఆయన ప్రశ్నిస్తుంటారు. ఇప్పుడు కూడా పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) తన పార్టీ జనసేన 12వ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని పిఠాపురం శివారులోని చిత్రాడలో నిర్వహించిన జనసేన జయకేతన సభలో మాట్లాడిన మాటలను ప్రశ్నిస్తూ.. ప్రకాశ్ రాజ్ ఓ పోస్ట్ చేశారు.
మీ హిందీ భాషను మా మీద రుద్దకండి, అని చెప్పడం ఇంకో భాషను ద్వేషించడం కాదు, ‘‘స్వాభిమానంతో మా మాతృభాషను, మా తల్లిని కాపాడుకోవడం’’, అని పవన్ కళ్యాణ్ గారికి ఎవరైనా చెప్పండి ప్లీజ్’’ అంటూ ప్రకాష్ రాజ్ తన పోస్ట్‌లో పేర్కొన్నారు. అసలు పవన్ కళ్యాణ్ ఏమన్నారంటే.. వేరు వేరు రాష్ట్రాల నుంచి వచ్చిన అభిమానులకు వారి భాషలలోనే పవన్ కళ్యాణ్ స్వాగతం పలికారు. అనంతరం.. ‘తమిళనాడుతో సహా భారతదేశానికి కావాల్సింది బహు భాషా విధానం. కేవలం రెండు భాషలే కాదు. దేశ ఇంటిగ్రిటి కోసమే కాదు.. ఒకరినొకరు అర్థం చేసుకోవడానికి, ఒకరినొకరం ప్రేమను పంచుకోవడానికి. అందుకే బహుభాషా విధానమే భారతదేశానికి మంచిది’ అని అన్నారు.
Also Read- Chiranjeevi: ఎమ్మెల్సీ నాగబాబుకు అన్నయ్య చిరు దిశా నిర్దేశం!
ప్రస్తుతం తమిళనాడు ప్రభుత్వం హిందీ భాషను వ్యతిరేకిస్తూ ఓ ఉద్యమాన్ని నడుపుతున్న విషయం తెలిసిందే. హిందీలో బోర్డులను సైతం తొలగిస్తూ, రూపాయి సింబల్‌ను కూడా మార్చేశారు. దీనిని ఉద్దేశించే పవన్ కళ్యాణ్ మాట్లాడారని భావిస్తూ, ప్రకాశ్ రాజ్ తన ఎక్స్‌లో పోస్ట్ చేశారు. దీనికి నెటిజన్లు ప్రకాశ్ రాజ్‌కు ఇచ్చిపడేస్తున్నారు. ఒక్కసారి నెటిజన్ల కామెంట్స్ పరిశీలిస్తే..
“మీ హిందీ భాషను మా మీద రుద్దకండి”, అని చెప్పడం ఇంకో భాషను ద్వేషించడం కాదు, “ స్వాభిమానంతో మా మాతృభాషను, మా తల్లిని కాపాడుకోవడం”, అని పవన్ కళ్యాణ్ గారికి ఎవరైనా చెప్పండి please… 🙏🏿🙏🏿🙏🏿 #justasking
— Prakash Raj (@prakashraaj) March 14, 2025
‘‘హిందీ భాషను మా మీద రుద్దకండి అన్నప్పుడు బోర్డుల ఫ్లెక్సీల మీద ఉన్న హిందీ చెరిపేసినట్టు.. కరెన్సీ నోటు మీద హిందీ అక్షరాలు ఉన్నాయి కాబట్టి కరెన్సీ కూడా వాడడం మానేయండి రా ఎర్రి ప్రకాశం’’
‘‘ఇతర భాషలు నేర్చుకోవడం అంటే మాతృభాషను చంపుకోవడం కాదు.. ఇప్పుడు తంబీలు అమెరికా వెళ్లి నేను తమిళ్‌లోనే మాట్లాడతా.. నీకు దిక్కున్న చోట చెప్పుకో అని అనలేరు కదా. ఆయన చెప్పింది దేశానికి అన్ని భాషలు కావాలి. అన్నీ మా మాతృభాషలోనే ఉండాలి అనే పట్టుదల ఉండకూడదు అని.. hope you understand’’
‘‘ఒకవేళ తమిళంని జాతీయ భాష చేసి ఉంటే.. అప్పుడు ఇతర రాష్ట్రాలు తమిళ భాషని జాతీయ భాషగా ఒప్పుకోకుండా అవమానిస్తే! అప్పుడేమంటారు. స్వాభిమానం ఉండొచ్చు.. ఉండకూడదు అని ఎవరూ చెప్పలేదు. కానీ మీ హిందీ భాష.. మా తమిళ భాష అని వేరు చేయకూడదు కదా. ఒక దేశ జాతీయ భాషను ఇలా చెయ్యడం కరెక్టా?’’
‘‘హిందీనే మాట్లాడాలి అని ఎవరు అనలేదు. ఒక యునైటెడ్ లాంగ్వేజ్ వల్ల బెనిఫిట్స్ ఉంటాయ్. మన దేశ భాష కాని ఇంగ్లీష్‌తో మీకు ప్రాబ్లం లేదు అక్కడ స్వాభిమానం అడ్డు రాదు.. మా రాష్ట్రంలో కన్నడనే మాట్లాడాలి అని గొడవ చేస్తున్నారుగా. అలా ఇండియాలో హిందీనే మాట్లాడాలి అని అంటే అప్పుడు పోరాడదాం’’
‘‘నువ్వు ఎందుకు హిందీ సినిమాలు చేస్తున్నావ్.. రూపాయ సింబల్ ఎందుకు మార్చారు. దానిని తయారు చేసిందే ఒక తమిళ్ వ్యక్తి.. ఈ పిచ్చి ప్రకాశానికి ఎవడన్నా చెప్పండి..’’
‘‘హిందీనీ ఎవరు రుద్ద లేదు. అందులోనూ నీ దగ్గర సూక్తులు వినడం ఇంకా హాస్యాస్పదం. ఇప్పుడు తమిళ్ వాళ్లు చేస్తున్నది ఏంటి? అక్కడ ఉన్న తెలుగు వాళ్ళని, కన్నడ వాళ్ళని కూడా వాళ్లు అణగతొక్కాలి అని చూస్తున్నారు. నువ్వు మేధావివి కదా.. కర్ణాటక తమిళనాడుల మధ్య ఉన్న నీటి గొడవను, నీ భాష గొడవను తీర్చు మరి’’
‘‘ఎవరు రుద్దుతున్నారు నాయనా, హిందీ సినిమాలో యాక్టింగ్ చేసి డబ్బులు బాగా మింగినవ్ గదా, అవి వాపసు ఇస్తావా? ప్రతి రాష్ట్రంలో మాతృ భాషకు ఒక పాఠ్య పుస్తకం ఉంటుంది, దానిని ఎవరు తీసేయట్లేదు, 3వ భాషను హిందీ భాషకు కేటాయించండి అని అంటున్నారు. నేర్చుకునే వారు నేర్చుకుంటారు. నీకేం నొప్పి’’
ఇవి కూడా చదవండి:
Jr NTR: తారక్‌లోని ఈ టాలెంట్ మీకు తెలుసా? రానా కళ్లల్లో నీళ్లు!