Nagababu and Chiranjeevi
ఎంటర్‌టైన్మెంట్

Chiranjeevi: ఎమ్మెల్సీ నాగబాబుకు అన్నయ్య చిరు దిశా నిర్దేశం!

Megastar Chiranjeevi: ఎమ్మెల్సీగా ఎన్నికై ఆంధ్రప్రదేశ్ శాసనమండలిలో తొలిసారి అడుగుపెట్టబోతున్న నా తమ్ముడు నాగేంద్రబాబుకు అభినందనలు అని మెగాస్టార్ చిరంజీవి ట్విట్టర్ ఎక్స్ వేదికగా శుభాకాంక్షలు తెలియజేశారు. ఆంధ్రప్రదేశ్ ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో జనసేన పార్టీ (Jana Sena Party) నుంచి బరిలోకి దిగిన కొణిదల నాగబాబు (Nagababu Konidela) ఏకగ్రీవంగా ఎన్నికైన విషయం తెలిసిందే. ఉగాది అనంతరం నాగబాబును మంత్రి వర్గంలోకి సైతం తీసుకునేందుకు ఏపీ సీఎం చంద్రబాబు (AP CM Chandrababu Naidu), డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ (Deputy CM Pawan Kalyan) సన్నాహాలు చేస్తున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో చిరంజీవి ట్వీట్ మరింత ఆసక్తికరంగా మారింది.

‘‘ఎమ్మెల్సీ‌గా ఎన్నికయి ఆంధ్రప్రదేశ్ శాసనమండలిలో తొలిసారి అడుగు పెట్టబోతున్న నా తమ్ముడు నాగేంద్రబాబుకి నా అభినందనలు, ఆశీస్సులు. ప్రజా సమస్యల మీద గళం విప్పుతూ, వారి అభివృద్ధికి ఎల్లప్పుడూ పాటుపడేలా నువ్వు చేసే కృషిలో ఎప్పుడూ విజయం సాధించాలని, వారి అభిమానాన్ని మరింతగా చూరగొనాలని ఆశిస్తూ నీకు నా శుభాకాంక్షలు!’’ అని మెగాస్టార్ చిరంజీవి తన ట్వీట్‌లో పేర్కొన్నారు.

Also Read- Megastar Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవికి మరో అరుదైన గౌరవం

మరి మెగాస్టార్ చిరంజీవి నుంచి శుభాకాంక్షలు వచ్చాయంటే కచ్చితంగా మంత్రి బెర్త్ కన్ఫర్మ్ అయినట్లే భావించాలి. ఎందుకు కన్ఫర్మ్ అనాల్సి వచ్చిందంటే.. ఇంకా కొంతమంది నాగబాబుకు మంత్రి పదవి ఇస్తారా? లేదంటే ఎమ్మెల్సీతో సరిపెడతారా? అనేలా అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో చిరంజీవి ఆశీస్సులు, ఆయన ఏమి కోరుకుంటున్నారో ఈ ట్వీట్ ద్వారా చెప్పినట్లుగా ఉందని, కాబట్టి ఇక డౌట్స్ అవసరం లేదనేలా, ఈ ట్వీట్‌కు పొలిటికల్ సర్కిల్స్‌లో వార్తలు వినిపిస్తున్నాయి.

మరోవైపు డిప్యూటీ సీఎంగా చిరంజీవి చిన్న తమ్ముడు పవన్ కళ్యాణ్ పాలిటిక్స్‌లో దూసుకెళుతున్న విషయం తెలిసిందే. పవన్ కళ్యాణ్ దగ్గరే కీలకమైన నాలుగు శాఖలు ఉన్నాయి. జనసేన పార్టీ పోటీ చేసిన అన్ని స్థానాల్లో గెలవడంతో పాటు కూటమి అధికారాన్ని చేపట్టంలో కీలక పాత్ర పోషించింది. అందుకే పవన్ కళ్యాణ్‌కు సీఎం చంద్రబాబు ఎంతో ప్రాధాన్యతను ఇస్తున్నారు. పవన్ అడగగానే ఆయన అన్నయ్య నాగబాబును ఎమ్మెల్సీ బరిలోకి దించడం, ఇప్పుడు మంత్రి పదవి కూడా ఇవ్వబోతుండటంతో మరోసారి సీఎం చంద్రబాబు తనకు పవన్ కళ్యాణ్ ఎంత ఇంపార్టెంటో చెప్పినట్లయింది.

ప్రస్తుతం చిరంజీవి రాజకీయాలకు దూరంగా ఉన్నప్పటికీ తన తమ్ముళ్ల కోసం అప్పుడప్పుడూ ఇలా ట్వీట్స్ చేస్తూ వారికి బూస్ట్ ఇస్తూ వస్తున్నారు. అలాగే జనసేన పార్టీ కోసం మొదటి నుంచి నాగబాబు ఇస్తున్న మద్దతు కూడా అందరికీ తెలుసు. అసలు కూటమి తరపున ఎన్నికలలోనే పోటీ చేయాల్సి ఉంది. కానీ చివరి నిమిషంలో ఆయన తన సీటును త్యాగం చేశారు. నాగబాబు చేసిన త్యాగాన్ని గుర్తిస్తూ.. కూటమి ప్రభుత్వం ఆయనని ఎమ్మెల్సీగా ప్రభుత్వంలోకి ఆహ్వానించింది.

ఇవి కూడా చదవండి:

Nagababu MLC: నాగబాబుకు ఆ ఛాన్స్ ఉందా? లేదా?

Hari Hara Veera Mallu: ‘హరి హర వీరమల్లు’ రిలీజ్ డేట్ మారింది.. ఫైనల్‌గా ఆ ఐకానిక్ డేట్ ఫిక్సయింది

Just In

01

Ponguleti Srinivasa Reddy: త్వరలో సాదాబైనామాలకు మోక్షం.. మంత్రి కీలక వ్యాఖ్యలు

Su From So OTT release: ‘ఓటీటీలోకి వచ్చేస్తున్న కామెడీ థ్రిల్లర్.. ఎక్కడంటే?

BRS Party: గులాబీ పార్టీకి డ్యామేజ్.. కంట్రోల్ చేసేందుకు ప్రయత్నం?.. సాధ్యపడేనా..?

Ganesh Nimajjanam 2025: అయ్యో గణపయ్య ఎంత ఘోరం.. నిమజ్జనం చేస్తుండగా.. కింద పడ్డ విగ్రహాలు

Bhatti Vikramarka: విద్యారంగం పై ఊహించని రీతిలో సర్కారు పెట్టుబడులు